అంశం: సంధ్యా కాలపు సరాగం
శీర్షిక: *నగర యాంత్రిక జీవితాలు*
సూర్యుడు హస్త మించు వేళలో
ఆకాశంలో వాయు కాలుష్యాలు
ఆఫీసులు షాపులు మూయు వేళలో
రోడ్ల పైన రణగొణ ధ్వనులతో వాహనాలు!
మధ్య మధ్యలో సిగ్నల్స్
నేనూ ఉన్నాను అన్నట్లు చిరు జల్లులు
ఫ్రీ బస్సులలో ఆధార్ అని కండక్టర్ అరుపులు
కారు గుద్దిందని రోడ్లపైన ఫైటింగులు!
ఎప్పుడు ఇల్లు చేరుతామో తెలియదు
పతి ఎప్పుడు వస్తాడో నని సతి
సతి ఎప్పుడు వస్తుందో ననీ పతి
అమ్మా నాన్నా ఎప్పుడు వస్తారో ననీ పిల్లలు
ఎక్కడ పోయార్రా అంటూ వృద్ధులు!
ఆఫీసులలో వ్యాపారాలలో ప్రయాణాలతో
అలసి సొలసి వచ్చిన యాంత్రిక జీవితాలకు
సంధ్యా కాలపు సరాగాలు ఎక్కడ?
చెమట దేహాలతో సమస్యల సుడిగుండాలలో!
ఇంటికి రాగానే భార్య ఒక చరవాణిలో
భర్త ఒక చరవాణిలో పిల్లలు తలొక చరవాణిలో
తల వంచుకుని లేపరు ఎవరి రూములో వారు
ఎవరి పాటలు వారివి ఎవరి ఆటలు వారివి
ఇక డిన్నరా! ఆన్లైన్ స్విగ్గీ జుమాటోలో ఆర్డర్!
No comments:
Post a Comment