అంశం: అలంకారాలు -
స్వభావోక్తి అలంకారంశీర్షిక: *అమీన్ పూర్ చెరువు*
ప్రక్రియ: స్వభావోక్తి అలంకారం
నాడు అదోక కాలుష్యంతో కంపు కొడుతున్న చెరువు, చిన్న చిన్నచినుకులు పడినా, కుంభవృష్టి కురిసినా, ఆ వర్షపు నీరంతా ఆ చెరువు లోకి చేరేవి. కంపనీలు విడుదల చేసిన కాలుష్యపు నీరు నురుగులు కుక్కుకుంటూ వచ్చి చేరేవి.చాకలి వారు బట్టలు ఉతకడం , జనులు బాహ్యాలి వెళ్ళడం, చెరువులో డెక్కాకు పెరిగి, ముండ్ల కంపలతో మురికి నీరుతో చిందర వందరగా దర్శనమిచ్చేది.
నేడు, ఆ చెరువును మానవతావాది, పర్యావరణ పరిరకుడైన ఒక పోలీసు కమీషనర్
దత్తత తీసుకున్నాక, చెరువు రూపురేఖలే మారిపోయాయి. వచ్చే కాలుష్యపు నీరు నిలిపి వేయడం ,డెక్కాకు తొలిగించడం, అందమైన చెరువు.చుట్టూరా ఫెన్సింగ్ వేయడం , కట్టను వేయడం , కట్టమైసమ్మ గుడిని కట్టించడం వలన, చెరువు కళకళ లాడుతుంది. ఈ చెరువుకు విదేశీ పక్షుల రాక అనే ఒక ప్రత్యేకత ఉండటం వలన పర్యాటకులు నిత్యం ప్రశాంతత కోసం వస్తుంటారు. తిలకిస్తారు. మనో వ్యధలను పోగొట్టకుంటారు. అందులోని చేపలను చూసి పరవసించి పోతారు. పర్యాటకులు వేసే ఆహారం తింటూ , వారికి ఎంతో వినోదాన్ని కలిగిస్తుంటాయి. సువిశాలమైన స్థలం,చుట్టూరా చల్లని వాతావరణం, మనసుకు స్వాంతన నిస్తుంది.
సుదూర ప్రాంతాల నుండి,విదేశాల నుండి గగనతలంలో ఎగురుతూ పక్షులు, రెక్కలు రెపరెప లాడించుకుంటూ , వయ్యారంగా వంపులు తిరుగుతూ, ముచ్చటించుకుంటూ, కూని రాగాలు
తీసుకుంటూ , ప్రతి సంవత్సరం అమీన్ పూర్ , (హైదరాబాద్ ) చెరువుకు వస్తుంటాయి.
కొంత కాలం సేద తీరాక , వివిధ దేశాల నుండి వచ్చిన అంద చందాల , రంగు రంగుల పక్షులు, ఇక్కడి పక్షులతో మమేకమై , ఇక్కడి ప్రాంతాల పరిసరాల స్థితి గతులను, నివాస మరియు ఆహార అవకాశాలను, రక్షణ సౌకర్యాలను అనుభవించి, కొంత కాలం సహజీవనం చేసీ, మిత్రబృందాలతో కలసి గుంపులు గుంపులుగా విదేశాలకు వెళ్లి పోతుంటాయి. కొంత కాలానికి మల్లీ వస్తుంటాయి.
No comments:
Post a Comment