అంశం: *భగవత్ ప్రతిష్ట - మన భాద్యత*
శీర్షిక: *పెంట కుప్పలపై దేవుళ్ళ బొమ్మలా?*
*ధూమే నావ్రియాత్ వహ్నిః యధాదర్శో మీ లేన చ|*
*యధోల్బే నావృతో గర్భః తదా తేనే ద* *మావృతమ్|*
పొగ చేత అగ్ని , మురికి చేత అద్దం, మావి చేత శిశువు యెట్లు కప్ప బడిందో, అలానే కామం చేత
జ్ఞానం కప్పబడి ఉంది. అని శ్రీ కృష్ణుడు చెప్పినట్లు,
"స్వార్ధం వలన బుద్ధి, అహం వలన సహనం,
అజ్ఞానం వలన విజ్ఞానం, డబ్బు సంపద కొరకు
మంచితనం, భోగం కొరకు ధ్యానం ఆరోగ్యం,
సంపాదన కొరకు దేశ సంస్కృతి,
సాంప్రదాయాలు మరిచి పోతున్నాడు "
మనిషి శారీరకంగా ఎదుగుతున్నాడే కానీ
మనసు, బుద్ది ఎదగడం లేదు
అజ్ఞానంలో కూరుకు పోతున్నాడు
మనిషిలో స్వార్ధం పెరిగి పోయింది
మనిషి జీవితం యాంత్రికంగా మారింది
మనసు కంటే వేగంగా,
సూర్య కిరణాల కంటే వేగంగా
మనిషి డబ్బు వెంట పరుగెడుతున్నాడు
దీనికి తోడు ఇతర మతస్థుల , దేశస్థుల
కుట్రలు చాపకింద నీరులా ప్రాకుచున్నవి
అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడి పోయి
మూలాలు మరిచి పోతున్నాడు
మనిషి జన్మకు కారణమైన దైవాన్ని
సృష్టిని, ప్రకృతిని మరిచి పోతున్నాడు
తల్లి చనుబాలు త్రాగి, తల్లి రొమ్మలనే గుద్దినట్లు,
తనను సృష్టించిన సృష్టికర్తనే అవమానిస్తున్నారు
దైవానికి ఎంతటి ఘోరం జరుగుతుందో
భగవంతుడికి ఎంత అవమానం జరుగుతుందో
గుర్తించలేక పోతున్నారు
సంపాదన, హోదా, శారీరక సుఖం
మాయలో పడి పోయారు
విస్కీ బాటిల్ల పైన దేవుళ్ళ పేర్లా
వైన్ షాపులకు, చెప్పుల షాపులకు
దేవుళ్ళ పేర్లా
వైన్ సీసాల చెప్పుల ఫోటోల ప్రక్కన
దేవుళ్ళ ఫోటోలా
నిత్యం పూజించే దేవుళ్ళకు
ఇదేనా మనం పట్టే నీరాజనం ?
ఇదేనా మనమిచ్చే గౌరవం ?
ఇదేనా మన భారతీయ సంస్కృతి?
సీసాలను త్రాగి పెంట కుప్పల పైకి విసరడం
దీపావళి టపాకాయల పైనా
దేవుళ్ళ బొమ్మలు ముద్రించి
దీపావళి పండుగలు, ఇతర ఉత్సవాలలో
కాల్చడం ఎంత హేయం!
కాలిన దేవుళ్ళ కాగితం ముక్కలను తొక్కడం
కాలినవా లేవా అని చెప్పుకాలుతో
తన్నుతన్నడం ఎంతటి ఘోరం!
దేవుళ్ళ గుడులలో ప్రసాదం కవర్లపైనా
పూజా సామాగ్రి సంచులపైనా,
అనేక పూజా దినుసుల డబ్బాలపైనా ,
కవర్లపైనా, అగరు బత్తి డబ్బాలపైనా
స్త్రీలు కట్టుకునే చీరలపైనా, జాకిట్లపైనా
పెండ్లిల్లలో వాడే పరదాల పైనా
దేవుళ్ళ బొమ్మలు ముద్రించి అమ్మడం
వాటిని వాడాక వినియోగదారులు
దేవుళ్ళ బొమ్మల చిత్రాలను, బట్టలను
చెత్తబుట్టలలో వేయడం,
పెంట కుప్పల పైకి మురికి మోరీల లోకి ,
రోడ్లపైకి విసురడం ఎంతటి అవమానం!
దేవుళ్ళ చిత్రాలను, మనుషులు,
జంతువులు త్రొక్కడమే గాకుండా
పర్యావరణం, కాలుష్యమయమై పోతుండే
అంతేనా, మరో అడుగు ముందుకు వేసి
డోర్ మ్యాట్స్ పైనా దేవుళ్ళ బొమ్మలను
ముద్రించి , తలుపుల ముందర,
బాత్రూముల ముందర వేస్తూ తొక్కడం
చూస్తుంటే మనస్సు తరుక్కుమంటుది
గతంలో ఎక్కడో విదేశాల్లో చెప్పులపై
గణేష్ చిత్రాలను ముద్రిస్తే గగ్గోలు పెట్టిన
ప్రభుత్వాలు , మీడియా వాళ్ళు
మన ఇంట్లో, మన ఇంటి ప్రక్కన,మన వీదుల్లో
జరిగే అవమానాలను చూసి చూడనట్టు
మిన్నకుండటం భావ్యమేనా?
సిరి సంపదలు కలుగాలనీ,
చదువు బాగా రావాలనీ
ఉద్యోగాలు రావాలని, సంతానం కావాలని
ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనీ
నిత్యం పూజించే దేవుళ్ళకు, దైవానికి
జరిగే అవమానాలను కానలేక
గ్రుడ్డి వారైపోతున్నారు
ఇదేనా మనం , వేదాలు, పురాణాలు,
ఇతిహాసాలు, ఋషుల నుండి
నేర్చుకున్న సంస్కృతి ?
దేవుళ్ళ చిత్రాలను ముద్రిండానికి
గల కారణాలు పరిశీలిస్తే,
వ్యాపారుల లాభాల వృద్ధి,
స్వార్ధం , డబ్బు, అవినీతి సంపద ,
అధికారం కొరకు ఆరాటం, సమాజంలో హోదా, గౌరవం కోరుకోవడం , అవగాహన లేకపోవడం
లేదా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా
ఉంటూ పట్టించుకోకుండా ఉండటం
అయితే, దీనికి పరిష్కారం లేదా? ఉంది.
"మనిషి తలుచు కుంటే, సాధ్యం
కాని దేముంటుంది"
"రాజు తలుచు కుంటే దెబ్బలకు కొదువా",
అన్నట్లు
ప్రభుత్వం తలుచు కుంటే కానిదేమీ లేదు
దేవుళ్ళ బొమ్మలను, చిత్రాలను,
దేవుళ్ళ పేర్లను వాడి పారేసే
పూజా సామాగ్రి సంచుల పైనా, ప్యాకింగ్ లపైనా
వైన్స్ షాపుల పైనా, ప్రసాదం ప్యాకింగ్ ల పైనా
మిఠాయి షాపులలో, గాజుల షాపులలో
ఫాన్సీషాపలలో ఉపయోగించే,
పేపరు బ్యాగులపైనా, ప్లాస్టిక్ సంచుల పైనా, టపాకాయల పైనా, డోర్ మ్యాట్స్ పైనా,
అగరు బత్తి డబ్బాలపైనా, మరే ఇతర
వాటిపైనా , పెంట కుప్పలపై పడేసే
ప్రసాదం పాకిట్లపైనా ముద్రించ వీలు లేకుండా
ప్రభుత్వం తక్షణమే జి.వో. ను పాస్ చేయాలి
జి.వో. పాస్ చేసి చేతులు దులుపు కోకుండా
పూర్తి నియంత్రణ ఉండాలి
అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలి
వ్యాపారుల లైసెన్సులను రద్దు చేయాలి
ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు
ప్లాస్టిక్ కవర్ల బ్యాన్ విషయంలో
"పుండు ఒక చోట ఉంటే మందొక చోట" పెట్టినట్లు,
కిరాణా షాపు వాండ్లకు , కూర గాయలు
అమ్ముకునే వారి పైనా ఫైన్లు వేస్తున్నారు
డబ్బు పెట్టి కొన్న కవర్లను గుంజుకపోతున్నారు
శిక్షలు విధిస్తున్నారు
పిచుకపై బ్రహ్మాస్త్రం వేసినట్లు
ఇది సరియైన పద్దతి కాదు
ఇక్కడ షాపు వాండ్లది తప్పు కాదు
కూర గాయలు అమ్ముకునే
చిరు వ్యాపారుల దోషం కాదు
వినియోగదారులది నేరం అంతకంటే కాదు
ప్రభుత్వాలు ఇలా చేయడం అక్రమం,
అన్యాయం, అధర్మం
కవర్లను తయారు చేసే వారిది తప్పు
వారికి లైసెన్స్ లు ఇచ్చిన అధికారులది తప్పు
ఇతర దేశాల నుండి దిగుమతి
చేసుకోడానికి అనుమతి ఇచ్చిన
అధికారులది తప్పు
చిరు వ్యాపారులను శిక్షించడం కంటే
ప్రతి కుటుంబానికి రెండు డస్ట్ బిన్ లు
ఇచ్చినట్లుగానే ప్రతి కుటుంబానికి
రెండు బట్ట సంచులను ప్రతి ఇంటికి
ఉచితంగా పంపిణీ చేయాలి
ప్రభుత్వాలు దేవుళ్ళ బొమ్మలు
ముద్రించకుండా , ప్రింటర్స్ కు, వ్యాపారులకు
అవగాహన కలిగించాలి
అలానే దేవుళ్ళ బొమ్మలు ముద్రించే వారిపై
తగిన ఫైన్లు శిక్షలు వేయాలి
కానీ, పూజా సామాగ్రి అమ్మే వారిపై,
వినియోగదారులపై కాదు
సమాజంలో ప్రజలు కూడా భాగమే
ప్రజలు ముఖ్య భూమికను పోషించాల్సిన
ఆవశ్యకత ఎంతైనా ఉంది
దీనిని ప్రతిఒక్కరూ భగవత్ ప్రతిష్టగా
భావించాలి
దైవాల ఫోటోలు ముద్రించిన కవర్లను,
సంచులను, డోర్ మ్యాట్స్ ను ,
ప్యాకింగ్ లను కొనడం మాని వేయాలి
తప్పని పరిస్థితుల్లో అలా దేవుళ్ళ బొమ్మలు
ఉన్న కవర్లను , ప్యాకింగ్ డబ్బాలను, బట్టలను,
దేవుడి దగ్గరి పూలను చెట్ల మొదళ్ళో వేసినట్లు,
వీటిని ఒక చోట వేసి కాల్చి, అగ్ని దేవుడికి
సమర్పించు కున్నట్లు భావించడం ఉత్తమం.
స్వచ్ఛంద సంస్థలు, అలాంటి వాటిని
కొనకూడదని విస్తృతంగా ప్రచారం చేయాలి
దేవుళ్ళు, దేవతల ఫోటోల ముద్రణ
గురించి వివరిస్తూ , అవగాహన కలిగిస్తూ
ప్రజల కళ్ళు తెరిపించాలి
ముద్రించ కుండా ప్రభుత్వాలపై వత్తిడి తేవాలి
భారతీయ సంస్కృతి, దేశ అభివృద్ధికి ప్రతీక
భగవత్ ప్రతిష్టను , దేశ ప్రజలందరూ భాద్యతగా
తీసుకున్న రోజున , భారత దేశం ప్రపంచ
పటంలో సాంస్కృతిక, సాంప్రదాయాలలో
ప్రధమ స్థానంలో నిలుస్తుందనడంలో
సందేహం లేదు
సర్వేజనాః సుఖినోభవంతు!
No comments:
Post a Comment