Wednesday, December 25, 2024

మల్లెపువ్వు

అంశం: ఆ పాట - నా పదాలు
సినిమా పేరు: మల్లె పువ్వు
రచయిత పేరు: ఆరుద్ర
సంగీత దర్శకత్వం: చక్రవర్తి
పాడిన వారు: బాల సుబ్రహ్మణ్యం
నటీనటులు: శోభన్ బాబు, లక్ష్మీ, జయసుధ

శీర్షిక: *భగ్న ప్రేమికుడి ఆవేదన*

సందర్భం: తాను ప్రేమించిన ప్రేయసి,
సిరి సంపదలు కలిగి యున్న మరొకరిని
వివాహం చేసుకున్న సందర్భంగా

ఓ ప్రియా!
నిన్నే తలచితిని,
నిన్నే ప్రేమించితిని
నీవే సర్వస్వమనుకుంటిని
ప్రకృతిలో పరవసించాలనీ
ఆకాశంలో విహరించాలనీ
ఎన్నెన్నో కళలు గంటిని

మల్లెపువ్వు కంటే తెల్లనిదని
మకరందం కంటే తీయనిదని
మన ప్రణయం అనుకుంటిని
కానీ,  అది నేడు విషమని
అవగతమయినది

ప్రేమకు అర్థం లేదా
లేక నా ప్రేమపై నమ్మకం లేదా
ఎందుకు వంచన చేశావు
ధనానికి అమ్ముడు పోయావు
నన్ను విడిచి పోవుట నీకు సులువు
కానీ విడువదు నా హృదయం

నా ప్రేమకు చివరికి మిగిలేది దుఃఖమేనా
నా విరహానికి ఫలితం బాధేనా
నీవు చేసిన గాయం ఇక మానదు
నాలో రేగే జ్వాల ఇక మారదు

      

No comments: