అంశం : మరో చరిత్ర
శీర్షిక : *చంటి పిల్ల తల్లి*
అది పందొమ్మిది వందల తొంబది
నాలుగవ సంవత్సరం అక్టోబర్, ఇరువది ఆరు హైదరాబాద్ నుండి ఫ్యామిలీ తో
నల్ల బెల్లి, వరంగల్ జిల్లా,
మా అక్కయ్య ఇంటికి బయలు దేరాం
వరంగల్ లో ట్రేయిన్ దిగి , గిర్ని బావి
చేరేసరికి రాత్రి 8 గం.లు అయింది.
అక్కడి నల్లబెల్లి కి వెళ్ళా లంటే
మరో బస్సు ఎక్కాలి
బస్సు కొరకు వేచి చూస్తున్నాం
ఇదే చివరి బస్సట
అది పోయిందంటే మరొకటి లేదట
కళ్ళల్లో వత్తులు పెట్టుకుని చూస్తున్నాం
వీది లైటు క్రింద నిలుచుని ఉన్నాం
ఇంతలోనే ఎర్ర బస్సు
హారన్ కొట్టుకుంటూ వచ్చి ఆగింది
డ్రైవర్ బయటకు వచ్చి
నల్లబెల్లి నల్లబెల్లి, లాస్ట్ బస్
అంటూ అరుస్తున్నాడు
మేము గబా గబా బస్ ఎక్కి
సీట్లట్లో కూర్చున్నాం
ప్యాసింజర్స్ కూడా ఎక్కువగా లేరు
సుమారుగా రాత్రి 9 గం.లకు
బస్ బయలుదేరింది
కండక్టర్ వచ్చి అందరికి
టికెట్స్ ఇస్యూ చేశాడు
ముందు వెళ్ళి కండక్టర్ సీట్లో కూర్చున్నాడు
ప్రతి స్టేజీలో ప్యాసింజర్స్ దిగుతున్నారు
కానీ ఎవరూ ఎక్కడం లేదు
మేము దిగాల్సిన స్టేజి చివరి స్టేజి
అదే నల్లబెల్లి
రెండు మూడు స్టేజీలు దాటాక
ఒక మహిళ చంటి పిల్లను చంకనేసుకుని
చింపిరి జుట్టుతో ఏడ్చుకుంటూ
నడిరోడ్డుపైకి వచ్చి ఆపండి ఆపండి
అంటూ ఏడుస్తూ అరుస్తుంది
బస్సు లైట్లు తప్పా మరో లైట్లు లేవు
డ్రైవర్ బస్సును ఆపాడు
ఆ తల్లి బస్సు ఎక్కింది
వయసు సుమారుగా ముప్పది
ఏండ్లు ఉండవచ్చు
కండక్టర్ లేచి వచ్చి
ఎక్కడికని అడిగాడు
నల్లబెల్లి అని చెప్పింది
డబ్బులు రూ.లు 20/- ఇవ్వమన్నాడు
లేవు నాదగ్గర అంది
"ఏంటి ఇది మీ తాత బస్సా అనుకున్నావా"
అంటూ, "డబ్బులు లేక పోతే దిగిపో అన్నాడు"
అది చిమ్మ చీకటి,
ఆమె కాళ్ళువ్రేళ్ళు పట్టుకుంది
అయినా కనికరించలేదు కండక్టర్
కండక్టర్ అరుపులు, ఆ మహిళ ఏడ్పులు
బస్ దద్దరిల్లిన పోతుంది
ఆమే మా తల్లిగారిని అడిగి ఇస్తానంటే
కండక్టర్ కాస్త శాంతించాడు
చివరి స్టేజ్ నల్లబెల్లి రానే వచ్చింది
ప్యాసింజర్స్ అందరూ దిగి వెళ్లిపోయారు
ఆమెతో కండక్టర్ గొడవ పడుతున్నాడు
చంటి పాప ఏడుస్తుంది
మేము ఫ్యామిలీ తో చివరగా
లగేజ్ తీసుకుని దిగుతున్నాం
తెల్లవారాక అడిగి తీసుకొస్తానని
ఆ పిచ్చి తల్లి బ్రతిమి లాడుతుంది
వినక పోయేసరికి, అందాక చెవి కమ్మలు
పెట్టుకో అంది .
మెడలో పసుపు తాడు తప్ప మరేమీ లేదు
భర్తతో, అత్తామామలతో గొడవ పడినట్లు
అర్ధమైంది , ఏమి తిననట్లు తెలుస్తుంది
"అయితే ఈ రాత్రి బస్సులో పడుకో.
రేపు వెళ్లి డబ్బులు అడుక్కుని రా"
అని అన్నాడు కండక్టర్
ఆ తల్లి ఏడుస్తూ బ్రతిమి లాడుతుంది
నాకు ఒక్క సారే , చిర్రుమని కోపం వచ్చింది
ఒకటి వేయాలనిపించింది
కానీ కొట్టడం సమస్యకు పరిష్కారం
కాదని సముదాయించు కున్నాను
వెంటనే నేను ఆ బస్ చార్జీలు చెల్లించాను
ఆ పిచ్చి తల్లిని ఇంటికి వెళ్ళమని చెప్పి
నేను మా ఫామిలీ, ఇద్దరు పాపలతో కలిసి
ఇంటికి బయలు దేరాము
ఈ కవితని ఆ "చంటి పిల్ల తల్లికి" అంకితం ఇస్తున్నాను
No comments:
Post a Comment