అంశం: *పొడి రెప్పల మాటున*
శీర్షిక: *తడారిన కనురెప్పలు*
ఎత్తెన ఆకాశ *హార్మ్యాలు*
*హార్మ్యాల* మధ్య *భవనాలు*
*భవనాల* నడుమ *పారేటి నదులు*
*నదుల* నానుకుని బీడు *భూములు*
*భూముల* లో చిన్న చిన్న *గుడిసెలు*
*గుడిసెల* లోనే బడుగు *జీవులు*
*జీవుల* ముఖాల్లో నేడు *తడారిన కనురెప్పలు*
గంట గంటకు గుడి గంటలు
మ్రోగినట్లు
గంట గంటకు బుల్డ్రోజర్ల హారన్లు
పోలీసుల బూట్ల చప్పుల్లు
గుండెలను పిండుతున్నాయి
బిక్కు బిక్కు మంటూ దిక్కులేని పక్షుల్లా
జీవనోపాధికి నోచకోక
కడుపులు ఎడారవుతున్నాయి
కనులు పొడారుతున్నాయి!
జంట నగరాల నిండుగా
మూసీనది చుట్టూరా
యేళ్ళ కొలదీ నివశిస్తున్న
ఇండ్లు కూలుతున్నాయి
ఎవరినీ ఎదిరించలేని అశక్తతతో
*తడారిన కను రెప్పల* మాటున దాగిన
బడుగు జీవుల ముఖాల్లో
అట్టడుగున దాగి ఉన్న
అశ్రువులు పెల్లుబుకుతున్నాయి
స్వాతంత్ర్యం వచ్చి
ఏడు దశాబ్దాలు దాటినా
విద్యుచ్ఛక్తి సౌకర్యాలు
త్రాగు నీటి సదుపాయాలు
విద్య వైద్య సౌకర్యాలు లేక
బోరుమంటుంటూ
దుఃఖంతో కుమిలి పోతుంటే
పుండు మీద కారం చల్లి నట్లు
కష్ట జీవుల గూళ్ళనే కూల్చిరా!
ఐదేళ్ళకోసారి ఎన్నికలు వస్తాయి
ఎన్నికలప్పుడే నాయకులు
ఓటుకో నోటు చేతికి ఇచ్చి
ఆ పూటకు పావు షేర్ పోయించి
కడుపు నిండా బిర్యానీ తినబెట్టి
కనబడరు మరో ఐదేళ్ల వరకు
ఇచ్చిన హామీలన్నీ బుట్ట దాఖలు!
ఐదేళ్ల పాలన కాలం నేతలదనీ
నూరేళ్ళ జీవన కాలం ఓటర్లదనీ
గుర్తించ కుండిరా!
తడారిన బ్రతుకుల్లో
ఇంకెంత కాలం ఈ బానిసత్వం
ఇంకెన్నాళ్ళు ఈ నిరంకుశత్వం
ఇంకెన్నాళ్ళు ఈ అంధకారం
మరెంకెన్నాళ్ళు ఈ ఈసడింపు
ఇంకెన్నాళ్ళు ఈ బడుగుల జీవితాలతో
పరిహాసాలు
వెలుగులు నింపాల్సిన గుండెల్లో
ఇంకెన్నాళ్ళీ రైల్ల పరుగులు!
ఇక నైనా ప్రభుత్వాలు గుర్తించేనా
బడుగు జీవుల కష్టాలను తొలగించేనా
విద్య వైద్యం విద్యుత్తు సదుపాయాలు
ఉచితంగా అందించేనా
వారి గుడిసెలను వారికందించి
స్వేచ్ఛగా జీవించ డానికి
అవకాశాలు కల్పించేనా
జీవనోపాది చూపించేనా
రాజ్యాంగ హక్కులను
కాల రాయకుండా చూసేనా
చట్టం ముందు అందరూ సమానులే
అని నిరూపించేనా!
No comments:
Post a Comment