Friday, May 23, 2025

ప్రేమ జంట/ ఆనందాల తీరాలకు చేరి పోదామా!

కవితార్చన లో నేడు
ప్రేమ ఎంత మధురం

శీర్షిక: *ఆనందాల తీరాలకు చేరి పోదామా!*

అందాల దీవిలో ఆకాశం అంచులో
అందనంత ఎత్తుకెదిగిన ఓ నా ప్రేయసి
కనువిందు చేసే నీ ఓర చూపులతో
నను మైమరిపిస్తున్నావే
వయ్యారాల నీ సొగసులకు తన్మయం
చెందుతున్నానే!

ఓ ఊర్వశీ!  అపురూపం నీ రూపం
హంస రెక్కల వంటి నీ కనులు
చంద్రవంక వలే నీ మోము
దొండ పండు లాంటి పెదవులు
తామర కాడ వంటి నీ నడుము

కడలిలో ఎగిసిపడే కెరటాలు తీరాన్ని తాకినట్లు
నా మనసు నీ మది తీరాన్ని తాకుతుండే
వాల లేక పోతున్నా..తాళ లేక పోతున్నా..
సరిగమలు పాడలేక పోతున్నా!

తళుకు బెళుకుల విశ్వంలో
తారలు మిరిమిట్లు గొలుపే వినీలాకాశంలో
కనువిందు చేసే నెలవంక వెన్నెలలో
కలిసి పోదామా కరిగి పోదామా!

కమ్మని ఊసులు చెప్పుకుంటూ
మల్లెల పరిమళాలలో తేలియాడుతూ
మధుర ప్రేమను పండించుకుందామా 
సుందర స్వప్నాలను పంచుకుంటూ
ఆనందాల తీరాలకు చేరి పోదామా!
 

No comments: