శీర్షిక: *గూడు చెదిరిన పక్షులు*
(ప్రక్రియ: మణిపూసలు)(రూపకర్త: శ్రీ వడిచర్ల సత్యం)
పరువుగల కుటుంబం
అన్యోన్య కుటుంబం
చిన్న మనస్పర్ధలొచ్చె
విడిపోయె కుటుంబం
ఆస్తులున్నాయని పోయె
అధికారముందని పోయె
నీవెంతని అహము తోటి
భర్త భార్యనిడిచి పోయె!
త్రాగుడుకు బానీసాయె
చెడు తిరుగుళ్ళుమొదలాయె
పరువు పదవి గాలిలో
ఆస్తులు ఆవిరై పోయె
అందముందని పోయే
వయసుఉందని పోయే
భార్య భర్తపై అహముతొ
పక్కవానితొ పోయే
మోజులో వాడుకునే
లోగుట్టు తెలుసుకునే
ఉన్నదంతా ఊడ్చుకొని
కనుమరుగైపోయెనే
ఉభయులకూఅర్ధమాయె
కాలమంత గడిచిపోయె
కోర్టులచుట్టుతిరుగుతూ
గూడు లేని పక్షులాయె
సమస్యలూ సహజము
అందరికుండు నిజము
కూర్చుని మాట్లాడుకునిన
ఉండునెంతొ ఫలితము
కోర్టులో నలిగె కేసులు
గడిచినవి రావు రోజులు
ఎంత ఉండి ఏమివచ్చే
రోడ్డున పడె కుటుంబాలు
No comments:
Post a Comment