Tuesday, December 10, 2024

సంస్కృతి వారసత్వం

అంశం: సంస్కృతి వారసత్వం

శీర్శిక: *సిరి సంపదలు*

*ప్రకృతి లేకుండా పారవశ్యం లేదు*
*సంస్కృతి లేకుండా మానవ మనుగడ లేదు*

సంస్కృతి, సాంప్రదాయాలు
మానవుల మనుగడకు మూలాధారాలు
భారతీయుల జీవన విధానానికి
మూల స్తంభాలు

సంస్కృతి సాంప్రదాయాలు
నాగరికత కళలు
భారతీయుల సిరి సంపదలు
బావి తరాలకు బంగారు గనులు

వేదాలు పురాణాలు శాస్త్రాలు
ఇతిహాసాలైన రామాయణం
మహాభారతం, భాగవతం
కళలకు పుట్టినిల్లు

నాగరికతకు నడత నేర్పిన
ఋషులు మహా ఋషులు
కారణ జన్ములైన శంకరా చార్యులు,
శ్రీ రామానుజాచార్యులు
వేద పండితులు జన్మించిన
దేశం మన పుణ్య భూమి

జాతులు వేరైనా
కులాలు మతాలు వేరైనా
ప్రాంతాలు భాషలు వేరైనా
ఎవరి సంస్కృతి వారిదే
భిన్నత్వంలో ఏకత్వంలా
ఎవరెవరి సంస్కృతిని వారు
వారసత్వంగా అనుసరించడానికి
రక్షణ కల్పించే సెక్యులర్ దేశం
మన రాజ్యాంగం

భారతీయ వారసత్వ సంస్కృతి
ఐక్యతకు మూలాధారం
భారతీయ నాగరికత కట్టుబాట్లు
జీవన మనుగడకు
జీవన విధానానికి ఆయువుపట్టు

భారతీయ సంస్కృతి , సంగీతం, కళలు
బావి తరాలకు తరగని సంపద
భారతీయ జీవన విధానం , నాగరికత
ప్రపంచ దేశాలకు ఆదర్శం

*దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే సంస్కృతి
సాంప్రదాయాలోయ్*

No comments: