Wednesday, December 18, 2024

హత్తుకున్న స్వప్నాలు

అంశం: *హత్తుకున్న స్వప్నాలు*


శీర్శిక: *కలనా నిజమా*

*స్వప్నాలు సత్యాలవుతాయా!*
*అవి మనసుకు హత్తుకుంటాయా!*

ఏమో ,
నిజమూ కావచ్చు
అబద్దమూ కావచ్చు
కళ్ళు తెరవగానే
మనసు నుండి ఎగిరి పోవచ్చు

నిద్రలలో రకాలు ఉన్నట్లే
కలలలో పలువిధాలు
ఉంటాయంటారు
మధ్యాహ్నం పడుకున్నపుడు
వచ్చే కలలను "పగటి కలలు'' అంటారు
పగటికలలకు ప్రాధాన్యత ఇవ్వరు

బ్రహ్మముహూర్తంలో వచ్చే స్వప్నాలకు
ఎంతో ప్రాముఖ్యత నట

స్వప్నాలనేవి
మనిషి మానసిక స్థితిని బట్టి
మనిషి ఆలోచనలు బట్టి
చుట్టు పక్కల వాతావరణం బట్టి
కాలాలను బట్టి వస్తుంటాయి

ఏవో ఏవో స్వప్నాలు
అలా అలా మెరుపు తీగల్లా
మబ్బుల్లో తేలినట్లుగా
నిదురలో వస్తుంటాయి
ఏవో గుర్తుంటే కదా
వస్తుంటాయి మదిలో
తళుక్కుమంటాయి
మాయ మవుతాయి

సుస్వప్నాలయితే సంతోషమే
దుస్వప్నాలయితేనే బాధ, బయం
పట్టించుకోకుండా ఉంటేనే మేలు

ఆది జనవరి పద్దెనిమిది,
పందొమ్మిది వందల తొంబది ఆరు
బ్రహ్మ ముహూర్తంలో ఓ పీడ స్వప్నం
ఎవరో అతనిని వెనుకనుండి
షూట్ చేసినట్లుగా
రుధిరం వరుదలై పారుతుంది
ఆ మనిషి చని పోయారు
వెంటనే మేలుకువ వచ్చింది
ఫ్యామిలీ తో పంచుకున్నను

ఉదయం ఆరుగంటలకే
టీ.వి.లలో వార్త
గుండె పోటు తో చనిపోయినట్లుగా
*కలనా నిజమా* ఆశ్చర్యమేసింది
నిజం కాకూడదని
భగవంతుడిని ప్రార్ధించాను

ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు
నటరత్న నందమూరి తారక రామారావు

అందుకే అంటారు
కొన్ని స్వప్నాలు నిజం కావచ్చు
కొన్ని కలలు అబద్ధాలు కావచ్చు
కొన్ని బాధ పెడితే, మరికొన్ని
సంతోషాన్నిస్తాయి

       

No comments: