శీర్శిక: భాద్యత
*భాద్యత లేని వారు భూమికి బరువు అంటారు*
*భాద్యత* అనేది మూడు అక్షరాల పదమే
అయినా అది ఎంతో బరువైనది, బలమైనది
విలువైనది , శక్తి వంతమైనది
భారత దేశం వేదాలకు , పురాణాలకు
ఇతిహాసాలకు , సంస్కృతి, సాంప్రదాయాలకు, కళలకు నాగరికతకు పుట్టినిల్లు
ఇలాంటి మన దేశంలో
ఎవరికి ఎలాంటి భాద్యతలు ఉండాలో
మన సంస్కృతి చెప్పకనే చెబుతోంది
పూర్వీకుల నుండి తరతరాలుగా వస్తుంది
మన నాగరికత నవనాడుల్లో చేరిపోయింది
మన సంస్కృతి, సాంప్రదాయాలు
భిన్నమైనది మన భారతావని
ఇది ప్రపంచానికే ఆదర్శం
నేడు ప్రపంచ దేశాలన్నీ, మన సంస్కృతిని
అలవర్చుకోడానికి బారులు కడుతున్నారు
రాజ్యాంగంలో , హక్కులతో పాటు
భాద్యతలను కూడా పొందుపరిచారు
రాజ్యాంగ కర్త డా. అంబేద్కర్
అవి ప్రతి ఒక్కరికీ శిరోధార్యం
శిశువు నుండి ముసలి వరకు
పిల్లలకు జన్మనిచ్చినందులకు
వారిని పెంచి పోషించాల్సిన
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన
దేశ ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన
కర్తవ్యం తల్లిదండ్రులపై, ప్రభుత్వాలపై
సమాజంపై ఉంటుంది
పిల్లలు యుక్తవయసు వచ్చాక
సమాజానికి , ప్రభుత్వాలకు,
దేశానికి సహకరించాల్సిన భాద్యత
యువతీయువకులపై ఉంటుంది
తల్లిదండ్రులు వృద్దులయ్యాక
వారిని పోషించాల్సిన ,
సేవలందించల్సిన, కర్మకాండలు
చేయాల్సిన భాద్యత కొడుకులు
కూతుర్లపై ఉంటుంది
దేశ రక్షణకు ఒక సైనికుడిగా
విపత్కర, అసాధారణ సంఘటనలు
జరిగినప్పుడు ఒక సేవకుడిగా
సేవలు అందించాల్సిన విధి
ప్రతి ఒక్కరిపై ఉంటుంది
నీతి నిజాయితీగా నడుచుకోవడం
అవినీతికి పాల్పడకుండా ఉండటం
దేశంలో, రాష్ట్రాలలో కుల , మత
ప్రాంతీయ, జాతీయ విద్వేషాలు
సృష్టించకుండా ఉండటం
ప్రభుత్వ ఆస్తులను నష్టపరుచకుండా
ఉండటం,ప్రతి పౌరుడి కర్తవ్యంగా భావించాలి
ప్రజల ఓట్లతో ఎన్నుకోబడిన నాయకుడు
ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు
దేశ రక్షణ కొరకు ఎంపికైన సైనికులు
తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి
శత్రుదేశంలో పట్టుబడిన సైనికులు
తమ దేశం గురించి ఎలాంటి సమాచారం
అందించకుండా ఉండాల్సిన భాద్యత
వారిపై ఉంటుంది
*భాద్యత* అనేది అణుబాంబు లాంటిది.
ఏ మాత్రం అలసత్వం వహించినా
విధ్వంసం అతి భయంకరంగా ఉంటుంది
No comments:
Post a Comment