భక్తి గేయాలు
శీర్షిక: కోదండ రాముడుధశరత తనయుండు దయగల రాముండు
విద్య లెన్నొ నేర్చె వినయముగను
తల్లిదండ్రులవలె ధర్మము పాటించె
రామ బాట యెపుడు రాచబాట!
ఎంత వాడు నైన యెంత కీర్తిగడించ
కాంత మాటనేల కాన కుండు
అడవి నంపె తండ్రి నభిరాముడినికను
రామ బాట యెపుడు రాచబాట!
రామ రామ యంటు రామున్ని వేడ్కొన
సకల ఫలములిచ్చు శాంత రామ
కోరు కోర్కె దీర్చు కోదండ రాముండు
రామ బాట యెపుడు రాచబాట!
నలుగురి మదిలోన పలుచనైనంకను
ఎంత వేద మెరిగి నేమి ఫలము
రావణుండు చచ్చె రాముడి చేతిలో
రామ బాట యెపుడు రాచబాట!
ఎన్నొ బాధ లెరిగి యెంతొ పేరును గాంచి
అయిదు వందలేండ్లలిగెనయోధ్య
మోడి వలన నేడు వీడె రామ చరలన్
రామ బాట యెపుడు రాచబాట!
No comments:
Post a Comment