అంశం: గద్ధర్ యుద్దనౌక
శీర్షిక: *పేద ప్రజల గొంతుక*దీని జనుల ఆశా జ్యోతి
తడారిన పేద ప్రజల గొంతుక
అవినీతి పరుల గుండెల్లో తుపాకి గుండు
ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే
త్యాగం చేసిన విద్యాధికుడు
బహుజనులను చైతన్య పరిచిన కర్మయోగి!
మంచికి మంచి
చెడుకు చెడు అంటూ
దొరల ఆగడాలను
దొరల నీచపు చూపును
దొరల దోపిడి తనాన్ని
దొరల పెత్తందారులతనాన్ని ననుచ
కొంత కాలం అరణ్యవాసం చేసిన
అజ్ఞాత వాసం చేసిన త్యాగ శీలి!
అతనొక మేధావి
అతనొక ప్రజా యుద్దనౌక
విప్లవ పాటల రచయిత
మంచి గాయకుడు
గొప్ప నాయకుడు
అద్భుత కళాకారుడు
అలుపెరుగని సాహాసికుడు
తుపాకి గుండ్లకు గుండెను
ఎదురొడ్డిన ధీరుడు!
చేతిలో కర్ర
కర్ర చివరలో ఎర్ర జెండా
బుజంపైన గొంగళి
నడుము కింద నాలుగు గజాల గోచి
చుట్టూ పది మంది భజన మిత్రులు
ఇవే గద్ధర్ నికర ఆస్తులు, సంపదలు!
బడుగు జీవుల ఆక్రందనలకు
చలించిపోయిన కరుణామయుడు
ప్రజలను జాగృత పరిచిన వైతాళికుడు
పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన
విప్లవకారుడు!
*బండెనుక బండికట్టి, ఏ బండ్లో వస్తవు కొడుకో"
అంటూ సర్కారు, దోపిడి దారుల గుండెల్లో
దఢ పుట్టించిన వీరుడు
*నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా...*
*తోడ బుట్టిన ఋణం తీర్చుకుంటనే చెల్లెమ్మా..*
అంటూ రచించి పాడుతూ, చెల్లెమ్మల
కన్నీరును తన పాటతో ఆపి
అండగా నిలిచిన పెద్దన్న గద్ధర్
ఎంతో మంది యువతీయువకులను
చైతన్య పరిచిన విప్లవ యోధుడు!
No comments:
Post a Comment