Saturday, December 28, 2024

స్వేచ్ఛ ఖడ్గం లాంటిది

అంశం: స్వేచ్ఛ వాక్యం


శీర్షిక: *స్వేచ్ఛ ఖడ్గం లాంటిది*

*స్వేచ్ఛ రెండు వైపుల పదునైన*
*ఖడ్గం లాంటిది*

*స్వేచ్ఛ స్వచ్ఛమైన గాలి వంటిది*

స్వేచ్ఛ ను సద్వినియోగం చేయాలి గానీ
దుర్వినియోగం చేయరాదు

అవకాశముందని అవధులు దాటినా
ఆధికారముందని పరిధులు దాటినా
నోరు ఉందని ఊరును కడిగేసినా
స్వేచ్ఛ ఉందని హద్దులు దాటినా
జీవితం అస్తవ్యస్తం కావచ్చు

రాజ్యాంగం
జీవించే స్వేచ్ఛ నిచ్చింది
మాట్లాడే స్వేచ్ఛ నిచ్చింది
విద్యనభ్యసించే స్వేచ్ఛ నిచ్చింది
మత స్వేచ్చ నిచ్చింది
ఇలా స్వేచ్ఛలు ఎన్ని కల్పించినా
అవి ఇతరులకు , సమాజానికి
హాని కలుగకుండా ఉండాలన్నదే
ప్రధాన ఆశయం

భారతీయ సంస్కృతి
సాంప్రదాయాలకు పుట్టినిల్లు
కులాలు మతాలు ప్రాంతాలు వేరైనా
కట్టుబొట్టు నడతలు
పూజలు పునస్కారాలు
పండుగలు పబ్బాలు
మన సంస్కృతికి అద్దం పట్టాలి

పాశ్చాత్య దేశస్తులు మన నుండి
నేర్చుకోవాలి గానీ
మనం పాశ్చాత్య పోకడలకు
పోకూడదు

పందొమ్మిది వందల తొంబై ఒకటిలో
నాటి ప్రధాని పి.వి. నర్సింహారావు
ఆర్ధిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్
వ్యాపార ఆర్ధిక స్వేచ్చను తీసుకొచ్చి
ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా చేశారు
భారత దేశాన్ని ఒడ్డున పడేశారు

వెలుతురు వెనుక చీకటి ఉన్నట్లు
మంచి వెనుక చెడు ఉంటుంది
డబ్బుపై వ్యామోహం పెరిగింది
కల్చర్ చెడుతుంది,
వావి వరుసలు లేకుండా పోతున్నాయి
మానవ సంబంధాలు చెడుతున్నాయి
వివాహాలు విడాకులకు దారి తీస్తున్నాయి
సహజీవన సంస్కృతి
చాపకింద నీరులా విస్తరిస్తుంది
స్వాముల సంస్కృతి పెరిగింది
స్కాముల దోపిడి పెరిగింది
స్వేచ్ఛ తో నేతలు, బిజినెస్ దారులు
కుబేరులవుతున్నారు
పేదలు, నిరుపేదలు
బికారులవుతున్నారు.
స్వేచ్ఛ కు మరిన్ని హద్దులు
పెట్టకపోతే,
మానవ మనుగడ శృతిమించునేమో!

No comments: