Tuesday, May 6, 2025

సమయస్ఫూర్తి ఒక కళ

అంశం:సమయ స్పూర్తి


శీర్శిక: సమయస్ఫూర్తి ఒక కళ

సమయం విలువైనది వెలకట్టలేనిది
అందుకే అంటారు పెద్దలు
*సమయ సందర్భాన్ని బట్టి పనులు*
*చేయాలి* అని
లేదంటే చేసిన శ్రమ పెట్టిన ఖర్చు
విలువైన సమయం  *బూడిదలో పోసిన*
*పన్నీరవుతుంది*

అనుకున్న లక్ష్యాన్ని చేరాలన్నా
గొప్ప విజయం సాధించాలన్నా
ఇచ్చిన మాట నెరవేర్చాలన్నా
సమయస్ఫూర్తి సమయపాలన అవసరం!

నాయకులు అందుకు చక్కని ఉదాహరణ
ఎన్నికలలో ఇచ్చిన హామీలను
నాలుగేళ్ల వరకూ తీర్చరు కొన్నింటిని
మరల ఎన్నికలు వచ్చినప్పుడు తీర్చేరు!

ఎదుటి వారితో మాట్లాడే టప్పుడు
సమయస్ఫూర్తి కనపరచాలి
అప్పుడే ఆ మాటకు విలువ ఉంటుంది
సమయస్ఫూర్తితో మాట్లాడటం ఒక కళ!

No comments: