*నేటి అంశం: *జీవితం అంటె*
శీర్షిక: *జీవితం అంటే నల్లేరుపై నడక కాదు*
ఎవరికీ నల్లేరుపై నడక కాదు జీవితం
ఏ ఒక్కరికీ పూల పాన్పు కాదు జీవితం
ఆరాట పోరాటాల సంగ్రామం జీవితం
సురులు అసురుల వలె సాగర మధనం!
జన్మస్థానం నుండి బయలు దేరి
ఎత్తు పల్లాలు దాటుకుంటూ
తరువులను ఝరులను రాళ్ళురప్పల
గుద్దుకుంటూ భూమిని చీల్చుకుంటూ
ఎత్తు పల్లాలు దాటుకుంటూ
చెత్తాచెదారాలను మోసుకుంటూ
ఫార్మా కెమికల్ పరిశ్రమలు విడుదల చేసిన
రసాయనాల కంపును మోసుకుంటూ
ప్రవహించే నదుల నీరు వంటిది జీవితం!
జననం నుండి మరణం వరకు
ఎన్నో ఒడుదొడుకులను కష్టసుఖాలను
బాధలు దుఃఖాలను నిందలను అపనిందలను
అవమానాలను హేళనలను భరిస్తూ
ఆనందాలను సంతోషాలను సుఖాలను
సంతృప్తులను అనుభవిస్తూ సాగే ప్రయాణమే జీవితం!
నీటిలో అనేకమైన ఖనిజాలు ఉన్నట్లే
జీవితంలో కోపతాపాలు ఈర్ష్య అసూయలు
మోసాలు ద్వేషాలు రోషాలు పగలు
కార్పణ్యాలు అరిషడ్వర్గాలు అన్నీ ఉంటాయి!
నీటిలో మినరల్స్ లేకుంటే ఎలా ఉంటుందో
జీవితంలో కష్టసుఖాలు బాధలు దుఃఖాలు
సంతోషాలు లాభాలు నష్టాలనే సంఘర్షణలు
కష్టపడకుండా అమృతం వస్తే
ఏ ఒక్కరికీ పూల పాన్పు కాదు జీవితం
ఆరాట పోరాటాల సంగ్రామం జీవితం
సురులు అసురుల వలె సాగర మధనం!
జన్మస్థానం నుండి బయలు దేరి
ఎత్తు పల్లాలు దాటుకుంటూ
తరువులను ఝరులను రాళ్ళురప్పల
గుద్దుకుంటూ భూమిని చీల్చుకుంటూ
ఎత్తు పల్లాలు దాటుకుంటూ
చెత్తాచెదారాలను మోసుకుంటూ
ఫార్మా కెమికల్ పరిశ్రమలు విడుదల చేసిన
రసాయనాల కంపును మోసుకుంటూ
ప్రవహించే నదుల నీరు వంటిది జీవితం!
జననం నుండి మరణం వరకు
ఎన్నో ఒడుదొడుకులను కష్టసుఖాలను
బాధలు దుఃఖాలను నిందలను అపనిందలను
అవమానాలను హేళనలను భరిస్తూ
ఆనందాలను సంతోషాలను సుఖాలను
సంతృప్తులను అనుభవిస్తూ సాగే ప్రయాణమే జీవితం!
నీటిలో అనేకమైన ఖనిజాలు ఉన్నట్లే
జీవితంలో కోపతాపాలు ఈర్ష్య అసూయలు
మోసాలు ద్వేషాలు రోషాలు పగలు
కార్పణ్యాలు అరిషడ్వర్గాలు అన్నీ ఉంటాయి!
నీటిలో మినరల్స్ లేకుంటే ఎలా ఉంటుందో
జీవితంలో కష్టసుఖాలు బాధలు దుఃఖాలు
సంతోషాలు లాభాలు నష్టాలనే సంఘర్షణలు
లేకుంటే అలానే సప్పగా ఉంటుంది జీవితం!
కష్టపడకుండా అమృతం వస్తే
దానికి విలువ ఏముంటుంది?
ఏది ఏమైనా జీవితానికి ఒక సార్థకత
ఏది ఏమైనా జీవితానికి ఒక సార్థకత
కీర్తి ప్రతిష్టలు సాధించాలంటే
క్రమశిక్షణ సభ్యత సంస్కారంతో పాటు
మంచి ప్రవర్తన కలిగి ఉండటం అవసరం
దానగుణం దైవగుణం సేవాగుణం
తోటి వారిపై దయ కరుణ మమత
ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఉండాలి
మేలు చేయకపోయినా కీడు తలపెట్టరాదు
భౌతికంగా లేకపోయినా పదికాలాలపాటు కీర్తింప బడాలి
అదే జీవితం అదే అసలైన జీవితం!
క్రమశిక్షణ సభ్యత సంస్కారంతో పాటు
మంచి ప్రవర్తన కలిగి ఉండటం అవసరం
దానగుణం దైవగుణం సేవాగుణం
తోటి వారిపై దయ కరుణ మమత
ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఉండాలి
మేలు చేయకపోయినా కీడు తలపెట్టరాదు
భౌతికంగా లేకపోయినా పదికాలాలపాటు కీర్తింప బడాలి
అదే జీవితం అదే అసలైన జీవితం!
No comments:
Post a Comment