Wednesday, May 28, 2025

ప్రకృతి

అంశం: *అందమైన బహుమతి*

శీర్షిక: *అద్భుతమైన బహుమతి ప్రకృతి*

ప్రకృతి జీవకోటికి దిక్సూచి 
జననం నుండి మరణం వరకు 
మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని 
ఆనందాన్ని ఆహ్లాదాన్ని సంతోషాన్ని 
ఆలోచనలను ఐడియాలను 
అందించే అందమైన బహుమతి ప్రకృతి! 

కుల మత  జాతి భాష ప్రాంత 
భేద భావాలు వైషమ్యాలు లేకుండా 
ప్రతి ఒక్కరికీ అనుక్షణం జీవిత కాలం 
ఉచితంగా లభించే అపురూప కానుక! 

మనిషి అనారోగ్యంతో ఉన్నప్పుడు 
ఔషధంలా స్వస్థతను చేకూర్చేటి 
బాధలు దుఃఖాలలో ఉన్నప్పుడు 
మనసుకు ఓదార్పునిచ్చే అపూర్వకానుక!

కోపాలు తాపాలలో ఉన్నప్పుడు 
సలహాదారులా సహనాన్ని చేకూర్చేటి 
సంఘర్షణలో ఆలోచనలో ఉన్నప్పుడు 
పరిష్కారాన్ని చూపే అద్భుత బహుమతి!

వృద్ధాప్య దశలో ఒంటరిగా లేకుండా 
తోడు నీడగా మనసుకు శాంతిని ప్రశాంతతను 
మరణించాక ఎవరికీ ఇబ్బంది కలుగకుండా 
మట్టిలో నీటిలో కలుపుకొని పోయే 
అనంతమైన శక్తి గలది *ప్రకృతి*


No comments: