అంశం:AI ల ఎలాన్ మాస్క్ గ్రోక్ ప్రభావం
(ప్రతిస్పందన)శీర్షిక: *AI సోషల్ మీడియా రెండు వైపులా* *పదునైన కత్తి*
*AI సోషల్ మీడియా రెండు వైపులా*
*పదునైన కత్తి లాంటిది*
కత్తితో పండును కోయవచ్చు
అదే కత్తితో ప్రాణాన్ని కూడా తీయవచ్చు !
"AI సోషల్ మీడియా" అలానే మంచి
చెడులతో కత్తి కంటేను రెండు వైపులా
పదునైన సాధనం
కత్తి ఒక గాయమే చేస్తుంది, కానీ సోషల్
మీడియా క్షణాలలో విప్లవాన్నే తీసుక వస్తుంది!
నేడు సోషల్ మీడియాను అతి వేగంగా
నడిపించేదే ఆర్టిఫీషియల్ ఇంటిలీజెన్స్
అందులో *ఎలాన్ మాస్క్ బ్రోక్*
ప్రభావం అంతా ఇంతా కాదు
అతను ఇప్పుడు అగ్రరాజ్యాన్ని
గుప్పిట్లో పెట్టుకున్న అపర మేధావి
స్వార్ధం గుత్తాధిపత్యం పోకడలు
అధికమనే చెప్పవచ్చు
*AI ఒక బహుళార్థ సాధక సాధనం*
అరక్షణంలో అద్భుతాలను సృష్టిస్తుంది
క్షణాలలో అనంత సమాచారం అందిస్తుంది
చిత్రాలను నిజ సంభాషణలు అందిస్తుంది
విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది!
*ఏదైనా పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు*
*అతి తెలివి వినాశనానికి దారితీస్తుందన్నట్లు*
మంచి ఎంత ఉందో అంతకు వేయి రెట్లు
చెడు ఉందనడం సందేహం లేదు
చరవాణితోనే అనేక ఇబ్బందులు
ఎదుర్కొంటున్న తరుణంలో
AI ఎలాన్ మాస్క్ గ్రోక్ తో సమస్యలు తప్పవు
*తానుపట్టిన కుందేలుకు మూడే కాళ్ళు*
అనేటి దేశాధి నేతల చేతులలో
AI ఎలాన్ మాస్క్ బ్రోక్ ఉంటే వినాశనమే
సోషల్ మీడియాలో మంచితో పాటు
నీడలా చెడు కూడా సహజమే
చెడు జోలికి పోకుండా
ఎలాన్ మాస్క్ ఆర్టిఫీషియల్ ఇంటిలీజెన్స్
మంచికి వాడుకో గలుగుతే అది స్వర్గధామమే!
No comments:
Post a Comment