అంశం:: విజ్ఞతల విత్తు నాటుదాం
శీర్శిక: వృత్తి - ప్రవృత్తి
*సంకల్పం ఉంటే సాధించలేనిదేముంటుంది*
*విజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోగలుగుతే
విషాదం ఎందుకుంటుంది*
*వెలుతురు మొలిచిన చోట చీకటి ఎందుకు*
*పుడుతుంది*
భూమి ఎంతో విశాలమైనది
ప్రతి మనిషి అందులో పది విత్తనాలు నాటాలి
ఒకటి పుచ్చి పోవచ్చు ఒకటి వాయుదేవుడు
ఎత్తుకుని పోవచ్చు
మరొక దానిని పక్షి తినవచ్చు
మొక్కమొలిచాక ఒక దానిని మేక తినవచ్చు
ఇంకో మొక్క సాలు దున్నినపుడు పోవచ్చు
చివరికి ఐదు చెట్లైన మిగిలిన
అవి పెరిగి సంపదను చేకూరుస్తాయి
ఈ ప్రపంచంలో అవకాశాలు ఎన్నో
ప్రతి మనిషి అలా తమ వృత్తినే గాకుండా
ఆదాయ ప్రవృత్తులను ఎంచుకుంటే
డబ్బుకు , ఆనందానికి కొదువ ఉండదు
సంతోషాలకు, సుఖాలకు హద్దు ఉండదు
టీచర్ వృత్తి అయినపుడు, షేర్ మార్కెట్,
మూచువల్ ఫండ్స్, ఏజెంట్లు, రియలెస్టేట్
సలహాదారు, యూట్యూబ్ ఛానెల్స్, ట్యూషన్లు
నటనలు, నృత్యం, పాటలు వ్రాయడం, మరెన్నో
ప్రవృత్తులవుతాయి
వృత్తి ఆదాయం అనేది అరువది యేండ్ల వరకే
ప్రవృత్తి వనరులు నూరేళ్ళ వరకూ ఉంటుంది
అంతేకాదు , అనంతకాలమనే చెప్పాలి
ఇలా వృత్తి ప్రవృత్తులను ఎంచుకోవడమే విజ్ఞత
కాస్త వివేచన ఉంటే చాలు
*మనం నిద్రపోయినప్పుడు కూడా*
*మన సంపద పెరుగాలి అంటారు*
- వారెన్ బఫెట్
విజ్ఞానం సమాజ వికాసానికి దారితీయాలి
కానీ మానవ వికారానికి దారి తీయకుండా
మోసాలకు, స్కాములకు పాల్పడకుండా
ఉంటే మేలు
No comments:
Post a Comment