శీర్శిక: *బ్రహ్మ ముహూర్తం*
రెప్ప పాటు
సమయంలో
గడియారం సన్న ముల్లు
గిర్రున తిరుగుతూనే ఉంటుంది!
అలాగే
కూర్చున్నా నిలబడ్డా
క్షణం క్షణం విలువైన సమయం
కరిగి పోతూనే ఉంటుంది!
*గెలుపుకు ఓటమికి
మధ్య తేడా ఒక సెకనే*
ఒక సెకను కావచ్చు
ఒక నిమిషం కావచ్చు
లేదా ఒక గంటే కావచ్చు
*ఆలస్యమైతే అమృతం
విషమం అవుతుంది*
గెలుపు ఓటమి అవుతుంది!
ముఖం బాగ లేక
అద్దాన్ని నేలకు కొడితే
లాభమేంటి?
సమయాన్ని
సద్వినియోగం
చేసుకోవడం తెలియక
ఆగుతలేదని , ఉరుకుతుందని
సమయాన్ని తిట్టుకుంటూ పోతే
ప్రయోజనం ఏమిటి?
*సమయం*
మూడు అక్షరాల పదమే
కానీ దాని శక్తి అనంతం
దాని ప్రయోజనం అద్వితీయం!
కంటికి కనబడనిది
పిలుస్తే పలుకనిది
కొంటే దొరుకనిది
కానీ దాని విలువ
వెలకట్టలేనిది!
సమయానికి
స్వార్ధం లేదు
అహము లేదు
ఈర్ష్య అసూయ
అంతకూ లేవు!
సమయానికి
పక్షపాతము లేదు
పేద ధనిక, పండిత పామర
భేదం తెలియదు!
*సమయం
ఒక బంగారు గని*
దానిని పొందడానికి
అందరికీ అవకాశం ఉంది
ఎంతంటే అంత
వినియోగించుకోడానికి
పూర్తి స్వేచ్ఛ ఉంది
అదియును ఉచితంగా!
సమయం
అర్జునుడి
అస్త్రశస్త్రాలకన్నా
గొప్పది
ఎవరైతే సమయాన్ని
నియంత్రణలో
పెట్టుకుంటారో
వారే విజేతలు
ఈ జగత్తులో!
భూపరిభ్రమలో
ఎవరికైనా
లభించు సమయం
రోజుకు ఇరువది
నాలుగు గంటలే
కానీ, దాని గొప్పతనం
రూపాయి ఖర్చు లేకున్నా
సమయాన్ని బట్టి
మారుతుంది!
సమయం
బ్రహ్మ ముహూర్తం
ఉదయం
మధ్యాహ్నం
సాయంకాలం
నిశి కాలం!
ఎవరైతే
*బ్రహ్మ ముహూర్తాన*
తెల్లవారు జాము మూడు
గంటల నుండి
ఐదు గంటల లోపు
లేస్తారో
వారే విజేతలవుతారు
బ్రహ్మ ముహూర్త సమయమే
అత్యంత శ్రేష్టమైన సమయం!
*బ్రహ్మ ముహూర్తాన*
లేచిన వారు
ఎక్కువ సమయం
మిగుల్చుకో గలుగుతారు
సమయాన్ని
నియంత్రించ గలుగుతారు!
*బ్రహ్మ ముహూర్త కాలంలో*
వాతావరణం
చల్లగా ఉంటుంది
విశ్వం
నిశ్శబ్దంగా ఉంటుంది
మనసు
ప్రశాంతంగా ఉంటుంది
చదివింది చక్కగా
గుర్తుండి పోతుంది
మంచి ఆలోచనలు వస్తాయి
సరియైన నిర్ణయాలు
తీసుకుంటారు!
No comments:
Post a Comment