అంశం:సమవర్తి
శీర్శిక: యమధర్మరాజు సమవర్తుడు
అధర్మంగా కాకుండా ధర్మంగా నడుచువాడు
అవినీతితో గాకుండా నీతిగా జీవించు వాడు
స్వార్ధంతో గాకుండా నిస్వార్థంగా నుండువాడు
భిన్నంగా గాకుండా సమానంగా చూడువాడు!
పురాణాల ప్రకారం యమధర్మరాజును
సమవర్తిగా పిలుస్తారు
అందుకు కారణం లేక పోలేదు
పాపాలు చేసి వచ్చిన వారిని
మీరు ధనవంతులా పేదలా
అని చూడకుండా సమ శిక్షలు వేస్తాడు!
ఇతిహాసాల ప్రకారం శ్రీ రాముడు
సమవర్తి గా గుర్తింపు తెచ్చుకున్నాడు
తప్పు చేసిన వారికి దండన
పేద ధనిక తేడాలు ఉండేవి కాదు
ఒక వ్యక్తి సీత పైన ఏదో వాగుతే
రాముడు సీతను లక్ష్మణుడి ద్వారా
అడవులకు పంపిన విషయం మరిచెదమా
ఇలా మరెందరో జగతిలో సమవర్తులున్నారు!
సమవర్తి అనునది మనుషులే గాకుండా
కాలానికి సహితం వర్తింప జేస్తారు
అందరికీ అనుకూలంగానూ
సమంగాను వర్తించే కాలాన్ని సమవర్తి
కాలం అని చెప్పుకోవచ్చు!
No comments:
Post a Comment