అంశం: సిగ్మాలు
శీర్షిక: *అలా?**ఎందుకు* ఈ పెళ్లి ఖర్చు
*ఎందుకు* అనిపించడం లేదా నీకు
*ఏమిటి* నీ చేతిలో ఉంది చూడవచ్చా
*ఏమిటి* అంత ధరనా, వృధా ఖర్చు
*ఎలా* ఉంది ఈ కాకి బంగారం గొలుసు
*ఎలా* ఉన్నాయి ఈ వెండి పట్టీలు
*ఎప్పుడు* అటో ఇటో చూస్తావేంటీ
*ఎప్పుడు* ఇలానే ఉంటావా రాధిక
*ఎక్కడ* ఉన్నారు మీ అమ్మానాన్నలు
*ఎక్కడ* ఉన్నారు మా అమ్మానాన్నలు
బంధువులు *ఎవరు* ఇంకా రాలేదేమీ
అయిననూ *ఎవరు* రాకుంటే ఏమి
*ఇలా* మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకు
*ఇలా* దగ్గరకు రా రాధిక
*చేత* నైనంతనే డబ్బు ఖర్చు చేద్దాం
*చేత* కాకుంటే అది అనవసరం అని అనుకుందాం
నీ *వలె* అందరూ ఉంటే ఆ కుటుంబం స్వర్గం
నీ *వలె* ఎదురు మాట్లాడకుండాకుంటే ఆ జీవితం ధన్యం
*అలా* వెళ్లి రిజిస్టర్ పెళ్లి చేసుకుందామా!
*అలా* నే హానీ మూన్ కూడా వెల్దాం, సరేనా!
No comments:
Post a Comment