Monday, December 23, 2024

వృక్షో రక్షతి రక్షితః

అంశం: సెల్ఫీల కవిత


శీర్షిక: *వృక్షో రక్షతి రక్షితః*

*వృక్షాలను మనం రక్షిస్తే, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి*

*సమాజం నుండి ఏమి పొందుతామో, సమాజానికి అందులో కొంతైనా ఇవ్వాలి*

*సృష్టి నుండే నేర్చుకోవాలి ఏదైనా, ఎవరైనా*

ప్రకృతి విజ్ఞాన భాండాగారం
ప్రకృతిని అర్ధం చేసుకోవడం కాదు ఎవరి తరం
ప్రకృతి జీవకోటికి ఎంతో మేలుచేస్తుంది
జ్ఞానాన్ని అందిస్తుంది , విజ్ఞానం పెంచుతుంది
మనిషి ఎలా జీవించాలో నేర్పుతుంది
మనుగడ ఎలా సాగించాలో అర్ధం చేపిస్తుంది

పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది
పంచ భూతాలను సమన్వయం చేస్తుంది
సూర్య చంద్రులకు తోడుగా ఉంటుంది
నింగీ నేలకు చేరువగా ఉంటుంది
సప్త సముద్రాలను నియంత్రణలో పెడుతుంది

ఇన్ని సేవలందిస్తున్న ప్రకృతిని చూసైనా
మానవుడు తోటి మానవులకు
ఏదో ఒకటి చేయ ఆలోచించాలి
*మనసు ఉంటే మార్గం ఉంటుంది*

అరిషడ్వర్గాలు పుణికిపుచ్చుకున్న
అహం స్వార్ధం మోసం వెన్నంటి ఉన్నా
చిన్న పనిని జేయ నెంతో మేలు కలుగు జగతికి
కష్టం కానిది ఖర్చు లేనిది

తినిన పండ్ల విత్తనాలను
మామిడి, పనస, జామ, శీతాఫలం,
నేరేడు , బొప్పాయి మరెన్నో పండ్ల గింజలను
జమ చేసి శుద్ది చేసి
ఇంటి ప్రక్కన ఖాళీ స్థలంలో
రోడ్లకు ఇరువైపులా విసిరినా
చెట్లు మొలిచి, కాయలు పండ్లు కాచి
మనకు , బాటసారులకు, పక్షులు,
వానరులకు , నీడ నిచ్చు, గూడు నిచ్చు
పండ్లు ఫలాలను అందించు
బాటసారులు పశుపక్ష్యాదులు పరవసించు
*వృక్షో రక్షతి రక్షితః*

        

No comments: