శీర్షిక : గురజాడ అప్పారావు
(ముక్తాగ్రస్తాలంకారం లో)తేనె లొలుకు భాష *తెలుగు బాష*
*తెలుగు భాష* ఎంతో వెలుగు నిచ్చు *భాష*
*భాష* లన్నింటిలో *తెలుగు లెస్స*
*తెలుగు లెస్స* అని పలికె *గురజాడ*
*గురజాడ* మహా *గొప్ప కవి*
*గొప్ప కవియే గాదు గురజాడ *సంఘ సంస్కర్త*
*సంఘసంస్కర్త* గా రచించె *కన్యాశుల్కం*
*కన్యాశుల్కం* పాత్రలు నేడు ఎందరికో *ఆదర్శం*
*ఆదర్శం* అయినట్టి పాత్రల చక్కగా మలిచాడు *గురజాడ*
*గురజాడ* తల్లిదండ్రులు వెంకట రామదాసు, *కౌసల్యమ్మ*
*కౌసల్యమ్మ ముద్దుల తనయుడు *గురజాడ*
*గురజాడ*. సాహితీ కారులలో ఒక గొప్ప *హేతువాది*
*హేతువాది* గా వారి రచనలు నేటికి *విశ్వజనీయం*
*విశ్వజనీయం* గా పేరుగాంచిన గురజాడ నవంబర్ 30, 1915 లో *కన్నుమూశారు*
*కన్ను మూసినా* భౌతికంగా , సాహితీ లోకంలో, చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచిపోయారు.
No comments:
Post a Comment