Monday, December 23, 2024

అడవి జీవులు

అంశం: "అడవి దివిటీలు*


శీర్షిక: *అడవి జీవులు*

ఎత్తెన  *కొండలు*
*కొండల* మధ్య  *సెలయేర్లు*
*సెలయేర్ల*  నానుకుని  *అడవులు*
*అడవుల*  మధ్య బీడు  *భూములు"
*భూముల* లో చిన్న చిన్న  *గుడిసెలు*
*గుడిసెల*  లోనే అడివి  *జీవులు*
*జీవుల* జీవితాలు నేడు *అగమ్య గోచరం*

గుండెలు మండుతున్నయి
బండలు కాలుతున్నయి
కడుపులు మాడుతున్నయి
అగ్ని జ్వాలలు ఎగురు తున్నయి!

స్వాతంత్ర్యం వచ్చి
ఏడు దశాబ్దాలు దాటినా
నేటికీ రవాణా సౌకర్యాలు
విద్యుచ్ఛక్తి సౌకర్యాలు
త్రాగు నీటి సదుపాయాలు
విద్య వైద్య సౌకర్యాలు
మృగ్యమనే చెప్పాలి

తినుబండారాలు కావాలన్నా
విద్య వైద్య అవసరాల కొరకు
అడవి ఉత్పత్తులను అమ్మాలన్నా
పది పదిహేను మైళ్ళు నడవాల్సిందే

ఐదేళ్ళకోసారి ఎన్నికలు వస్తాయి
ఎన్నికలప్పుడే నాయకులు కనబడుతారు
ఓటుకో నోటు చేతికి ఇచ్చి ,
ఆ పూటకు పావు షేర్ పోయించి
ఆ రోజు కడుపు నిండా తినబెట్టి
కనబడరు మరో ఐదేళ్ల వరకు
ఇంకెంత కాలం ఈ బానిసత్వం
ఇంకెన్నాళ్ళు  ఈ నిరంకుశత్వం
ఇంకెన్నాళ్ళు ఈ అంధకారం
మరెంకెన్నాళ్ళు ఈ ఈసడింపు
ఇంకెన్నాళ్ళు ఈ ఆటవిక జీవితాలు

ఇక నైనా ప్రభుత్వాలు గుర్తించి
అడివి జీవుల బాధలను తొలగించాలి
రవాణా, విద్య వైద్యం విద్యుత్తు
సదుపాయాలను అభివృద్ధి చేయాలి
వారి భూములను వారు సాగు చేసుకోడానికి
వారి ఉత్పత్తులను వారు అమ్ముకునే విధంగా
గిట్టుబాటు ధరలను నిర్ణయించాలి
రాజ్యాంగ హక్కులను
మన్నెం ప్రజలకు కల్పించాలి

     

No comments: