Monday, December 30, 2024

పేద ప్రజల గొంతుక - గద్దర్

 అంశం: గద్ధర్ యుద్దనౌక

శీర్షిక: *పేద ప్రజల గొంతుక*

దీని జనుల ఆశా జ్యోతి
తడారిన పేద ప్రజల గొంతుక
అవినీతి పరుల గుండెల్లో తుపాకి గుండు
ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే
త్యాగం చేసిన విద్యాధికుడు
బహుజనులను చైతన్య పరిచిన కర్మయోగి!

మంచికి మంచి
చెడుకు చెడు అంటూ
దొరల ఆగడాలను
దొరల నీచపు చూపును
దొరల దోపిడి తనాన్ని
దొరల పెత్తందారులతనాన్ని ననుచ
కొంత కాలం అరణ్యవాసం చేసిన
అజ్ఞాత వాసం చేసిన త్యాగ శీలి!

అతనొక మేధావి
అతనొక ప్రజా యుద్దనౌక
విప్లవ పాటల రచయిత
మంచి గాయకుడు
గొప్ప నాయకుడు
అద్భుత కళాకారుడు
అలుపెరుగని సాహాసికుడు
తుపాకి గుండ్లకు గుండెను
ఎదురొడ్డిన ధీరుడు!

చేతిలో కర్ర
కర్ర చివరలో ఎర్ర జెండా
బుజంపైన గొంగళి
నడుము కింద నాలుగు గజాల గోచి
చుట్టూ పది మంది భజన మిత్రులు
ఇవే గద్ధర్ నికర ఆస్తులు, సంపదలు!

బడుగు జీవుల ఆక్రందనలకు
చలించిపోయిన కరుణామయుడు
ప్రజలను జాగృత పరిచిన  వైతాళికుడు
పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన
విప్లవకారుడు!
*బండెనుక బండికట్టి, ఏ బండ్లో వస్తవు కొడుకో"
అంటూ సర్కారు, దోపిడి దారుల గుండెల్లో
దఢ పుట్టించిన వీరుడు
*నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా...*
*తోడ బుట్టిన ఋణం తీర్చుకుంటనే చెల్లెమ్మా..*
అంటూ రచించి పాడుతూ, చెల్లెమ్మల
కన్నీరును తన పాటతో ఆపి
అండగా నిలిచిన పెద్దన్న గద్ధర్
ఎంతో మంది యువతీయువకులను
చైతన్య పరిచిన విప్లవ యోధుడు!

గోదాదేవి మేల్కొలుపు

అంశం: ప్రయాగ


శీర్షిక:  *గోదాదేవి మేల్కొలుపు*

నిన్ను నేను మరువ లేక నీ కోసమే తపిస్తున్న పరితపిస్తున్నా స్వామీ!

అలమందల బయటకు పంపి , శీతల నదిలో స్నానం చేసి,
దవళ వస్త్రములేసుకుని చెలికత్తెలతో,తులసిమాల తెచ్చా లేనాధా!

విష్ణుదత్తు పుత్రికను త్వరగా లేవయ్యా
విరహంతో  సీతాకోక చిలుకలా తూగుతున్నాను కనవయ్యా
చెలికత్తెలు నన్ను గేలి చేస్తున్నారు వినవయ్యా

నా మీద కోపమా తాపమా పరిహాసమా !
పరిహాసమా! నన్ను ఆట పట్టిస్తున్నావా!

అవునులే, గోదంటే నీకు అలుసు కదా

అయినా నేను నీ వెంట నీవు నా వెంట
పడుతూనే ఉంటాం, చిలుకా గోరింకల్లా
దేనికైనా కాలం కలిసి రావాలి, ఆ కాలంలో మనం
తేలియాడాలి.
అంతేగా, నేనంటే ఇంతేలే, అంతేలే.

పరిహాసం చేయకు స్వామి, మాలలు అలుగు తున్నాయి.

స్వామీ! శుభ *కర* *కర* ములు నీవే నయ్యా
సు *గంధం*. *గంధం* నీ కొరకే తెచ్చాను నాధా!
నా వస్త్ర ధా *రణ*  *రణ* మునకు దారితీయు ననుకుంటున్నావా

నిన్ను నేను మరువ లేక నీ కోసమే తపిస్తున్న
పరితపిస్తున్నా స్వామీ!

      

గుడి మెట్లు

అంశం: మౌన శిల 

 శీర్షిక: *గుడి మెట్లు*


*శిలలు అవి గుడి మెట్లుగా* 

*ఉంటే తొక్కుతాం*

*అవే శిలలు శిల్పంగా*

*గుడిలో చేరితే వాటిని*

*దైవంగా మొక్కుతాం!*

*సృష్టిలో ఆవిర్భవించు ప్రతీది,  మౌన శిలనే*

*శిలలు శిలలుగ ఉన్నంత కాలం మౌన శిలలే*

*శిలలకు శిల్పి రూపమిస్తే, అవి దైవాలు గానో*

*ఉపయోగపడే వస్తువులు గానో*

*రూపాంతరం చెందుతాయి*

*విలువలను , గౌరవం, గుర్తింపును*

*పెంచుతాయి*


శిల  "మౌన శిలనే"

స్థలం రూపం మారడం వలన

గుడిలో దానికంత గౌరవం

శిల గుడి మెట్ల లోనే ఉండటం వలన

రూపం లేక పోవడం వలన 

గౌరవం తగ్గడమే కాదు

భక్తి హీనమైంది 

మనిషి అంతే


మౌన శిలలను, శిల్పి  అందంగా 

చెక్కినప్పుడే 

వాటికి విలువ ఏర్పడుతుంది 

గుర్తింపు వస్తుంది.


పుట్టిన శిశువు మౌన శిలనే

శిశువు అమ్మనే మొదటి గురువు

ఆ తరువాతనే గురువు

సమాజం , ప్రకృతి 

ఒక మనిషిగా తీర్చి దిద్దబడుతాడు 


అజ్ఞానులకు

గురువు బోధించినపుడె 

వారు జ్ఞానవంతులవుతారు 

సమాజానికి గణనీయంగా 

దోహదపడుతారు


అప్పటి వరకు వారు 

మౌన శిలల వలె నున్న, 

మౌన మానవులే


కవి ఆచార్య ఆత్రేయ ఒక పాట వ్రాశారు:

"శిలలపై శిల్పాలు చెక్కినారు 

మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు"

"రాజులే మారినా, రాజ్యాలు మారినా 

శిల్పాలు చెక్కు చెదరకుండా ఉంటాయంటారు"


మౌన శిలలను, శిల్పి శిల్పాలుగా 

మలిచిన , ఎంత కాలం అయినా

చెక్కు చెదరకుండా స్థిర స్థాయిగా

నిలిచి పోవడమే కాకుండా

చరిత్రను పదిలంగా కాపాడుతాయి


అలానే మనుష్యులను మంచి మార్గంలో 

నడిచే విధంగా తీర్చిదిద్దిన 

తమకే కాక సమాజానికి, దేశానికి 

ప్రయోజకుడిగా చరిత్రలో నిలిచి పోతాడు(రు).


      

Sunday, December 29, 2024

చంటి పిల్ల తల్లి

అంశం : మరో చరిత్ర 

శీర్షిక : *చంటి పిల్ల తల్లి* 

అది పందొమ్మిది వందల తొంబది 

నాలుగవ సంవత్సరం అక్టోబర్, ఇరువది ఆరు హైదరాబాద్ నుండి ఫ్యామిలీ తో

నల్ల బెల్లి, వరంగల్ జిల్లా,

మా అక్కయ్య ఇంటికి బయలు దేరాం 


వరంగల్ లో ట్రేయిన్ దిగి , గిర్ని బావి

చేరేసరికి రాత్రి 8 గం.లు అయింది.

అక్కడి నల్లబెల్లి కి వెళ్ళా లంటే 

మరో బస్సు ఎక్కాలి 


బస్సు కొరకు వేచి చూస్తున్నాం

ఇదే చివరి బస్సట 

అది పోయిందంటే మరొకటి లేదట 

కళ్ళల్లో వత్తులు పెట్టుకుని చూస్తున్నాం

వీది లైటు క్రింద నిలుచుని ఉన్నాం


ఇంతలోనే ఎర్ర బస్సు 

హారన్ కొట్టుకుంటూ వచ్చి ఆగింది

డ్రైవర్ బయటకు వచ్చి 

నల్లబెల్లి నల్లబెల్లి, లాస్ట్ బస్

అంటూ అరుస్తున్నాడు


మేము గబా గబా బస్ ఎక్కి

సీట్లట్లో కూర్చున్నాం 

ప్యాసింజర్స్ కూడా ఎక్కువగా లేరు

సుమారుగా రాత్రి 9 గం.లకు

బస్ బయలుదేరింది 


కండక్టర్ వచ్చి అందరికి 

టికెట్స్ ఇస్యూ చేశాడు

ముందు వెళ్ళి కండక్టర్ సీట్లో కూర్చున్నాడు 

ప్రతి స్టేజీలో ప్యాసింజర్స్ దిగుతున్నారు 

కానీ ఎవరూ ఎక్కడం లేదు

మేము దిగాల్సిన స్టేజి చివరి స్టేజి 

అదే నల్లబెల్లి 


రెండు మూడు స్టేజీలు దాటాక 

ఒక మహిళ చంటి పిల్లను చంకనేసుకుని 

చింపిరి జుట్టుతో ఏడ్చుకుంటూ

నడిరోడ్డుపైకి వచ్చి ఆపండి ఆపండి

అంటూ ఏడుస్తూ అరుస్తుంది 


బస్సు లైట్లు తప్పా మరో లైట్లు లేవు

డ్రైవర్ బస్సును ఆపాడు

ఆ తల్లి బస్సు ఎక్కింది

వయసు సుమారుగా ముప్పది

ఏండ్లు ఉండవచ్చు 


కండక్టర్ లేచి వచ్చి 

ఎక్కడికని అడిగాడు 

నల్లబెల్లి అని చెప్పింది 

డబ్బులు రూ.లు 20/- ఇవ్వమన్నాడు 

లేవు నాదగ్గర అంది

"ఏంటి ఇది మీ తాత బస్సా అనుకున్నావా"

అంటూ, "డబ్బులు  లేక పోతే దిగిపో అన్నాడు"

అది చిమ్మ చీకటి, 

ఆమె కాళ్ళువ్రేళ్ళు పట్టుకుంది 

అయినా కనికరించలేదు కండక్టర్ 


కండక్టర్ అరుపులు, ఆ మహిళ ఏడ్పులు 

బస్ దద్దరిల్లిన పోతుంది

ఆమే మా తల్లిగారిని అడిగి ఇస్తానంటే 

కండక్టర్ కాస్త శాంతించాడు 


చివరి స్టేజ్ నల్లబెల్లి రానే వచ్చింది

ప్యాసింజర్స్ అందరూ దిగి వెళ్లిపోయారు 

ఆమెతో కండక్టర్ గొడవ పడుతున్నాడు

చంటి పాప ఏడుస్తుంది 

మేము ఫ్యామిలీ తో చివరగా 

లగేజ్ తీసుకుని దిగుతున్నాం 


తెల్లవారాక అడిగి తీసుకొస్తానని

ఆ పిచ్చి తల్లి బ్రతిమి లాడుతుంది 

వినక పోయేసరికి, అందాక చెవి కమ్మలు

పెట్టుకో అంది .

మెడలో పసుపు తాడు తప్ప మరేమీ లేదు

భర్తతో, అత్తామామలతో గొడవ పడినట్లు

అర్ధమైంది , ఏమి తిననట్లు తెలుస్తుంది


"అయితే ఈ రాత్రి బస్సులో పడుకో.

రేపు వెళ్లి డబ్బులు అడుక్కుని రా"

అని అన్నాడు కండక్టర్ 

ఆ తల్లి ఏడుస్తూ బ్రతిమి లాడుతుంది

నాకు ఒక్క సారే , చిర్రుమని కోపం వచ్చింది 

ఒకటి వేయాలనిపించింది 


కానీ కొట్టడం సమస్యకు పరిష్కారం 

కాదని సముదాయించు కున్నాను 

వెంటనే నేను ఆ బస్ చార్జీలు చెల్లించాను 

ఆ పిచ్చి తల్లిని ఇంటికి వెళ్ళమని చెప్పి

నేను మా ఫామిలీ, ఇద్దరు పాపలతో కలిసి

ఇంటికి బయలు దేరాము


ఈ కవితని ఆ "చంటి పిల్ల తల్లికి" అంకితం ఇస్తున్నాను 

Saturday, December 28, 2024

గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు

అంశం: *వలస జీవితం*


శీర్షిక: *గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు*

*నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు* అన్నట్లు
*వలస ఉన్నతమెరుగు వాస్తవం దేవుడెరుగు*

మార్పు అనేది ప్రకృతి ధర్మం
పాటించడం ప్రాణుల విధి

గతుకుల రోడ్లపై నడువ లేక
ఉరిసే గుడిసెలలో ఇమడ లేక
చిమ్మ చీకటిలో చూడ లేక
అప్పుల బాధలను తట్టుకోలేక
ఉపాధి కరువైన ఊర్లలో జీవించ లేక
వేడుకుంటారు జనులు వేనోళ్ళ విధములు

వలస పక్షుల లాగా , మనుషులు
వారి వారి ఉన్నతి కొరకు,
ఉన్నత జీవనం కోసం
లేదా పరిస్తితుల కారణంగా
లేదా ప్రకృతి పరహసించినా
ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి
ఒక గ్రామం నుండి పట్టణానికి
ఒక దేశం నుండి మరొక దేశానికి
నిత్యం వెలుతూనే ఉంటారు
ఎక్కడి కష్టాలు అక్కడే ఉండు

దేశానికి వెన్నెముక గ్రామాలన్నారు గాంధీ
అలాంటి గ్రామాలను అభివృద్ధి చేయకుండా
పట్టణాలను అభివృద్ధి చేస్తే ఫలితమేమి
వలసలు తప్పా మరేమి ఉంటుంది

నాయకులలో స్వార్ధం
నేతలలో అవినీతి పెరిగి పోవడం
ఆశ్రిత పక్షపాతం ఉండటం
వ్యవస్థలు ప్రభుత్వాల నియంత్రణలో
చట్టాలు ధనికులకు చుట్టాలవడం
ప్రజలు ఉచితాలకు
చకోర పక్షుల్లా ఎదిరి చూడటం
సోమరి తనానికి, బానిసత్వానికి
అలవాటు పడటం
ప్రశ్నించే శక్తి కోల్పోవడం
ఓటును నోటుకు అమ్ముకోవడం
మొదలైన అనేక కారణాల వలన
నేడు వలసలకు నాంది పడిందని చెప్పాలి

వలసలు తగ్గాలంటే
నిస్వార్థంతో నాయకులు, ప్రభుత్వాలు
పట్టణాలతో సమానంగా
పల్లెలను అభివృద్ధి చేయాలి
పట్టణ యువతకు వలెనే
గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలి
మౌళిక సదుపాయాలయిన విద్యుత్తు
రోడ్డు రవాణా, విద్య వైద్యం, ఇంటర్నెట్ ను
అభివృద్ధి చేయాలి 

స్వేచ్ఛ ఖడ్గం లాంటిది

అంశం: స్వేచ్ఛ వాక్యం


శీర్షిక: *స్వేచ్ఛ ఖడ్గం లాంటిది*

*స్వేచ్ఛ రెండు వైపుల పదునైన*
*ఖడ్గం లాంటిది*

*స్వేచ్ఛ స్వచ్ఛమైన గాలి వంటిది*

స్వేచ్ఛ ను సద్వినియోగం చేయాలి గానీ
దుర్వినియోగం చేయరాదు

అవకాశముందని అవధులు దాటినా
ఆధికారముందని పరిధులు దాటినా
నోరు ఉందని ఊరును కడిగేసినా
స్వేచ్ఛ ఉందని హద్దులు దాటినా
జీవితం అస్తవ్యస్తం కావచ్చు

రాజ్యాంగం
జీవించే స్వేచ్ఛ నిచ్చింది
మాట్లాడే స్వేచ్ఛ నిచ్చింది
విద్యనభ్యసించే స్వేచ్ఛ నిచ్చింది
మత స్వేచ్చ నిచ్చింది
ఇలా స్వేచ్ఛలు ఎన్ని కల్పించినా
అవి ఇతరులకు , సమాజానికి
హాని కలుగకుండా ఉండాలన్నదే
ప్రధాన ఆశయం

భారతీయ సంస్కృతి
సాంప్రదాయాలకు పుట్టినిల్లు
కులాలు మతాలు ప్రాంతాలు వేరైనా
కట్టుబొట్టు నడతలు
పూజలు పునస్కారాలు
పండుగలు పబ్బాలు
మన సంస్కృతికి అద్దం పట్టాలి

పాశ్చాత్య దేశస్తులు మన నుండి
నేర్చుకోవాలి గానీ
మనం పాశ్చాత్య పోకడలకు
పోకూడదు

పందొమ్మిది వందల తొంబై ఒకటిలో
నాటి ప్రధాని పి.వి. నర్సింహారావు
ఆర్ధిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్
వ్యాపార ఆర్ధిక స్వేచ్చను తీసుకొచ్చి
ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా చేశారు
భారత దేశాన్ని ఒడ్డున పడేశారు

వెలుతురు వెనుక చీకటి ఉన్నట్లు
మంచి వెనుక చెడు ఉంటుంది
డబ్బుపై వ్యామోహం పెరిగింది
కల్చర్ చెడుతుంది,
వావి వరుసలు లేకుండా పోతున్నాయి
మానవ సంబంధాలు చెడుతున్నాయి
వివాహాలు విడాకులకు దారి తీస్తున్నాయి
సహజీవన సంస్కృతి
చాపకింద నీరులా విస్తరిస్తుంది
స్వాముల సంస్కృతి పెరిగింది
స్కాముల దోపిడి పెరిగింది
స్వేచ్ఛ తో నేతలు, బిజినెస్ దారులు
కుబేరులవుతున్నారు
పేదలు, నిరుపేదలు
బికారులవుతున్నారు.
స్వేచ్ఛ కు మరిన్ని హద్దులు
పెట్టకపోతే,
మానవ మనుగడ శృతిమించునేమో!

సంక్రాంతి విశిష్టత

అంశం: *ఐచ్ఛికం*

శీర్షిక: *సంక్రాంతి విశిష్టత*

*మంచు పరదాలతో ప్రకృతి అందచందాలు*
నింగినెగిరే రంగు రంగుల పతంగులు
మనోహర భరితంబు పిల్లల కేరింతలు
అంబురాన్ని తాకే  సంక్రాంతి సంబురాలు!

ముచ్చటగా మూడు రోజుల  పండుగ
భోగి సంక్రాంతి కనుమ వరుసగా రానుండగ
పల్లెల్లో కొత్త ధాన్యాలు ప్రతి ఇంటా నిండుగ
చెడు జ్ఞాపకాలను బోగిమంటలలో కాల్చగ!

ఉషోదయాన కాంతల కోలాహాలాలు
వాకిళ్ళ నిండా ఇంద్ర ధనస్సులా ముగ్గులు
అంద చందాలతో వాకిళ్ళలో ఆవుపేడతో
పిరమిడ్ లను తలపించిన గొబ్బెమ్మలు!

సకల సంపదల నిచ్చు భూమాతను
కొలిచే చక్కని ఆచార సాంప్ర దాయాలతో
పసిడి అందాలతో పుడమి పులకరింపులు
లేత పచ్చని మామిడాకుల తోరణాలు
బంతి చేమంతిపూలతో నిండుగా గుమ్మాలు!

తలస్నానాలాచరించి ధరించే కొత్త బట్టలు
రేగు బండ్లు ,నవధాన్యాలు , పుష్పాలు
పిల్లల తలపై పోసి అరిష్టాల తొలగింపులు
ఆటపాటలు పసందైన విందులు వినోదాలు
చకినాలు,అర్షలు,లడ్డూలు పిండివంటలు!

డూ డూ బసవన్నంటూ గంగిరెద్దుల జోరు
తంబూర,వాయిధ్యాలతోసన్నాయీల హోరు
హరిలోరంగహరియంటూ హరిదాసులవారు
గుక్కతిప్ప లేని గొప్పలతో తుపాకిరాముడు!

సంక్రాంతి సెలవులతో తల్లిగారిండ్లకు
కొత్త అళ్ళుండ్లు , కోడండ్లు పిల్లల రాకతో
రోడ్లు ,బస్సులు రైళ్ళు కిక్కిరిసి పోతుండ
గ్రామాలన్నీ కళ కళ లాడుతుండు!

బొమ్మల కొలువులు , కోతి కొమ్మచ్చిలు
కోళ్ళ పందాలు ,  ఎద్దుల అలంకరణలు
కోడెల పోటీలు , తిరునాళ్ళ జాతరలు
ఆనందించేరు ఎంతో పిల్లలు పెద్దలు!

ధనస్సునుండి మకరంలోకి భానుడి ప్రవేశం
ధనుర్మాస వేళ ఉత్తరాయణంలోకి పయనం
పెద్దలకు పిండతర్పనం ఎంతో పుణ్యఫలం
మునులు ఋషులు మహర్షులకిది నిదర్శనం!

మరెన్నో గొప్ప విశిష్టతలతో సంక్రాంతి
భారతీయులలో తెచ్చు కొత్త కాంతి
ఇదే మన భారతీయ సంస్కృతి
విశ్వాన గడిస్తుండే ఎంతో ఖ్యాతి!


Friday, December 27, 2024

సంగీతం

అంశం : టుడే స్టార్ 

శీర్షిక : *సంగీతం* 

రాగమేదైతే నేమి?

అది సంగీతమే!


సన్నని శబ్ధమేదైతే నేమి?

అది సంగీతమే!


తరువులు ఊగినపుడు 

చెరువులు మత్తడి పడినపుడు 

వచ్చే శబ్ధాలు సంగీతమే!


చెట్టు కొమ్మలకు కట్టిన 

ఊయల నుండి వినిపించే రాగం 

సంగీతమే!


ఆనందంగా ఉన్నపుడు 

పాడే కూని రాగాలు సంగీతమే!


శిశువు జన్మించినపుడు 

అమ్మకు వినిపించేది సంగీతమే!


సంగీతమంటే ఇష్టపడని మనిషి 

మోడు బోయిన తరువు 

రెండూ సమానమే!


సంగీతం లో ఉన్న మాధుర్యం

సంగీతం లో ఉన్న మహత్యం 

సంగీతం వలన కలిగే మేలు

వెలకట్టలేని గొప్ప సంపద!


అమ్మ జోల పాట పాడి 

శిశువును నిద్రపుచ్చ వచ్చు!


వేణు గానంతో ఆవునుండి 

పాలను కార్పించ వచ్చు!


పిల్లన గ్రోవితో సర్పాలను

నాట్యమాడించ వచ్చు!


సంగీతం తో రోగికి 

స్వస్థత చేకూర్చ వచ్చు!


సంగీతం తో నరులను

నాట్యమాడేట్లు చేయవచ్చు!


సంగీత మంటే 

ప్రకృతి పరవసించి పోతుంది!


సంగీత మంటే

ఇష్టపడని వారెవరు 

ఆస్వాదించని వారెవరు!


సంగీతం 

ఉపాధి కల్పించే మేరు శిఖరం!

సంగీతం సప్త సాగరం!


సంగీతం లేకుండా సృష్టి లేదు 

సృష్టి లేకుండా సంగీతం లేదు

సంగీతం లేకుండా ప్రకృతి లేదు 

సంగీతం లేకుండా మనిషి లేడు!


సంగీతం ఊపిరి 

సంగీతం ప్రాణం 

సంగీతం ఉల్లాసం 

సంగీతం స్వాంతన 

సంగీతం ఎంతో మధురం!

Thursday, December 26, 2024

నరుడా! ఓ నరుడా!

నరుడా ! ఓ నరుడా! 

********************
నరుడా ! ఓ నరుడా!  ఓ బావి భారత పౌరుడా !
నర నారాయణుడికైనా ,  మాత యేరా మూలం
నరులందరికీ , నొక్కడే  దేవుడు

బొడ్డు కోసిన నాడు , నూలు పోగు రాదు
జీవి వెళ్లిన నాడు , అంగ వస్త్రం  పోదు

తల్లి ఒడిలోనే ఎవరైనా , చనుబాలే త్రాగేరు
దృష్టి పడని నాటికి , కపటమంటూ యెరుగరు

నరుల నరాల్లోన, పారేదీ రుధిరమే
నాది నీదనే స్వార్ధం , దరి చేయ నీయకు

విద్యా బుద్దులు నేర్చి , వినయంబు పెంచు
మాటకారి తనంతో , మోసాలు చేయకు

అమాయక ప్రజలకు , టోపీలు వేయకు
ఉనికిని చాటుకొనుటకే, ఈ జగతిలోన యుద్దాలు

ఆశలు తగ్గిస్తే , సుఖ శాంతులు వెళ్లివిరిసేను
అహం  కాల రాస్తే  , గౌరవాలు పెరిగేను

నీవు నేర్చిన విద్యను , నలుగురికి పంచు
నిత్యం వృత్తులతోటి  , ఉత్పత్తులు పెంచు

నీవు పాటించని నీతులు , వల్లించ  బోకు
నీకు తెలియని వాటిని , పట్టించు కోకు

నిను కన్న తలి దండ్రుల , మరువ బోకు
ఆలు బిడ్డల నెల్ల , చల్లంగా చూడు  

శాశ్వతమంటూ ఏదీ లేదు , ధరణి లోన
నిండు మనసుతో నొక్క , మేలైన తలపెట్టు

నీ జన్మ భూమిని , నిర్భయముగా పొగుడు
నీ  మాతృ భూమికి, రక్షణగా నిలువు

నిత్య పురస్కారాలతో  , ప్రజలు నిను కొలిచెదరు
జగతిలో నీ కీర్తి , వర్ధిల్లు చుండు  
 

ఇంకా ఎంత కాలం పురుషులపై వివక్ష

అంశం: ఇంకా ఎంత కాలం


శీర్షిక: *ఇంకెంత కాలం పురుషులపై వివక్ష?*

సృష్ఠిలోనూ, ప్రకృతిలోనూ
సమాజంలోనూ , వ్యవస్థలలోనూ
అన్ని  కాలాల లోనూ
పురుషులపై వివక్ష దండిగానూ!

చెట్టుకు పుట్టకూ స్త్రీ పేరే
చెరువుకు చేనుకూ స్త్రీ పేరే
గ్రహాలకు నక్షత్రాలకు స్త్రీ పేరే
పంచ భూతాలకు స్త్రీ పేరే
పవిత్ర స్థలాలకూ స్త్రీ పేరే!

పాపైనా బాబైనా
జన్మించు నొకే తల్లి గర్భాన
పుట్టినపుడు శిశువులకు
యిచ్చు నొకే చనుబాలు అమ్మ!

పెరిగి పెద్దవారవుతుంటే చాలు
వివక్ష స్పష్టంగా గోచరించు
పాపలపై సానుభూతి
బాబులపై కరుకు తనం!

కొడుకులు సంపాదించిన డబ్బు
జీవితాంతం తల్లి దండ్రులకే
కూతుర్లు సంపాదించిన డబ్బు
భర్తా ,అత్తా మామలకే!

కూతుళ్ళ చదువు ,పెళ్ళిళ్ళ అప్పులు
తల్లి దండ్రులు కొడుకులు తీర్చాలి
ఆస్తులలో కూతుళ్ళకు వాటా ఇవ్వాలి
లేదంటే కోర్టులలో కేసులు పెడుతారు!

ఇంట్లో తాత నాణమ్మలున్నా
అవిటి అక్కా తమ్ముళ్ళు ఉన్నా
కూతుళ్ళకు భాద్యత ఉండదు
కానీ ఆస్తులపై సర్వ హక్కు లుంటాయి!

పెళ్ళి కావాలంటే మగవారే
ఉద్యోగస్తులై ఉండాలంటారు
ఉద్యోగం, అదియును సాఫ్టవేర్
కాకుంటే పిల్లనివ్వ నంటారు!

ఆడపిల్ల కంటే మగవారే ఎత్తు ఉండాలి
ఎత్తు లేకుంటే పెళ్ళి చేసుకోరు
మీసాలు రాకుంటే పెళ్ళికి పనికి రారు
ఆడవారికి లేకుంటే అందమైన వారు!

పురుషులకు ఏడ్వడానికి హక్కు లేదు
ఏడుస్తే నవ్వుతుంది సమాజం
స్త్రీలకు ఏడ్వడానికి హక్కు ఉంది
ఏడుస్తే, అది సానుభూతి చూపు తుంది!

పుట్టినింటి నుండి మెట్టినింటికి పోతే
వనితల భాద్యతలు మాయ మవుతాయి
తల్లి దండ్రుల పోషించు భాద్యతలు
పురుషులపైననే పడు తుంటాయి!

పండుగలకు పబ్బాలకు కూతుళ్ళకు
పుట్టింటి వారు కట్నకానుకలు పెట్టాలి
ఆ అప్పులు కొడుకులే తీర్చాలి
కూతుళ్ళకు  ఉండవు భాద్యతలేవీ!

తల్లి దండ్రులకు కర్మకాండలు చేయాలి
మీసాలు గుండ్లు కొట్టించు కోవాలి
యేడాది వరకు సూతకం పాటించాలి
నెల మాషికాలు,యాడాది మాషికాలు ,
బ్రతికున్నంతకాలం  తద్దినాలు పెట్టాలి!

ఆస్తి హక్కులని గొంతెత్తుతారు
చట్టాలను చూపెట్టి భయ పెడుతారు
తల్లిదండ్రుల ,అంగ వికలుల,
పోషించుట మా భాద్యత కాందంటారు!

భార్యలకు బీరువాలో
నిండుగ బట్టలు బంగారు నగలు
భర్తలకు రెండు చొక్కాలు
రెండు పాంట్లుంటే అదే పదివేలు
మగాడి త్యాగం మరువలేనిది!

ఇంట్లోనూ , ఆఫీసుల్లోనూ
సమాజం లోనూ , కోర్టులలోనూ
రాజకీయాల్లోనూ ,రాచరికల్లోనూ
మగువల పైననే సాను భూతీ
స్త్రీల పైననే జాలీ దయ కరుణ!

సృష్టి లోనూ అదే వివక్ష
మహిళలు ఎక్కువ కాలం
జీవిస్తే
పురుషులు తక్కువ కాలం
జీవిస్తారు

ఏమిటీ సంస్కృతి , సాంప్రదాయాలు
ఏమిటీ విషమ పరిస్థితి
ఎంత కాలం ఈ దుర్వ్యవస్థ
*ఇంకెంత కాలం పురుషులపై వివక్ష*

ట్యూన్ లిరిక్స్

అంశం: ట్యూన్ లిరిక్స్

హామి: ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం అనుకరణ కాదు

శీర్షిక: కుర్రాళ్ళు- ట్యూన్ లిరిక్స్

పల్లవి:
అందమైన పల్లెటూరి పడుసువే
చూడనెంతో చక్కగా ఉన్నావే
వయ్యారం ఒలక బోస్తున్నావే
గులాబీల చీరెలో అదిరి పోతున్నావే
గూడు కట్టుకుని ఉందాం నాతో రావే   "గులాబీ"

చరణం:01
మమతాను రాగాలతో
మనమిద్దరం ఒకటయి.      "మమతాను"
ఆకాశంలో విహరిద్దాం
ఆనందంగా జీవిద్దాం.      "ఆకాశంలో".   "గులాబీల"

చరణం:02
ఏదో ఒక పని చేశేస్తా
అన్నీ నీకు కొని తెస్తా.    "ఏదో"
అంగ రంగ వైభవంగా
హాయిగా గడుపుదాము.    "అంగ"  "గులాబీల"


దానం కాదది ' దౌర్బల్యాన్ని పెంచే యుక్తి

అంశం: చిత్ర కవిత


శీర్షిక: *దానం కాదది ,దౌర్బల్యాన్ని పెంచే యుక్తి*

*ఎడమచేతితో చేసిన దానం*
*కుడి చేయికి కూడా తెలియకూడదంటారు*

మహాభారతంలో, ఒక సారి కృష్ణుడు,
కర్ణుడు ఎడమ చేతి వైపు ముత్యాలు
పొదిగిన బంగారు గిన్నెలో నూనేతో
ఉంటే , కుడి చేతితో తలంటు కుంటుండగా
కృష్ణుడు వచ్చి, ఎడమ చేతి వైపున ఉన్న
బంగారు గిన్నెను ఇవ్వమని కోరుతాడు

"దానిదేమి భాగ్య మని", ఎడమ చేతితోనే
బంగారు గిన్నెను ఇచ్చేస్తాడు కర్ణుడు
"ఎడమచేతితో ఇవ్వడం తప్పుగదా" అంటే,
"తప్పేకావచ్చు,  కానీ ఎడమచేతినుండి కుడి
చేతిలోకీ తీసుకునే లోపే, ఏమైనాజరుగవచ్చు
నేను దానం చేయలేక పోవచ్చునీకు"
అంటాడు కర్ణుడు
దానానికి అంతటి గొప్ప తనం ఉండేది.

జనులను ఉచితాలకు బానీసలు చేయడం
ధూమ మద్యపానానికి అలవాటు చేయడం
యువతకు ఉపాధిని కల్పించలేకపోవడం
నాయకులలో స్వార్ధం పెరిగి పోవడం
ప్రజలను ఓటు బ్యాంకుగానే చూడటం
వంటి వాటి వలన
స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా
పేదలు నిరుపేదలుగానూ
ధనికులు మరింత ధనికులుగా ఎదుగుతున్నారు

ఎవరితోనో వంట సామాగ్రిని పంపించి
పేదలకు ఇచ్చి నట్లు ఓ సెల్ఫీ తీసి
వాటిని నాయకులకు పంపడం
పేదలు , నాయకులను దేవుళ్ళుగా
మొక్కడం అనేది ఓ తంతుగా మారింది
ఓటు బ్యాంకు మద్దతు కొరకు 
నేతలు వేసే ఎత్తుగడ 
ఇది *దానం కాదది, దౌర్బల్యాన్ని పెంచే యుక్తి*

ఉచితంగా పంచే వస్తువులు డబ్బు ఏదైనా
ప్రజలు చెల్లించే పన్నులేనని తెలుసుకోవలె
చేతలుడిగిన వారికి మినహాయిస్తే,
ఉచితాలను అడ్డుకుని, ప్రశ్నించడం
మొదలు పెడుతూ, ఓటు హక్కును
సద్వినియోగం చేసుకుంటే
నాయకులు దారికి వస్తారు 
శ్రమశక్తి పెరిగి, ఉత్పాదకత పెరిగి
దేశం,  అభివృద్ధి చెందిన దేశంగా
పిలువబడుతుంది

   

Wednesday, December 25, 2024

మల్లెపువ్వు

అంశం: ఆ పాట - నా పదాలు
సినిమా పేరు: మల్లె పువ్వు
రచయిత పేరు: ఆరుద్ర
సంగీత దర్శకత్వం: చక్రవర్తి
పాడిన వారు: బాల సుబ్రహ్మణ్యం
నటీనటులు: శోభన్ బాబు, లక్ష్మీ, జయసుధ

శీర్షిక: *భగ్న ప్రేమికుడి ఆవేదన*

సందర్భం: తాను ప్రేమించిన ప్రేయసి,
సిరి సంపదలు కలిగి యున్న మరొకరిని
వివాహం చేసుకున్న సందర్భంగా

ఓ ప్రియా!
నిన్నే తలచితిని,
నిన్నే ప్రేమించితిని
నీవే సర్వస్వమనుకుంటిని
ప్రకృతిలో పరవసించాలనీ
ఆకాశంలో విహరించాలనీ
ఎన్నెన్నో కళలు గంటిని

మల్లెపువ్వు కంటే తెల్లనిదని
మకరందం కంటే తీయనిదని
మన ప్రణయం అనుకుంటిని
కానీ,  అది నేడు విషమని
అవగతమయినది

ప్రేమకు అర్థం లేదా
లేక నా ప్రేమపై నమ్మకం లేదా
ఎందుకు వంచన చేశావు
ధనానికి అమ్ముడు పోయావు
నన్ను విడిచి పోవుట నీకు సులువు
కానీ విడువదు నా హృదయం

నా ప్రేమకు చివరికి మిగిలేది దుఃఖమేనా
నా విరహానికి ఫలితం బాధేనా
నీవు చేసిన గాయం ఇక మానదు
నాలో రేగే జ్వాల ఇక మారదు

      

దీపారాధన

అంశం: *నక్షత్ర దీపం*


శీర్షిక: *దీపారాధన*

*భక్తితో ఏమి చేసినా ముక్తి దాయకం*

కోరిన కోరికలు తీర్చు మాసం
కార్తీక మాసం,
కార్తీక మాసంలో దీపారాధన చేసిన
జీవితం ధన్యం
అయ్యప్పస్వామి పద్దెనిమిది మెట్లకు
భక్తులు చేయు దీపారాధన అద్భుతం,
మహాద్భుతం

మతసామరస్యానికి, కులమత
పేద ధనిక చిన్న పెద్దా తేడా లేకుండా
అందరూ దైవ సమానంగా భావించి
అత్యంత నియమ నిబంధనలతో
నలుబది ఒక్క రోజులు చేసే దీక్షయే
అయ్యప్ప స్వామి దీక్ష ,
స్వామియే శరణం అయ్యప్ప!

గురువు వద్ద తులసి మాల ధారణ చేసి
నిష్టతో భక్తులు ఉషోదయాన మేల్కొని
శీతల నీటితో నిత్య స్నానమాచరించి
నల్ల వస్త్రములు ధరించి, నేలపై నిద్రిస్తు
కాళ్ళకు చెప్పులు లేకుండా
ఒక్కపూట భోజనం చేస్తూ గడుపుతారు
అయ్యప్ప భక్తులు

సబరమళి పోవు ముందు
అయ్యప్ప భక్తులందరు కలిసి
భజనలు చేయుచు
మణికంఠుడిని నిలిపి ,
పద్దెనిమిది మెట్లు కట్టి
మోక్షము ప్రసాదించమని
మెట్టుకో రెండు దీపాలు పెట్టి
దీపారాధన ళభక్తితో చేసి
అహంకారము ననుచుకొన
సహనమును పెంచుకునను
మెట్టుకో కొబ్బరికాయను
భక్తితో కొట్టి
మంత్రపుష్పములతో పూజలను చేసి
అయ్యప్ప భక్తులను సత్కరించి
బంధుమిత్రులకు భోజనములు
పెడుదురు

సబరమళి లో  మకర జ్యోతి (నక్షత్రం)
దర్శనంతో భక్తులు పరవిసించి పోయేరు
జీవితాలు ధన్యమైనట్లుగా
ధరణి పిక్కటిల్లేలా ముక్త కంఠంతో, 
స్వామియే అయ్యప్ప స్వామియే శరణం
అంటూ తిరుగు ముఖం పట్టేరు

స్వామియే అయ్యప్ప, శరణం అయ్యప్ప! 

వాజ్ పాయ్ పేరడీ పాట

 పేరడీ:

పల్లవి:
సరి లేరు నీకెవ్వరూ ఓ వాజ్ పాయ్
సరి రారు నీ కెవ్వరూ....    "సరి"

చరణం:1
రాజ నీతి లోన  రాజుల మించి నావు
రణభూమి యందు అందరినీ మించి నావు
ఈ దేశ ప్రజలందరూ ...ఓ వాజ్ పాయ్
జోహారు లను చుండిరీ.... "సరి"

చరణం:2
బ్రహ్మ చారివై నీవు, భవ బంధాల వీడినావు
ప్లానులు వేసినావు , పార్టీని నిలిపి నావు
ఈ దేశ ప్రజలందరూ  .... ఓ వాజ్ పాయ్
జోహారు లను చుండిరీ.....  "సరి"

చరణం:3
కలహాలకు దూరమైన, కలాం నెన్నిక చేసి
భావి భారత్ కు నీవు , ప్రెసిడెంట్ ను చేశావు
శత్రు దేశాలకు నీవు , యమ దూతలా నిలిచావు
ఈ దేశ ప్రజలందరూ.... ఓ వాజ్ పాయ్
జోహారు లను చుండిరీ..... "సరి"

Tuesday, December 24, 2024

దేశ ప్రగతి మన భాద్యత- అంతాక్ష్యరీ

అంశం: అంత్యాక్షరి


శీర్షిక:  దేశ ప్రగతి మన భాద్యతి

01.
*నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం*
పాశ్చాత్య పోకడలను మానేద్దాం
భారతీయ సంస్కృతిని పునరిద్దాం
బావి తరాలకు ఆదర్శమవుదాం
భారతీయ గొప్ప తనాన్ని చాటుదాం!

02.
*మనలను మనమే శిల్పిచు కోవాలి*
గొప్ప నైన మన సంస్కృతిని విశ్వమంతా చాటుదాం
భగవద్గీత ను ప్రతి దేశం లో పంచుదాం
ప్రపంచానికి మార్గదర్శం అవుదాం
ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం సాదిద్దాం!

03.
*భారత దేశ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి*
శాస్త్ర సాంకేతిక రంగాలలో రానిద్దాం
పిల్లలకు చక్కని చదువులు నేర్పిద్దాం
మానవ సంబంధాల గొప్ప తనాన్ని చాటి చెప్పుదాం
దాన గుణాన్ని అలవర్చుదాం!

04.
*మనసు తనాన్ని పెంచుకుని ఆచరణలో భాగస్వామ్యం పంచాలి"
పిల్లలకు చిన్నతనం నుండే పర్యావరణ పరిరక్షణ గూర్చి బోధించాలి
పిల్లలలో స్వయం శక్తిని పెంపొందించాలి
పిల్లలలో సన్మార్గంలో నడిపించాలి
బాలబాలికలలో దేశ భక్తిని పెంపొందించాలి

05.
*అదియే సరియైన బాట*
గ్లోబలైజేషన్ వల్ల నేడు ప్రపంచ కుగ్రామం అయింది
అవకాశాలను అంది పుచ్చుకోవాలి
వ్యక్తిగత అభివృద్ధే దేశాభివృద్ధి
దేశ ప్రగతికి నిరంతరం పాటు పడాలి!

         

తడారిన కనురెప్పలు

అంశం: *పొడి రెప్పల మాటున*


శీర్షిక: *తడారిన కనురెప్పలు*

ఎత్తెన  ఆకాశ *హార్మ్యాలు*
*హార్మ్యాల* మధ్య  *భవనాలు*
*భవనాల* నడుమ  *పారేటి నదులు*
*నదుల*  నానుకుని బీడు *భూములు*
*భూముల* లో చిన్న చిన్న  *గుడిసెలు*
*గుడిసెల* లోనే బడుగు  *జీవులు*
*జీవుల* ముఖాల్లో నేడు *తడారిన కనురెప్పలు*

గంట గంటకు గుడి గంటలు
మ్రోగినట్లు
గంట గంటకు బుల్డ్రోజర్ల హారన్లు
పోలీసుల బూట్ల చప్పుల్లు
గుండెలను పిండుతున్నాయి
బిక్కు బిక్కు మంటూ దిక్కులేని పక్షుల్లా
జీవనోపాధికి నోచకోక
కడుపులు ఎడారవుతున్నాయి
కనులు పొడారుతున్నాయి!

జంట నగరాల నిండుగా
మూసీనది చుట్టూరా
యేళ్ళ కొలదీ నివశిస్తున్న
ఇండ్లు కూలుతున్నాయి
ఎవరినీ ఎదిరించలేని అశక్తతతో
*తడారిన కను రెప్పల* మాటున దాగిన
బడుగు జీవుల ముఖాల్లో
అట్టడుగున దాగి ఉన్న
అశ్రువులు పెల్లుబుకుతున్నాయి

స్వాతంత్ర్యం వచ్చి
ఏడు దశాబ్దాలు దాటినా
విద్యుచ్ఛక్తి సౌకర్యాలు
త్రాగు నీటి సదుపాయాలు
విద్య వైద్య సౌకర్యాలు లేక
బోరుమంటుంటూ
దుఃఖంతో కుమిలి పోతుంటే
పుండు మీద కారం చల్లి నట్లు
కష్ట  జీవుల గూళ్ళనే కూల్చిరా!

ఐదేళ్ళకోసారి ఎన్నికలు వస్తాయి
ఎన్నికలప్పుడే నాయకులు
ఓటుకో నోటు చేతికి ఇచ్చి
ఆ పూటకు పావు షేర్ పోయించి
కడుపు నిండా బిర్యానీ తినబెట్టి
కనబడరు మరో ఐదేళ్ల వరకు
ఇచ్చిన హామీలన్నీ బుట్ట దాఖలు!

ఐదేళ్ల పాలన కాలం నేతలదనీ
నూరేళ్ళ జీవన కాలం ఓటర్లదనీ
గుర్తించ కుండిరా!

తడారిన బ్రతుకుల్లో
ఇంకెంత కాలం ఈ బానిసత్వం
ఇంకెన్నాళ్ళు  ఈ నిరంకుశత్వం
ఇంకెన్నాళ్ళు ఈ అంధకారం
మరెంకెన్నాళ్ళు ఈ ఈసడింపు
ఇంకెన్నాళ్ళు ఈ బడుగుల జీవితాలతో
పరిహాసాలు
వెలుగులు నింపాల్సిన  గుండెల్లో
ఇంకెన్నాళ్ళీ రైల్ల పరుగులు!

ఇక నైనా ప్రభుత్వాలు గుర్తించేనా
బడుగు జీవుల కష్టాలను తొలగించేనా
విద్య వైద్యం విద్యుత్తు సదుపాయాలు
ఉచితంగా అందించేనా
వారి గుడిసెలను వారికందించి
స్వేచ్ఛగా జీవించ డానికి
అవకాశాలు కల్పించేనా
జీవనోపాది చూపించేనా
రాజ్యాంగ హక్కులను
కాల రాయకుండా చూసేనా
చట్టం ముందు అందరూ సమానులే
అని నిరూపించేనా! 

గోదమ్మ

అంశం: మానస వీణ


శీర్షిక: గోదమ్మ

నడిరేయిలో లేచి
నదిలో స్నానమాచరించి
ధవళ వస్త్రములు ధరించి
నల్లని కురులను దువ్వి
వాలు జడను వేసి
రామదాసు సాహితీ కళా సేవా సంస్థ:
తేది:24.12.24
అంశం: మానస వీణ
పేరు: మార్గం కృష్ణ మూర్తి 
ఊరు: హైదరాబాద్ 
క్రమ సంఖ్య:
హామి: ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం అనుకరణ కాదు 

శీర్షిక: గోదమ్మ 

నడిరేయిలో లేచి
నదిలో స్నానమాచరించి 
ధవళ వస్త్రములు ధరించి 
నల్లని కురులను దువ్వి 
వాలు జడను వేసి

చంద్ర బింబం లాంటి ముఖముపై 
సన్నని కురులను సాగదీసి 
కండ్లకు కాటుక బెట్టి 
నుదుట కుంకుమ దిద్ది
ముఖము సింగారించుకుని

చెవుల దుద్దులు పెట్టి 
తలన మల్లెల మాల చుట్టి 
చేతులకు గాజులు పెట్టి 
కాళ్ళకు గజ్జెలు కట్టి
గల్లు గల్లు మని శబ్దం చేస్తూ

చెలియలను పురమాయించి 
తులసి మాలను నొక చేతిలో 
నెమలి పింఛం మరో చేతిలో పట్టి
వేకువ జామునే , శశి సాక్షిగా 
వయ్యారం వొలుక బోస్తూ 
మయూరంలా

మదిన తలుచుకుంటూ 
పవిత్ర మాసమైన ధనుర్మాసంలో వస్తివా
విష్ణు చిత్తుల వారి ముద్దుల తనయా
నీ *మనసు వీణను* మీటినంతనే
నీ చెంత చేరువాడను

చింతించకు నీవెపుడును చెలియా
నా హృదయం నీది కాక మరెవ్వరిది గోదమ్మా!
నా మనసున నొదిగి ఉన్న కోవెలవు నీవేగా

         

చంద్ర బింబం లాంటి ముఖముపై
సన్నని కురులను సాగదీసి
కండ్లకు కాటుక బెట్టి
నుదుట కుంకుమ దిద్ది
ముఖము సింగారించుకుని

చెవుల దుద్దులు పెట్టి
తలన మల్లెల మాల చుట్టి
చేతులకు గాజులు పెట్టి
కాళ్ళకు గజ్జెలు కట్టి
గల్లు గల్లు మని శబ్దం చేస్తూ

చెలియలను పురమాయించి
తులసి మాలను నొక చేతిలో
నెమలి పింఛం మరో చేతిలో పట్టి
వేకువ జామునే , శశి సాక్షిగా
వయ్యారం వొలుక బోస్తూ
మయూరంలా

మదిన తలుచుకుంటూ
పవిత్ర మాసమైన ధనుర్మాసంలో వస్తివా
విష్ణు చిత్తుల వారి ముద్దుల తనయా
నీ *మనసు వీణను* మీటినంతనే
నీ చెంత చేరువాడను

చింతించకు నీవెపుడును చెలియా
నా హృదయం నీది కాక మరెవ్వరిది గోదమ్మా!
నా మనసున నొదిగి ఉన్న కోవెలవు నీవేగా 

ఇంతకు నీవెవ్వరు?

అంశం: ఇంతకు నువ్వెవరు?


శీర్షిక: *మనీషివి నీవు*

నీవెవరివి?
మనిషివా ? మానువా?
మనిషిని పోలిన రోబోవా?

లేదు లేదు మనిషివే
నీవు ఒక ప్రాణివి
నీవు సంఘ జీవివి
భూ మండలంలో
రవి గాంచని చోటును
గాంచు కవివి

మాటలాడ గలవు
చూడ గలవు వినగలవు
అర్ధం చేసుకోగలవు
విద్య నభ్యసించ గలవు
విజయం సాధించ గలవు
ప్రకృతి నుండి ఎన్నో నేర్చుకో గలవు
అనుభవం గడించ గలవు
శాస్త్ర సాంకేతిక రంగాలలో
విద్య వైద్య కళా రంగాలలో
వ్యవసాయ రంగాలలో
స్వయం సమృద్ధి సాధించ గల
*మనీషివి నీవు*

పంటలు పండించే రైతుగా
కష్టించే కార్మికుడిగా
పోరాడే యోధుడిగా
దేశాన్ని రక్షించ జవానుగా
వైద్యాన్ని అందించు డాక్టర్ గా
విద్యను బోధించు గురువుగా
జ్ఞానాన్ని పంచే శాస్త్ర వేత్తగా
బహుముఖ పాత్రలను పోషించు
*మనీషివి నీవు*

సమాజ హితం కోరు
సమతా భావం చూపగల
సమాజానికి సలహాలివ్వగల
వ్యవస్థల సంస్కరించగల
*మనీషివి నీవు*

రాజ్యాంగ హక్కులను
సాధించు కోగల
భాద్యతలను నిర్వర్తించగల
భారత దేశ పౌరుడిగా
ఆదర్శ నీయుడిగా , మార్గదర్శిగా

శక్తికి తగిన సేవలు అందిస్తూ
తనకు భారం కానీ దాన ధర్మాలు చేస్తూ
ఆపదలో నున్నవారికి అభయమిస్తూ
భారత సంస్కృతి సంప్రదాయాలను
మానవ సంబంధాలను కాపాడుతూ
ఆత్మీయులను పలకరిస్తూ
అమ్మా నాన్నల , గురువులను
ప్రతి నిత్యం దైవాన్ని పూజించే
*మనీషివి నీవు*

Monday, December 23, 2024

అమీన్ పూర్ చెరువు, హైదరాబాద్

అంశం: అలంకారాలు -

స్వభావోక్తి అలంకారం


శీర్షిక: *అమీన్ పూర్ చెరువు*
ప్రక్రియ: స్వభావోక్తి అలంకారం

నాడు అదోక  కాలుష్యంతో  కంపు కొడుతున్న చెరువు, చిన్న చిన్నచినుకులు పడినా, కుంభవృష్టి కురిసినా, ఆ వర్షపు నీరంతా ఆ చెరువు లోకి చేరేవి. కంపనీలు విడుదల చేసిన కాలుష్యపు నీరు నురుగులు కుక్కుకుంటూ వచ్చి చేరేవి.చాకలి వారు బట్టలు ఉతకడం , జనులు బాహ్యాలి వెళ్ళడం, చెరువులో డెక్కాకు పెరిగి, ముండ్ల కంపలతో మురికి నీరుతో చిందర వందరగా దర్శనమిచ్చేది.

నేడు, ఆ చెరువును  మానవతావాది, పర్యావరణ పరిరకుడైన  ఒక పోలీసు కమీషనర్
దత్తత తీసుకున్నాక, చెరువు రూపురేఖలే మారిపోయాయి. వచ్చే కాలుష్యపు నీరు నిలిపి వేయడం ,డెక్కాకు తొలిగించడం, అందమైన చెరువు.చుట్టూరా ఫెన్సింగ్ వేయడం , కట్టను వేయడం , కట్టమైసమ్మ గుడిని కట్టించడం వలన, చెరువు కళకళ లాడుతుంది. ఈ చెరువుకు విదేశీ పక్షుల రాక అనే ఒక ప్రత్యేకత ఉండటం వలన పర్యాటకులు నిత్యం ప్రశాంతత కోసం వస్తుంటారు. తిలకిస్తారు. మనో వ్యధలను పోగొట్టకుంటారు. అందులోని చేపలను  చూసి పరవసించి పోతారు. పర్యాటకులు వేసే ఆహారం తింటూ , వారికి ఎంతో వినోదాన్ని కలిగిస్తుంటాయి. సువిశాలమైన స్థలం,చుట్టూరా చల్లని వాతావరణం, మనసుకు స్వాంతన నిస్తుంది.

సుదూర ప్రాంతాల నుండి,విదేశాల నుండి గగనతలంలో ఎగురుతూ పక్షులు, రెక్కలు రెపరెప  లాడించుకుంటూ , వయ్యారంగా వంపులు తిరుగుతూ, ముచ్చటించుకుంటూ, కూని రాగాలు
తీసుకుంటూ , ప్రతి సంవత్సరం అమీన్ పూర్ , (హైదరాబాద్ ) చెరువుకు వస్తుంటాయి.

కొంత కాలం సేద తీరాక , వివిధ దేశాల నుండి వచ్చిన అంద చందాల , రంగు రంగుల పక్షులు, ఇక్కడి పక్షులతో మమేకమై , ఇక్కడి ప్రాంతాల పరిసరాల స్థితి గతులను, నివాస మరియు ఆహార అవకాశాలను, రక్షణ సౌకర్యాలను అనుభవించి, కొంత కాలం సహజీవనం చేసీ, మిత్రబృందాలతో కలసి గుంపులు గుంపులుగా విదేశాలకు వెళ్లి పోతుంటాయి. కొంత కాలానికి మల్లీ వస్తుంటాయి.

      

ఆత్మాభిమానం - అహంకారం

అంశం: *ఆత్మాభిమాన జ్వాల*


శీర్శిక: *ఆత్మాభిమానం - అహంకారం*

*"అహంకారానికి ఆత్మాభిమానానికి*
*మధ్య తేడా కేవలం వెంట్రుక వాసి*
*మాత్రమే"*

అతి ఏదైనా అనర్ధమే
మితమేదైనా అమృత తుల్యమే

పరిమిత అహంకారం లేకుండా
అభివృద్ధి లేదు
పరిమిత ఆత్మాభిమానం లేకుండా
వికాసం లేదు

భార్యా భర్తల మధ్య సంబంధాలు
తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలు
బంధుమిత్రుల మధ్య సంబంధాలు
బెడిసి కొట్టడానికి కారణం
అధిక  ఆత్మాభిమానం, అధిక అహంకారం

ఆత్మాభిమానం అధికమైనా
అహంకారం అధికమైనా
అగ్ని జ్వాలలు ఉవ్వెత్తున ఎగిరి
వ్వవస్థలు భస్మీపఠలం అవుతాయి

ఆత్మాభిమానం కోల్ఫోయావంటే
ఎదుటి వారికి బానీసయినట్లే
ఆత్మాభిమానం గానీ అహం లేదంటే
నీలో రేషం చీము నెత్తురు లేనట్లే

ఆత్మాభిమానం కోల్పోయిన వారు
సోమరులుగా తయారవుతారు
అహంకారం , ఇగో పెరిగిన వారి వలన
వ్యవస్థలో, సమాజంలో, కుటుంభాలలో
కోపాలు, తాపాలు, మనస్పర్థలు పెరిగి
వినాశనానికి దారి తీస్తాయి
ఈ రెండూ తమకు, తమ కుటుంబాలకు
వ్యవస్థలకు తీరని నష్టం చేకూరుస్తాయి

ఆత్మాభిమానం వ్యక్తిత్వంలో అంతర్భాగం
పరువు ప్రతిష్టలలో ముఖ్య భూమిక పోషిస్తాయి
ఆరోగ్యంగా ఉన్నంతకాలం
ఊరికినే కొడుకు కోడలు వద్ద ఉండాలన్నా
కూతురు అల్లుడి ఇంట్లో ఉండాలన్నా
ఏదో ఒక మాట పడాలన్నా ఆత్మాభిమానం
అడ్డు వస్తుంది

పిల్లలు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నా
ఇష్టమైన చదువులు చదువకున్నా
కొడుకులు బిడ్డలు తల్లిదండ్రుల మాటను
లెక్క చేయకున్నా
ఇరుగు పొరుగు సూటిపోటి మాటలన్నా
ఆత్మాభిమానం అడ్డు వచ్చి
ఆత్మ హత్యలు చేసుకున్న వారు లేకపోలేదు

నిన్నటి తరంలో ఉన్నంత ఆత్మాభిమానం గల
జనులు నేటి తరంలో తగ్గారు
నేటి తరంలో ఉన్నంత ఆత్మాభిమానం
గల ప్రజలు రేపటి తరంలో చాలా తగ్గిపోతారు
స్వార్ధం, సంపాదన, సోమరితనానికి
అలవాటు పడిన నరులు ఆత్మాభిమానం
కోల్పోతున్నారు, ఇది ప్రమాదకరం

ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా
తెలిసిన వారే జీవితంలో విజయం సాధిస్తారు
అలానే, ఆత్మాభిమానం లో కూడా
సల్లుబిగులు ఉండాలి

ఆత్మాభిమానం , పౌరుషం , రేషం
పూర్తిగా లేకుండా బానిసలుగా జీవించు వారిని
బ్రతికినా మరణించినట్లు గానే భావిస్తారు

          

వృక్షో రక్షతి రక్షితః

అంశం: సెల్ఫీల కవిత


శీర్షిక: *వృక్షో రక్షతి రక్షితః*

*వృక్షాలను మనం రక్షిస్తే, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి*

*సమాజం నుండి ఏమి పొందుతామో, సమాజానికి అందులో కొంతైనా ఇవ్వాలి*

*సృష్టి నుండే నేర్చుకోవాలి ఏదైనా, ఎవరైనా*

ప్రకృతి విజ్ఞాన భాండాగారం
ప్రకృతిని అర్ధం చేసుకోవడం కాదు ఎవరి తరం
ప్రకృతి జీవకోటికి ఎంతో మేలుచేస్తుంది
జ్ఞానాన్ని అందిస్తుంది , విజ్ఞానం పెంచుతుంది
మనిషి ఎలా జీవించాలో నేర్పుతుంది
మనుగడ ఎలా సాగించాలో అర్ధం చేపిస్తుంది

పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది
పంచ భూతాలను సమన్వయం చేస్తుంది
సూర్య చంద్రులకు తోడుగా ఉంటుంది
నింగీ నేలకు చేరువగా ఉంటుంది
సప్త సముద్రాలను నియంత్రణలో పెడుతుంది

ఇన్ని సేవలందిస్తున్న ప్రకృతిని చూసైనా
మానవుడు తోటి మానవులకు
ఏదో ఒకటి చేయ ఆలోచించాలి
*మనసు ఉంటే మార్గం ఉంటుంది*

అరిషడ్వర్గాలు పుణికిపుచ్చుకున్న
అహం స్వార్ధం మోసం వెన్నంటి ఉన్నా
చిన్న పనిని జేయ నెంతో మేలు కలుగు జగతికి
కష్టం కానిది ఖర్చు లేనిది

తినిన పండ్ల విత్తనాలను
మామిడి, పనస, జామ, శీతాఫలం,
నేరేడు , బొప్పాయి మరెన్నో పండ్ల గింజలను
జమ చేసి శుద్ది చేసి
ఇంటి ప్రక్కన ఖాళీ స్థలంలో
రోడ్లకు ఇరువైపులా విసిరినా
చెట్లు మొలిచి, కాయలు పండ్లు కాచి
మనకు , బాటసారులకు, పక్షులు,
వానరులకు , నీడ నిచ్చు, గూడు నిచ్చు
పండ్లు ఫలాలను అందించు
బాటసారులు పశుపక్ష్యాదులు పరవసించు
*వృక్షో రక్షతి రక్షితః*

        

పెంట కుప్పలపై దేవుళ్ళ బొమ్మలా?

అంశం: *భగవత్ ప్రతిష్ట - మన భాద్యత*


శీర్షిక: *పెంట కుప్పలపై దేవుళ్ళ బొమ్మలా?*

*ధూమే నావ్రియాత్ వహ్నిః యధాదర్శో మీ లేన చ|*
*యధోల్బే నావృతో గర్భః తదా తేనే ద* *మావృతమ్|*

పొగ చేత అగ్ని , మురికి చేత అద్దం, మావి చేత శిశువు యెట్లు కప్ప బడిందో, అలానే కామం చేత
జ్ఞానం కప్పబడి ఉంది. అని శ్రీ కృష్ణుడు చెప్పినట్లు,

"స్వార్ధం వలన బుద్ధి, అహం వలన సహనం,
అజ్ఞానం వలన విజ్ఞానం, డబ్బు సంపద కొరకు
మంచితనం, భోగం కొరకు ధ్యానం ఆరోగ్యం,
సంపాదన కొరకు దేశ సంస్కృతి,
సాంప్రదాయాలు మరిచి పోతున్నాడు "

మనిషి శారీరకంగా ఎదుగుతున్నాడే కానీ
మనసు, బుద్ది ఎదగడం లేదు
అజ్ఞానంలో కూరుకు పోతున్నాడు

మనిషిలో స్వార్ధం పెరిగి పోయింది
మనిషి జీవితం యాంత్రికంగా మారింది
మనసు కంటే వేగంగా,
సూర్య కిరణాల కంటే వేగంగా
మనిషి డబ్బు వెంట పరుగెడుతున్నాడు
దీనికి తోడు ఇతర మతస్థుల , దేశస్థుల
కుట్రలు చాపకింద నీరులా ప్రాకుచున్నవి

అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడి పోయి
మూలాలు మరిచి పోతున్నాడు
మనిషి జన్మకు కారణమైన దైవాన్ని
సృష్టిని, ప్రకృతిని మరిచి పోతున్నాడు

తల్లి చనుబాలు త్రాగి, తల్లి రొమ్మలనే గుద్దినట్లు,
తనను సృష్టించిన సృష్టికర్తనే అవమానిస్తున్నారు
దైవానికి ఎంతటి ఘోరం జరుగుతుందో
భగవంతుడికి ఎంత అవమానం జరుగుతుందో
గుర్తించలేక పోతున్నారు
సంపాదన, హోదా, శారీరక సుఖం
మాయలో పడి పోయారు

విస్కీ బాటిల్ల పైన దేవుళ్ళ పేర్లా
వైన్ షాపులకు, చెప్పుల షాపులకు
దేవుళ్ళ పేర్లా
వైన్ సీసాల చెప్పుల ఫోటోల ప్రక్కన
దేవుళ్ళ ఫోటోలా
నిత్యం పూజించే దేవుళ్ళకు
ఇదేనా మనం పట్టే నీరాజనం ?
ఇదేనా మనమిచ్చే గౌరవం ?
ఇదేనా మన భారతీయ సంస్కృతి?

సీసాలను త్రాగి పెంట కుప్పల పైకి విసరడం
దీపావళి టపాకాయల పైనా
దేవుళ్ళ బొమ్మలు ముద్రించి
దీపావళి పండుగలు, ఇతర ఉత్సవాలలో
కాల్చడం ఎంత హేయం!
కాలిన దేవుళ్ళ కాగితం ముక్కలను తొక్కడం
కాలినవా లేవా అని చెప్పుకాలుతో
తన్నుతన్నడం ఎంతటి ఘోరం!

దేవుళ్ళ గుడులలో ప్రసాదం కవర్లపైనా
పూజా సామాగ్రి సంచులపైనా,
అనేక పూజా దినుసుల డబ్బాలపైనా ,
కవర్లపైనా, అగరు బత్తి డబ్బాలపైనా
స్త్రీలు కట్టుకునే చీరలపైనా, జాకిట్లపైనా
పెండ్లిల్లలో వాడే పరదాల పైనా
దేవుళ్ళ బొమ్మలు ముద్రించి అమ్మడం
వాటిని వాడాక వినియోగదారులు
దేవుళ్ళ బొమ్మల చిత్రాలను, బట్టలను
చెత్తబుట్టలలో వేయడం,
పెంట కుప్పల పైకి మురికి మోరీల లోకి ,
రోడ్లపైకి విసురడం ఎంతటి అవమానం!

దేవుళ్ళ చిత్రాలను,  మనుషులు,
జంతువులు త్రొక్కడమే గాకుండా
పర్యావరణం, కాలుష్యమయమై పోతుండే

అంతేనా, మరో అడుగు ముందుకు వేసి
డోర్ మ్యాట్స్ పైనా దేవుళ్ళ బొమ్మలను
ముద్రించి , తలుపుల ముందర,
బాత్రూముల ముందర వేస్తూ తొక్కడం
చూస్తుంటే మనస్సు తరుక్కుమంటుది

గతంలో ఎక్కడో విదేశాల్లో చెప్పులపై
గణేష్ చిత్రాలను ముద్రిస్తే గగ్గోలు పెట్టిన
ప్రభుత్వాలు , మీడియా వాళ్ళు
మన ఇంట్లో, మన ఇంటి ప్రక్కన,మన వీదుల్లో
జరిగే అవమానాలను చూసి చూడనట్టు
మిన్నకుండటం భావ్యమేనా?

సిరి సంపదలు కలుగాలనీ,
చదువు బాగా రావాలనీ
ఉద్యోగాలు రావాలని, సంతానం కావాలని
ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనీ
నిత్యం పూజించే దేవుళ్ళకు, దైవానికి
జరిగే అవమానాలను కానలేక
గ్రుడ్డి వారైపోతున్నారు
ఇదేనా మనం , వేదాలు, పురాణాలు,
ఇతిహాసాలు, ఋషుల నుండి
నేర్చుకున్న  సంస్కృతి ?

దేవుళ్ళ చిత్రాలను  ముద్రిండానికి
గల కారణాలు పరిశీలిస్తే,
వ్యాపారుల లాభాల వృద్ధి,
స్వార్ధం ,  డబ్బు, అవినీతి సంపద ,
అధికారం కొరకు ఆరాటం, సమాజంలో హోదా, గౌరవం కోరుకోవడం , అవగాహన లేకపోవడం
లేదా  ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా
ఉంటూ పట్టించుకోకుండా ఉండటం

అయితే, దీనికి పరిష్కారం లేదా? ఉంది.

"మనిషి తలుచు కుంటే, సాధ్యం
కాని దేముంటుంది"

"రాజు తలుచు కుంటే దెబ్బలకు కొదువా", 
అన్నట్లు
ప్రభుత్వం తలుచు కుంటే కానిదేమీ లేదు
దేవుళ్ళ బొమ్మలను, చిత్రాలను,
దేవుళ్ళ పేర్లను వాడి పారేసే
పూజా సామాగ్రి సంచుల పైనా, ప్యాకింగ్ లపైనా
వైన్స్ షాపుల పైనా, ప్రసాదం ప్యాకింగ్ ల పైనా
మిఠాయి షాపులలో, గాజుల షాపులలో
ఫాన్సీషాపలలో ఉపయోగించే,
పేపరు బ్యాగులపైనా, ప్లాస్టిక్ సంచుల పైనా, టపాకాయల పైనా, డోర్ మ్యాట్స్ పైనా,
అగరు బత్తి డబ్బాలపైనా, మరే ఇతర
వాటిపైనా , పెంట కుప్పలపై పడేసే
ప్రసాదం పాకిట్లపైనా ముద్రించ వీలు లేకుండా
ప్రభుత్వం తక్షణమే జి.వో. ను పాస్ చేయాలి

జి.వో. పాస్ చేసి చేతులు దులుపు కోకుండా
పూర్తి నియంత్రణ ఉండాలి
అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలి
వ్యాపారుల లైసెన్సులను రద్దు చేయాలి

ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు
ప్లాస్టిక్ కవర్ల బ్యాన్ విషయంలో
"పుండు ఒక చోట ఉంటే మందొక చోట"  పెట్టినట్లు,
కిరాణా షాపు వాండ్లకు , కూర ‌గాయలు
అమ్ముకునే వారి పైనా ఫైన్లు వేస్తున్నారు
డబ్బు పెట్టి కొన్న కవర్లను గుంజుకపోతున్నారు
శిక్షలు విధిస్తున్నారు

పిచుకపై బ్రహ్మాస్త్రం వేసినట్లు
ఇది సరియైన పద్దతి కాదు
ఇక్కడ షాపు వాండ్లది తప్పు కాదు
కూర గాయలు అమ్ముకునే
చిరు వ్యాపారుల దోషం కాదు
వినియోగదారులది నేరం అంతకంటే కాదు
ప్రభుత్వాలు ఇలా చేయడం అక్రమం,
అన్యాయం, అధర్మం

కవర్లను తయారు చేసే వారిది తప్పు
వారికి లైసెన్స్ లు ఇచ్చిన అధికారులది తప్పు
ఇతర దేశాల నుండి దిగుమతి
చేసుకోడానికి అనుమతి ఇచ్చిన
అధికారులది తప్పు

చిరు వ్యాపారులను శిక్షించడం కంటే
ప్రతి కుటుంబానికి రెండు డస్ట్ బిన్ లు
ఇచ్చినట్లుగానే ప్రతి కుటుంబానికి
రెండు బట్ట సంచులను ప్రతి ఇంటికి
ఉచితంగా పంపిణీ చేయాలి

ప్రభుత్వాలు దేవుళ్ళ బొమ్మలు
ముద్రించకుండా , ప్రింటర్స్ కు, వ్యాపారులకు
అవగాహన కలిగించాలి
అలానే దేవుళ్ళ బొమ్మలు ముద్రించే వారిపై
తగిన ఫైన్లు శిక్షలు వేయాలి
కానీ, పూజా సామాగ్రి అమ్మే వారిపై,
వినియోగదారులపై కాదు

సమాజంలో ప్రజలు కూడా భాగమే
ప్రజలు ముఖ్య భూమికను పోషించాల్సిన
ఆవశ్యకత ఎంతైనా ఉంది
దీనిని ప్రతిఒక్కరూ భగవత్ ప్రతిష్టగా
భావించాలి
దైవాల ఫోటోలు ముద్రించిన కవర్లను,
సంచులను, డోర్ మ్యాట్స్ ను ,
ప్యాకింగ్ లను కొనడం మాని వేయాలి
తప్పని పరిస్థితుల్లో అలా దేవుళ్ళ బొమ్మలు
ఉన్న కవర్లను , ప్యాకింగ్ డబ్బాలను, బట్టలను,
దేవుడి దగ్గరి పూలను చెట్ల మొదళ్ళో వేసినట్లు,
వీటిని ఒక చోట వేసి కాల్చి, అగ్ని దేవుడికి
సమర్పించు కున్నట్లు భావించడం ఉత్తమం.


స్వచ్ఛంద సంస్థలు, అలాంటి వాటిని
కొనకూడదని విస్తృతంగా ప్రచారం చేయాలి
దేవుళ్ళు, దేవతల ఫోటోల ముద్రణ
గురించి వివరిస్తూ , అవగాహన కలిగిస్తూ
ప్రజల కళ్ళు తెరిపించాలి
ముద్రించ కుండా ప్రభుత్వాలపై వత్తిడి తేవాలి

భారతీయ సంస్కృతి, దేశ అభివృద్ధికి ప్రతీక
భగవత్ ప్రతిష్టను , దేశ ప్రజలందరూ భాద్యతగా
తీసుకున్న రోజున , భారత దేశం ప్రపంచ
పటంలో  సాంస్కృతిక, సాంప్రదాయాలలో
ప్రధమ స్థానంలో నిలుస్తుందనడంలో
సందేహం లేదు
సర్వేజనాః సుఖినోభవంతు!

        

మెరికలు ప్రక్రియ

అంశం: ప్రక్రియ:మెరికలు

ప్రక్రియ :  మెరికలు
*రూపకర్త : శ్రీమాన్ గోపాల్ ఆచార్య*

పడుచులు వేయు ముగ్గులు *ఏవో ఏవో*
బామ్మలు చెప్పేరు మృదువుగా *వేయ్ ఏవో ఏవో*

రైతులు పంటలు పండించు *నరులకు*
కార్మికులు శ్రమించు  ఎంతో *ఇతరులకు*
యంత్రాలు పనులు చేయు *పరులకు*
దేవుడు కరుణించు నిత్యం *జనులకు*
పాడి పంటలతో పెళ్ళిళ్ళు  *వరులకు*

*ప్రేమ* ను అందించే ప్రియుడు ప్రేయసికి *ప్రేమ*
*సిగ్గు* తో వొలక బోసె నాధుడికి తన లేలేత *సిగ్గు*

ముద్దుగుమ్మ నుండే ఎంతో  *అందం*
*అందం* కాదు చంద్రుని *ప్రతిబింబం*
*ప్రతిబింబం* అద్దంలో చూడ *సుందరం*
*సుందరం* తో ఏకమాయే మాఇరువురి *బంధం*

పడుచులు వేయు ముగ్గులు *ఏవో ఏవో*
బామ్మలు చెప్పేరు మృదువుగా *వేయ్ ఏవో ఏవో*
                             *****

*మెరికలు నియమాలు*
 *మెరికలు*
నూతన ప్రక్రియ
రూపకర్త: శ్రీమాన్ గోపాల్ ఆచార్య 

* మొదటి పాదం చివర లో ఓకే అర్ధం కల రెండు పదాలు వెంట వెంటనే వచ్చి ఎండ్ కావాలి
* రెండవ పాదం చివరలో వెంట వెంటనే వేర్వేరు అర్ధంకల రెండు పదాలు రావాలి
* అంత్య ప్రాసకల 5 పాదాలు
* మొదటి పదం చివరి పదం ఒకేలా ఉన్న రెండు పాదాలు  రాయాలి
* ముక్తపద గ్రస్తంతో  5 పాదాలు
* చివరగా మొదటి రెండు పాదాలు రిపీట్ చేయాలి


      

ప్రేమ గుడ్డిదా!

అంశం: చిత్ర కవిత (గోదాదేవి )

శీర్షిక: భగ్న ప్రేమికురాలు

*ప్రేమ గుడ్డిదా!*

వేకువ జామునే లేచి
తన ప్రియుడి కోసం నదిలో స్నానమాచరించి
చిలుక పచ్చని గౌను
ముదురు ఎరుపురంగు వస్త్రాలు ధరించి
ఎడమ చేతిలో తాను ప్రేమతో అల్లిన
పూమాలను చేబూని
కుడి చేతిలో తనకు ఇష్టమైన నెమలి పింఛం పట్టి

పక్షుల కిలకిలా రావాలు
వినిపిస్తున్నాయని
ఆవుల మందలు మేతకు వెలుతున్నాయని
త్వరంగా రండి రండి అంటూ
కర్ర చేతబట్టి చెలియలను పురమాయిస్తూ
వడివడిగా నడుస్తూ

ప్రియుడిని త్వరగా మేల్కొల్పాలనీ
తన చెంతకు త్వరగా చేరాలనీ ఆరాటపడుతూ
చిన్ని క్రిష్ణుడి ప్రేమకు తపిస్తూ
ఊహా లోకంలో తేలిపోతుంది
విష్ణు చిత్తుల వారి ముద్దుల తనయ
భగ్న ప్రేమికురాలు గోదాదేవి

ప్రేమ గుడ్డిదే కావచ్చు ,
కానీ, ప్రేమలో నమ్మకం, నిజాయితీ ,
నిస్వార్ధం, సంకల్పం ఉంటే
దానిని ఏ సృష్టి ఆపలేదు

   

అడవి జీవులు

అంశం: "అడవి దివిటీలు*


శీర్షిక: *అడవి జీవులు*

ఎత్తెన  *కొండలు*
*కొండల* మధ్య  *సెలయేర్లు*
*సెలయేర్ల*  నానుకుని  *అడవులు*
*అడవుల*  మధ్య బీడు  *భూములు"
*భూముల* లో చిన్న చిన్న  *గుడిసెలు*
*గుడిసెల*  లోనే అడివి  *జీవులు*
*జీవుల* జీవితాలు నేడు *అగమ్య గోచరం*

గుండెలు మండుతున్నయి
బండలు కాలుతున్నయి
కడుపులు మాడుతున్నయి
అగ్ని జ్వాలలు ఎగురు తున్నయి!

స్వాతంత్ర్యం వచ్చి
ఏడు దశాబ్దాలు దాటినా
నేటికీ రవాణా సౌకర్యాలు
విద్యుచ్ఛక్తి సౌకర్యాలు
త్రాగు నీటి సదుపాయాలు
విద్య వైద్య సౌకర్యాలు
మృగ్యమనే చెప్పాలి

తినుబండారాలు కావాలన్నా
విద్య వైద్య అవసరాల కొరకు
అడవి ఉత్పత్తులను అమ్మాలన్నా
పది పదిహేను మైళ్ళు నడవాల్సిందే

ఐదేళ్ళకోసారి ఎన్నికలు వస్తాయి
ఎన్నికలప్పుడే నాయకులు కనబడుతారు
ఓటుకో నోటు చేతికి ఇచ్చి ,
ఆ పూటకు పావు షేర్ పోయించి
ఆ రోజు కడుపు నిండా తినబెట్టి
కనబడరు మరో ఐదేళ్ల వరకు
ఇంకెంత కాలం ఈ బానిసత్వం
ఇంకెన్నాళ్ళు  ఈ నిరంకుశత్వం
ఇంకెన్నాళ్ళు ఈ అంధకారం
మరెంకెన్నాళ్ళు ఈ ఈసడింపు
ఇంకెన్నాళ్ళు ఈ ఆటవిక జీవితాలు

ఇక నైనా ప్రభుత్వాలు గుర్తించి
అడివి జీవుల బాధలను తొలగించాలి
రవాణా, విద్య వైద్యం విద్యుత్తు
సదుపాయాలను అభివృద్ధి చేయాలి
వారి భూములను వారు సాగు చేసుకోడానికి
వారి ఉత్పత్తులను వారు అమ్ముకునే విధంగా
గిట్టుబాటు ధరలను నిర్ణయించాలి
రాజ్యాంగ హక్కులను
మన్నెం ప్రజలకు కల్పించాలి

     

Sunday, December 22, 2024

మహిళ బాగుంటె మనుగడ

 అంతర్జాతీయ మహిళాదినోత్సవం :

 *మహిళ బాగుంటె మనుగడ* 

(ప్రక్రియ: మణిపూసలు)


01.

సృష్టికి మూలం స్త్రీయే

ప్రకృతికి రూపం స్త్రీయే

స్త్రీ యే కదా భూదేవి

సహనశీలియు  స్త్రీయే!

02.

అమ్మగా ఆలిగానూ

అక్కగా చెల్లిగానూ

ఎన్నో వరుసలతో

అలరించు  ప్రేమతోనూ!

03.

అబలలు కాదు సబలలు

చదువులలోనూ మహిళలు

అనేక రంగాలలోను

ముందు నిలిచేటి మణులు!

04.

ఉద్యోగంలో వివక్ష

జీతంబులోను వివక్ష

గౌరవంలోను తేడా

మరెంతకాలమీ కక్ష!

05.

పిల్లలపై మహిళలపై

అత్యాచారాలు ఆపై

లైంగిక వేధింపులు

పిచ్చి ,బిచ్చగత్తెలపై!

06.

చట్టాలెన్నొ ఉన్నాయి

కోర్టులెన్నో ఉన్నాయి

ఎన్ని ఉన్న ఏమిఫలం

సాక్షాలు లేకుంటాయి!

07.

మనిషిలొ మార్పురావాలి

మానవత్వం విరియాలి

స్వేచ్ఛ నివ్వడమే కాదు

సాధికారత ఉండాలి!

08.

ఒక మహా పురుషుడి గెలుపు

ఒక గొప్ప పురుషుడి మలుపు

వెనుక నుండు, స్త్రీ హస్తము

గుర్తించరు వనిత మెరుపు!

09.

మహిళ బాగుంటె మనుగడ

లేదంటె ఇంట్లో రగడ

ప్రతి ఒక్కరూ మారాలి

అసభ్య రాక్షస పోకడ!

Friday, December 20, 2024

ధైర్యే సాహాసీ లక్ష్మీ

అంశం: గుప్పిట నిండా ధైర్యపు వెన్నెల


శీర్శిక: ధైర్యే సాహాసీ లక్ష్మీ

*గుప్పెడంత ధైర్యం కొండంత బలాన్నిస్తుంది*

ఈ సృష్టిలో
డబ్బు వలన తృప్తి లభించదు
సంపద వలన తృప్తి లభించదు
విద్య వలన హోదా వలన తృప్తి లభించదు
శారీరక సుఖం వలన తృప్తి లభించదు
కేవలం *విజయం* వలన తృప్తి లభిస్తుంది
*ధైర్యం* మే విజయానికి మూలం
ఆ ధైర్యం మనో నిగ్రహం వలన లభిస్తుంది
గెలుపునకు కావాల్సింది
బలం కాదు, శారీరక దృఢత్వం కాదు
గెలుపునకు కావాల్సింది
నమ్మకం, సంకల్పం, మనో ధైర్యం

నీవు భయపడుతుంటే
ఈగ దోమ కూడా నెత్తిమీద కూర్చుని
సవారి చేస్తాయి

భయపడకుండా
నీవు ధైర్యంగా ఉండి
ఎదురు తిరిగెతే
ఈగ దోమనే కాదు
ఎలాంటి వారైనా తోక జాడించాల్సిందే

ధైర్యం ఒంటరిగా ఉన్నపుడు
కొంత తగ్గవచ్చు
సమైక్యంగా ఉన్నపుడు ధైర్యం
మరింత ఇనుమడిస్తుంది

జింక ఒంటరిగా కనబడినా
దున్నలు ఒంటరిగా కనబడినా
పులి వెంటబడి పంజా విసురుతుంది
పది జింకలు లేదా పది దున్నలు
తిరుగ బడితే  పులి పలాయనం చిత్తగిస్తుంది

*ధైర్యే సాహాసీ లక్ష్మీ* అన్నారు పెద్దలు
ధైర్యం సాహాసాన్ని సంపదను
సకలం సమకూరుస్తుంది
తనకాళ్ళ మీద తాను నిలబడాలన్నా
ఎదుటి వారిని ఎదిరించాలన్నా
ప్రతి మనిషికి ఉండాలి ధైర్యం


ఆకాశంలో విహరించే
పక్షులకు క్రింద పడిపోమనే
నమ్మమే వాటికి ధైర్యం

ధైర్యం సాహసం ఉంటేనే
ఏదైనా సాధించవచ్చు
నమ్మకానికి ధైర్యం తోడైతేనే విజయం

పరిస్థితులను బట్టి కూడా
ధైర్యం ఏర్పడుతుంది
ఒక కోడి తన పిల్లలను
తన్నుకు పోయే గ్రద్ద వచ్చినప్పుడు
కోడి తరిమి కొడుతుంది

పిల్లి తన పిల్లలకు జన్మనిచ్చినపుడు
పిల్లి వంక చూస్తేనే పులిలా మారిపోతుంది
పిల్లలను రక్షించు కోడానికి గాండ్రిస్తుంది
బలం ఉన్నా లేకున్నా ధైర్యం ఉండాలి

ధైర్యం వ్యక్తిత్వం లో భాగం
ధైర్యం ఉంటే ఎలాంటి చీకటినైనా చేధించవచ్చు
నీపై నీకు నమ్మకం, క్రమ శిక్షణ ధైర్యం ఉంటే,
ఎంతటి ఉన్నత స్థాయికైనా సునాయాసంగా
చేరవచ్చు

పొట్టి శ్రీరాములు

పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా 

శీర్షిక: *ప్రాణత్యాగి*
(మినీ కవిత: ప్రక్రియ: మణి పూసలు
రూపకర్త: శ్రీ వడిచర్ల సత్యం గారు)

01.
తెలుగురాష్ట్ర జాతిపిత
పెంచెను రాష్ట్రము ఘనత
ఆమరణ ధీక్షతో
అమరుడయ్యెనూ నేత!

02.
అతి నిరాడంబరుడు
దిశా నిర్ధేశకుడు
ప్రజల చైతన్యపరిచే
వాక్పటిమ గలవాడు!

03.
మద్రాసు రాష్ట్రమున
మార్చినెల పదహారున
పొట్టి శ్రీ రాములు
జన్మించెనతడు భువిన!

04.
తండ్రి గురువయ్య గారు
తల్లి లక్ష్మమ్మ గారు
సాంప్రదాయ కుటుంబము
పెరిగె వినయముగ వీరు!

05.
ప్రత్యేక రాష్ట్రమనేది
జాతి గౌరవం అనేది
శ్రీరాములు  తత్వం
సాధించడమూ అనేది!

06.
ఉన్నత విధ్యాధికుడు
ఇంజినీర్ చదివినాడు
బహు భాషా వేత్తగా
మన్ననలను పొందాడు!

07.
మేటి సంస్కరణ వాది
ఆత్మీయతావాది
వెలకట్ట లేనట్టి
భారతీయ, ప్రతినిధి!

08.
స్థిర లక్ష్యంబు గలవాడు
పరిణత ఉపన్యాసకుడు
ఆంధ్రరాష్ట్రం నిలిపిన
స్వాతంత్ర్యసమరయోధుడు!

09.
తెల్ల దొరలను తరమడము
బానిసత్వం వదలడము
*తెలుగు వారి స్వేచ్ఛనే*
రాములు గారీ లక్ష్యము!

10.
ఉప్పుకై సత్యాగ్రహము
సహాయా నిరాకరణము
గాంధి గారితో పాల్గొనె
క్విట్ ఇండియా ఉధ్యమము!

11.
ఆలోచనలు ఉన్నతము
*మౌనం* వారి ఆయుధము
శ్రీ రాములు ఆశయంబు
*అహింస*,తన సిద్ధాంతము!

12.
ఉచిత విద్య అందాలనె
ఉచిత వైద్యమందాలనె
హరిజన వర్గం లోనూ
ఆనందం విరియాలనె!

13.
ఫలాలందరికి అందిన
స్త్రీలు నిశి తిరుగగలిగిన
రాష్ట్ర పితకుకలుగు శాంతి
ప్రజలు హాయిగ బ్రతికిన!