అంశం : టుడే స్టార్
శీర్షిక : *సంగీతం*
రాగమేదైతే నేమి?
అది సంగీతమే!
సన్నని శబ్ధమేదైతే నేమి?
అది సంగీతమే!
తరువులు ఊగినపుడు
చెరువులు మత్తడి పడినపుడు
వచ్చే శబ్ధాలు సంగీతమే!
చెట్టు కొమ్మలకు కట్టిన
ఊయల నుండి వినిపించే రాగం
సంగీతమే!
ఆనందంగా ఉన్నపుడు
పాడే కూని రాగాలు సంగీతమే!
శిశువు జన్మించినపుడు
అమ్మకు వినిపించేది సంగీతమే!
సంగీతమంటే ఇష్టపడని మనిషి
మోడు బోయిన తరువు
రెండూ సమానమే!
సంగీతం లో ఉన్న మాధుర్యం
సంగీతం లో ఉన్న మహత్యం
సంగీతం వలన కలిగే మేలు
వెలకట్టలేని గొప్ప సంపద!
అమ్మ జోల పాట పాడి
శిశువును నిద్రపుచ్చ వచ్చు!
వేణు గానంతో ఆవునుండి
పాలను కార్పించ వచ్చు!
పిల్లన గ్రోవితో సర్పాలను
నాట్యమాడించ వచ్చు!
సంగీతం తో రోగికి
స్వస్థత చేకూర్చ వచ్చు!
సంగీతం తో నరులను
నాట్యమాడేట్లు చేయవచ్చు!
సంగీత మంటే
ప్రకృతి పరవసించి పోతుంది!
సంగీత మంటే
ఇష్టపడని వారెవరు
ఆస్వాదించని వారెవరు!
సంగీతం
ఉపాధి కల్పించే మేరు శిఖరం!
సంగీతం సప్త సాగరం!
సంగీతం లేకుండా సృష్టి లేదు
సృష్టి లేకుండా సంగీతం లేదు
సంగీతం లేకుండా ప్రకృతి లేదు
సంగీతం లేకుండా మనిషి లేడు!
సంగీతం ఊపిరి
సంగీతం ప్రాణం
సంగీతం ఉల్లాసం
సంగీతం స్వాంతన
సంగీతం ఎంతో మధురం!
No comments:
Post a Comment