ట్యూన్ లిరిక్స్:
పల్లవి:-
అతడు:-
సుందరమైనది నా చెలిసువిశాలమైనదీ తన హృదయం
కమనీయం ఆమె అందం
||సుందరమైనది||
చరణం:-
ఆకాశంలో పక్షుల పరుగులు
అందమైన పచ్చని తరువులు
ఎత్తైన శిఖరాలు ఎటు చూసినా
కనుల విందుచేసే కొలను లోని చేప పిల్లలు
||సుందరమైనది||
చరణం:-
చిరుగాలిలో ఒళ్ళు పులకరించె
చెలి కోసం ఎదురు చూసే నా హృదయం
కనుచూపులో కానరాకుండే
చెలిమి కోసం వస్తుందిలే
||సుందరమైనది||
చరణం:-
సప్త సముద్రాల హోరు జోరు
విన్యాసం చేస్తుండే కనుల ముందర
కట్టి పడేశాయి నన్ను కదలకుండా
కనికరం లేకుండే నా చెలి గుండెలో
తేలియాడనా తెమ్మెరల దొంతరలలో
||సుందరమైనది||
చరణం:-
పాయపాయలుగా పారు నదీ జలాలు
నిశ్శబ్దంగా నుండీ పోయే నన్ను జూసి
పక్షుల కిలకిలా రావాలు మూగబోయే
సంధ్యావేళ దాటిపోయే
కాన రాదాయే నా అందాల సుందరి
||సుందరమైనది||
No comments:
Post a Comment