Tuesday, December 10, 2024

గిడుగు తెలుగు వాడుక భాష గొడుగు

శీర్షిక: *గిడుగు "తెలుగు వాడుక భాష" గొడుగు*

(ప్రక్రియ: మణిపూసలు
రూపకర్త: వడిచర్ల సత్యం)

సమైక్యాంధ్రప్రదేశ్ లో
పర్వాతాల పేటలో
జన్మించినాడుగిడుగు
ఒక చిన్న గ్రామంలో!

మహాన్నత పండితులు
గొప్ప ఉపాధ్యాయులు
బహుభాషా కోవిదుడు
మంచి అనువాదకులు!

వాడుక తెలుగు పిడుగు
తెలుగు భాషా గొడుగు
మాతృభాష ఉన్నతికై
వేసెను ముందు అడుగు!

ఆధునిక తెలుగుకు, స్పూర్తి
పిడుగు గిడుగు రామమూర్తి
రావు సాహెబ్ బిరుదుతో
పొందెనెంతో ఘణ కీర్తి!

తెలుగు భాష దినోత్సవము
గిడుగు వారి జన్మదినము
తెలుగువారెందరికో
గొప్పస్పూర్తి దాయకము!

సంస్కృతమను భాషను
వ్యవహారికం లోను
మార్చెను సరళము గాను
తెలుగులోకి భాషను!

బాష సంస్కరణయోధుడు
చిరశ్మరణీయధీరుడు
కళా ప్రపూర్ణ బిరుదుతో
తెలుగుకు వన్నెతెచ్చాడు!

భాషోధ్యమకారులు
భాషాపితామహులు
వాడుక భాషను శ్వాసగ
భావించిన పుణ్యులు!

కమ్మనైన అమ్మభాష
తీయనైన తెలుగు భాష
ఆది కవి నన్నయచే
ప్రారంభించినది భాష!

తేనెలొలుకు తెలుగు భాష
వీనులవిందైన భాష
పెరుగు అన్నము లాంటి
పసందైన తెలుగు భాష!

తెలుగు మన మాతృ భాష
అమృతంబు లాంటి భాష
అన్య భాషలలో కెల్ల
ఉత్కృష్టమైన భాష!

కవి తిక్కన్న చేతిలో
అన్నమయ్యకీర్తనలో
వెలుగులు చిమ్మే తెలుగు
వేమన ఆటవెలదిలో!

భావవ్యక్తీకరణకు
జ్ఞానమును ఆర్జించుటకు
అనేక, వ్యవహారాల
పరిష్కారము చూపుటకు!

మాతృభాషను నిలుపాలి
పాలనలోన వాడాలి
వ్యవహారాలన్నియూ
తెలుగుభాషై ఉండాలి!

యువకులు ఏకమవ్వాలి
ఉపాధ్యాయులు కదలాలి
కవులు అందరూ కలసి
తెలుగునూ రక్షించాలి!

No comments: