అంశం: *హత్తుకున్న స్వప్నాలు*
శీర్శిక: లక్ష్యం
*"మనిషి తలుచు కుంటే సాధించలేనిది ఏమిటి?"*
*"కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి"*
అంటారు గోప్ప శాస్త్ర వేత్త డాక్టర్ అబ్దుల్ కలాం
ప్రతి మనిషిలో ఒక లక్ష్యం , ఒక స్వప్నం
అంటూ ఏర్పరుచు కోవాలి
ఆ కలను, ఆ డ్రీమ్ సాధించడానికి
దార్శనికత కలిగి ఉండాలి
ముందు చూపు ఉండాలి
నిరంతరం కృషి చేయాలి
స్వప్నాన్ని సాకారం చేసుకోవాలి
కలలు కనడం ఎవరికైనా సాధ్యమే
కానీ స్వప్నాలు సాధికారం చేసుకోవడంలో
ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి
వాటిని అధిగమిస్తేనే లక్ష్యం చేరడం సాధ్యం
ఎవరైనా ఊహించి ఉంటారా
మారుమూల గ్రామంలో జన్మించి
గ్రామీణ వాతావరణంలో పెరిగి, అక్కడే చదివి
చింత గింజలు, వేప గింజలు ఏరుకుని అమ్మి
ఇంటింటా పాల ప్యాకెట్లు, పేపర్లు వేసి
స్కూల్లో వెనుక బేంచీలో కూర్చునే అబ్బాయి
ప్రపంచ గొప్ప శాస్త్రవేత్త అవుతాడని గానీ
భారత దేశ రాష్ట్రపతి అవుతాడని గానీ
*భారత రత్న* అందుకుంటాడని గానీ
కానీ , నిరంతర కృషి, పట్టుదల, సంకల్పంతో
తన స్వప్నాన్ని సాధించారు డాక్టర్. కలామ్
స్వప్నాన్ని సాధించడం ఏ వయసులో నైనా
సాధ్యపడుతుంది
పదహారు సంవత్సరాలు స్కూలుకు వెళ్ళకుండా
తండ్రితో చిన్నా చితకా పనులు చేస్తూ
ఆటా పాటలతో కాలం గడుపుతూ
ఆ తర్వాత అయ్యారు , గురుముఖతః
గొప్ప వ్యాకరణ కర్తగా,
తెలుగు నిఘంటువు కర్తగా, కవిగా
పండితుడిగా, సాహితీ వేత్తగా
ఉత్తమ ఉపాధ్యాయుడుగా,
బహు భాషా కోవిదుడుగా రాణించారు
"చిన్నయసూరి* .
లోకజ్ఞానం వచ్చాక
లేదా జీవితంపై అవగాహన ఏర్పడ్డాక
కలలను కనాలి, లక్ష్యం ఏర్పరుచు కోవాలి
డ్రీమ్స్ ను స్వంతం చేసుకోవడానికి
కలలను సాకారం చేసుకోవడానికి
వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటూ
నిత్యం శ్రమించినట్లైనా
అనుకున్నది తప్పకుండా సాధించవచ్చు
సాధించిన స్వప్నాలను
హృదయానికి హత్తుకుని
సంతోషాలలో తేలిపోవచ్చు
ఆనందాలతో పరవళ్లు తొక్కువచ్చు
No comments:
Post a Comment