అంశం: గుప్పిట నిండా ధైర్యపు వెన్నెల
శీర్శిక: ధైర్యే సాహాసీ లక్ష్మీ
*గుప్పెడంత ధైర్యం కొండంత బలాన్నిస్తుంది*
ఈ సృష్టిలో
డబ్బు వలన తృప్తి లభించదు
సంపద వలన తృప్తి లభించదు
విద్య వలన హోదా వలన తృప్తి లభించదు
శారీరక సుఖం వలన తృప్తి లభించదు
కేవలం *విజయం* వలన తృప్తి లభిస్తుంది
*ధైర్యం* మే విజయానికి మూలం
ఆ ధైర్యం మనో నిగ్రహం వలన లభిస్తుంది
గెలుపునకు కావాల్సింది
బలం కాదు, శారీరక దృఢత్వం కాదు
గెలుపునకు కావాల్సింది
నమ్మకం, సంకల్పం, మనో ధైర్యం
నీవు భయపడుతుంటే
ఈగ దోమ కూడా నెత్తిమీద కూర్చుని
సవారి చేస్తాయి
భయపడకుండా
నీవు ధైర్యంగా ఉండి
ఎదురు తిరిగెతే
ఈగ దోమనే కాదు
ఎలాంటి వారైనా తోక జాడించాల్సిందే
ధైర్యం ఒంటరిగా ఉన్నపుడు
కొంత తగ్గవచ్చు
సమైక్యంగా ఉన్నపుడు ధైర్యం
మరింత ఇనుమడిస్తుంది
జింక ఒంటరిగా కనబడినా
దున్నలు ఒంటరిగా కనబడినా
పులి వెంటబడి పంజా విసురుతుంది
పది జింకలు లేదా పది దున్నలు
తిరుగ బడితే పులి పలాయనం చిత్తగిస్తుంది
*ధైర్యే సాహాసీ లక్ష్మీ* అన్నారు పెద్దలు
ధైర్యం సాహాసాన్ని సంపదను
సకలం సమకూరుస్తుంది
తనకాళ్ళ మీద తాను నిలబడాలన్నా
ఎదుటి వారిని ఎదిరించాలన్నా
ప్రతి మనిషికి ఉండాలి ధైర్యం
ఆకాశంలో విహరించే
పక్షులకు క్రింద పడిపోమనే
నమ్మమే వాటికి ధైర్యం
ధైర్యం సాహసం ఉంటేనే
ఏదైనా సాధించవచ్చు
నమ్మకానికి ధైర్యం తోడైతేనే విజయం
పరిస్థితులను బట్టి కూడా
ధైర్యం ఏర్పడుతుంది
ఒక కోడి తన పిల్లలను
తన్నుకు పోయే గ్రద్ద వచ్చినప్పుడు
కోడి తరిమి కొడుతుంది
పిల్లి తన పిల్లలకు జన్మనిచ్చినపుడు
పిల్లి వంక చూస్తేనే పులిలా మారిపోతుంది
పిల్లలను రక్షించు కోడానికి గాండ్రిస్తుంది
బలం ఉన్నా లేకున్నా ధైర్యం ఉండాలి
ధైర్యం వ్యక్తిత్వం లో భాగం
ధైర్యం ఉంటే ఎలాంటి చీకటినైనా చేధించవచ్చు
నీపై నీకు నమ్మకం, క్రమ శిక్షణ ధైర్యం ఉంటే,
ఎంతటి ఉన్నత స్థాయికైనా సునాయాసంగా
చేరవచ్చు
No comments:
Post a Comment