Wednesday, December 4, 2024

ప్రేమాప్యతలు

శీర్శిక: *ప్రేమాప్యతలు*


*నేటి కాలం కంటే నాటి కాలమే మేలు*
ఉమ్మడి కుటుంబాలు ఉండేవి 
ప్రతి కుటుంబంలో పదుల మంది
కుటుంబ సభ్యులు
కలిసి మెలిసి కలుపుగోలుగా
ఉండేవారు

ఎవరి పనులు వారు చేసుకునే వారు
ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు
చెప్పు కునేవారు
సరదాగ మాట్లాడుకునేవారు
చక్కని కబుర్లతోనే, సమస్యలు
తీర్చుకునే వారు

ప్రతి ఇంటికి ఒక్కరే పెద్ద ఉంటారు
వారి మాటకు ఎవరు ఎదురు చెప్పరు
అతడు తండ్రి కావచ్చు ,తాత కావచ్చు
పెదనాన్న కావచ్చు , చిన్నాన కావచ్చు
అతడు చెప్పిందే వేదం
అతని మాటకే అందరూ
కట్టుబడాల్సిందే

ఏ పండుగ వచ్చినా
ఏ పబ్బం వచ్చినా
ఏ పెళ్లి జరిగినా
ఏ ప్రయోజనం జరిగినా
మరే కార్యక్రమం జరిగినా
పెద్ద ఒక మాట చెబుతే
వారు ఎక్కడ ఉద్యోగాలలో ఉన్నా
సుదూర ప్రాంతాలలో ఉన్నా
సమయానికి ముందే
ఇంట్లో వాలాల్సిందే

చుట్టాలు పక్కాలు
పదిరోజుల ముందు వచ్చి
పండుగలు పబ్బాలు జరిగిన
పది రోజుల వరకు ఉండేవారు
చెప్పక ముందే ప్రతి పనిని
తన పనిగా భావించి చేసేవారు
కబుర్లు చెప్పుకుంటూ
శ్రమను మరిచే వారు
వెలుతామంటే పిల్లలు
సంచులో, చెప్పులో, ఊత కర్రలో
దాచే వారు

ఎంతటి ప్రేమలో వారిలో
తాతా, నానమ్మ , అమ్మమ్మ
పెద్దమ్మ, , చిన్నమ్మ , పెదనాన్న,చిన్నాన్న
అత్త మామయ్య, అక్కయ్య, చెల్లెమ్మ
అన్నయ్యా , తమ్ముడు అంటూ
ఎంత చక్కని పలకరింపులో
ఆ పిలుపులతో మనసు ఎంతో స్వాంతనం
గుండెకు ఎంతో ధైర్యం
బ్రతుకుకు ఒక బరోసా

సంపదలు లేక పోయినా
సంతోషాలు దండిగా ఉండేవి
సరదాలు మెండుగా ఉండేవి
ఆనందాలు వెల్లివిరిసేవి

నేడు న్యూక్లియర్ కుటుంబాలు
ఎవరికి వారే యమునా తీరే
ఏవి ఆ పిలుపులు ,ఏవి ఆ పలకరింపులు
ఏవి ఆ ప్రేమానురాగాలు

వావి వరుసలు తెలియవు
ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియదు
ఏ ప్రభోజనమైనా సమయానికే వెళ్ళడం
ఇంటికి వస్తే, ఎప్పుడు వెలుతారా
అని చూడటం
యాంత్రిక జీవన విధానం
డబ్బు పెరుగడంతో అహం
సమస్యలు ఏర్పడుతే తీర్చే పెద్దదిక్కులేక
మరణమే శరణ్యం
వరుసలు తెలియక అన్నాచెల్లెళ్ల తోనే
దగ్గరి రక్త సంబంధాలతోనే
విష సంస్కృతులు
తరచి చూస్తూ  *నేటి కాలం కంటే
నాటి కాలమే* ఎంతో బాగుండేది
ఆ కాలం మరుపు రానిది

 

No comments: