జ్ఞానోదయం:
ఒక రోజు యధావిధిగా బుద్దుడు తన శిష్యులతో కలిసి భిక్షాటనకు బయలు దేరాడు.
అలా అలా దారి వెంట వెలుతూ ఉంటే , ప్రజలు వారి స్థోమతకు తగ్గ, వారికి అందుబాటులో ఉన్న బియ్యం, పండ్లు, డబ్బు వారి జోలెలో వేసి మ్రొక్కే వారు. వారికి బుద్దుడు ఆశిస్సులు అందించి ముందుకు సాగే వాడు.
ఇలా దారి వెంట వెలుతుండగా ఒక ఆమె ఎదురుగా వచ్చి బుద్దుడిని నిలదీసింది, " ఏమయ్యా నీవు చూస్తే కండలు పెంచుకుని ధృడంగా ఉన్నావు. ముఖం తేజస్సుతో వెలిగి పోతుంది. ఇలా ఇండ్ల చుట్టూ తిరుగుతూ అడుక్కోవటం సిగ్గు అనిపించడం లేదా? ఏదో ఒక పని చేసి, కాయా కష్టం చేసి సంపాదించుకోవచ్చు కదా?" అంటూ నానా మాటలు అంటూ, పో పో అని అంది.
శిష్యులకు పట్టరాని కోపం వచ్చింది. ఒక సమయంలో ఆ స్త్రీ ని కొట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ వారి గురువు, బుద్దుడిని గుర్తుకు తెచ్చుకుని కోపాన్ని అనుచుకున్నారు. కేవలం కోపంతో ఆమెవైపు చూసారు తప్పా ఏమి అనలేక పోయారు.
ఇక ఆ సన్యాసి బుద్దుడు, ఆమె వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి, ముందుకు సాగాడు.
శిష్యులు పట్టరాని కోపంతో ఉన్నారు. గురువు, ఆమె యెడల అంత మౌనంగా ఎందుకు ఉన్నారు, ఒక్క మాటైన ఆమెను అనలేదు. కోప్పడకుండా, పైగా చిరునవ్వు నవ్వి పోతున్నాడు అని , ఒక వైపు బాధ మరో వైపు భయం. ఎలా అడుగాలని.
వారిలో ఒక శిష్యుడు ధైర్యం చేసి, ఇలా అడిగాడు,
"స్వామి, నా మాట తప్పైతే క్షమించండి, ఆమె అంతలా అన్నన్ని మాటలు అంటుంటే, మీరు ఏమి అనకుండా , ఆమె వైపు చూసి, చిరునవ్వు నవ్వి ముందుకు సాగారు. మాకు చెప్పినా మేము ఆమెను తిట్టే వాళ్ళం కదా, కొట్టే వాళ్ళం కదా" అని అన్నాడు.
బుద్దుడు, అప్పుడు కూడా ఆ శిష్యుడి వైపు చూసి, ఒక చిరునవ్వు నవ్వి,
"చూడు నాయనా! ఆంతకు ముందు ప్రజలు మనకు ఎన్నో రకాల ద్రవ్యాలు సమర్పించుకున్నారు. వాటిని మనం స్వీకరించాం.అవి మన వెంట వస్తున్నాయి. అవి మనకు బరువుగా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఆమే ఏవో మాటలు అన్నది అని అంటున్నావు. వాటిని మనం స్వీకరించలేదు. మన వెంట తీసుకుని రావడం లేదు. ఆమె మాటలను అక్కడే వదిలేసాము. ఇక ఆమె మాటలు మనకు బరువు ఎలా అవుతాయి? బాధను ఎలా కలిగిస్తాయి? ఆమె మాటలు ఆమె వద్దనే ఉన్నాయి కాబట్టి, ఆమెనే బాధిస్తాయి" అని అంటాడు.
శిష్యులకు కళ్ళు చెదిరిపోయాయి. జ్ఞానోదయం కలిగింది. తమ తప్పును మన్నించమని , గురువులైన బుద్ధుడికి సాష్టాంగ నమస్కారం చేసి ముందుకు సాగారు.
No comments:
Post a Comment