శీర్శిక: *విజయం*
విశ్వంలో
అత్యధిక తృప్తిని ఇచ్చేది
సంతోషాన్ని, ఆనందాన్ని ,
మురిపాలను అందించేది
ఒకే ఒకటి
డబ్బు ప్రోగేయవచ్చు,
సంపద కూడబెట్టవచ్చు
బంగారు నగలు,
వజ్రవైడూర్యాలు, ఆహారం
మద్యం , హోదా , పలుకుబడి,
సత్కారాలు బిరుదులు ,
మరొకటి ఏదైనా పొందవచ్చు
ఇవి హాయిని , సుఖాన్ని
ఇవ్వవచ్చుగాక
కానీ, అవి ఏవీ ఇవ్వలేవు
పూర్తి సంతృప్తిని
విజయమాల్య
వేల కోట్లు సంపాదించాడు
మెత్తని పరుపులపై లండన్లో
పడుకుంటూ ఉండవచ్చు
విమానాల్లో విహరించవచ్చు
కొలనులలో ఎగురుతూ ఉండవచ్చు
మగువలతో గెంతుతూ ఉండవచ్చు
సుఖంగా ఉంటున్నాని
అనుకుంటూ ఉండవచ్చు
కానీ స్వేచ్ఛ లేదు,
సంతృప్తి లేదు
సంతోషంగా, మురిపాలతో
ఆనందంగా జీవించడానికి
ఏ గొప్ప సంపద ఉండనవసరం లేదు
పంచామృతాలు పుట్టు పరుపులు
ఉండనవసరం లేదు
టుంగుటుయ్యాలలో ఊగనవసరం లేదు
కాసింత ప్రేమ కంటినిండా నిదుర ఉంటే చాలు
దూరపు కొండలు నునుపు
అనుకుంటారు
దగ్గరగా వెళ్ళి చూస్తే తెలుస్తుంది
ఆ కొండల చుట్టూ ఉన్నవేమిటో
ఆ ముళ్ళ కంపలు ఏమిటో
అందరూ సంతోషంతో
మురిపాలతో ఉంటారనుకుంటారు
కానీ అలాంటిదేమీ ఉండదు
ఇంటింటికి మట్టిపొయ్యే అన్నట్లు
తరచి చూస్తే అర్ధమవుతుంది
ముద్దు మురిపాలతో
సంతోషంగా జీవించాలంటే
మనిషిలో క్రమ శిక్షణ ఉండాలి
నైతికత, నిజాయితీ ఉండాలి , మాట తీరూ బాగుండాలి
అన్నింటికంటే ముఖ్యంగా
మనిషికి సంతోషం, సంతృప్తి
ఆనందం, మనసు మురియడం,
హృదయం స్పందించడం అనేది
*విజయం* తో లభిస్తుంది
విజయమనేదీ చదువులో ఉత్తీర్ణత కావచ్చు
ఒక ఆటలో గెలుపు కావచ్చు
ఒక పదవిలో రాణించడం కావచ్చు
ప్రజలలో మంచి గుర్తింపు
పొందడం కావచ్చు
మరేదాని వలన నైనా
నిజాయితీతో కూడిన
కీర్తి ప్రతిష్టలు కావచ్చు
No comments:
Post a Comment