కుసుమ ధర్మన్న కళాపీఠం:
తేది:03.05.25అంశం: హాస్య కవిత: హాస్యం వలన లాభమా నష్టమా
శీర్షిక: హాస్యం ఆయుష్షు పెంచుతుంది
"అవధానం చేసే వారికి చప్పట్లంటే చాలా
ఇష్టమట కదా! మరి మీకో?"
"అబ్బే! నాకు చప్పట్లంటే ఇష్టం ఉండదు.
చప్పటట్ల కంటే కారం అంట్లంటేనే ఇష్టం"
"యాపైయారు పూల నుండి ముప్పై మూడు
పోతే ఎన్నుంటై?"
"ఒక బాబు చెబుతాడు ఇరువది మూడని"
"మూడు అనేది సరైన సమాధానం" ఎలా?
"ఆరు యాప పూల నుండి ముప్పై అంటే
నష్టమై మూడు పోతే మూడు మిగులుతాయి"
"భార్య అన్నం పెడుతుంటే భర్త *పశువ*
అని అంటాడు. అప్పుడు భార్య *కోతి*
అని అంటుంది"
"*పశువ* అంటే పరిశుభ్రంగా అన్నం వడ్డించని
*కోతి* అంటే కోరినంత తినమని "
*నవ్వడం యోగం, నవ్వించడం భోగం*
*నవ్వక పోవడం రోగం* అన్నారు కవులు
హాస్యం ఆయుష్షు పెంచుతుంది
హాస్యం జ్ఞానాన్ని పెంచుతుంది
హాస్యం రోగాలను తగ్గిస్తుంది
హాస్యం కాలక్షేపం చేయిస్తుంది
హాస్యం ప్రసంగం వ్యవధి పెంచుతుంది
హాస్యం రెండు వైపులా పదునైన కత్తి కూడాను
హాస్యం అపహాస్యం కాకుండా చూసుకోవాలి
హాస్యం రెండు వైపులా పదునైన కత్తి కూడాను
హాస్యం అపహాస్యం కాకుండా చూసుకోవాలి
No comments:
Post a Comment