Tuesday, May 13, 2025

కులం - కుల వృత్తులు/ పద్యాలు

శీర్షిక: కులం - కుల వృత్తులు

సీ.మా:
కులములే/లనుబుట్టె/ గుణమేల/ బుట్టెను
వృత్తియే/లను బుట్టె/ ముత్య/ముగను
పనిని బ/ట్టియెకద పనినిపు/ణత్వముల్
ఇంటి పే/రులునన్ని/ యింటి/ జాడ
వర్గము/లు దెలిసె /వారినై/పుణ్యంతొ
వంశమ్ము/లును వచ్చె/ వార/సులతొ
ఎవరి రు/ధిర మెంచ /యెర్రగా/నేనుండు
వేరుచే/యకెపుడు /గర్వ/మునను
మనుషులం/త నొకటె /మమతలు /నొకటేను
జగతియం/దు జనుల /బతుకు/ జూడు
కులవృత్తి /అభివృద్ధి/ బలము దే/శానికి
కృష్ణ మా/ట వినుము/ తృష్ణ /దీర!

ఆ.వె:
కుమ్మ/రెపుడు /మెండు/ కుండల /జేసేరు
గౌడు/నెక్కు /చుండు/ తాడి /చెట్టు
పద్మ/శాలి /నేయు /బట్టలు /నేర్పుతో
కృష్ణ/ మాట /వినుము /తృష్ణ/ దీర!

ఆ.వె:
మతము/లన్ని /మనకు/ హితములే/ జగతిలో
హిందు/వులము /మనము/ బంధు/వులము
భాష /వేరు/ నైన /భావము /లొకటేను
కృష్ణ/ మాట/ వినుము/ తృష్ణ /దీర!

ఆ.వె:
మనిషి/ సంఘ/ జీవి /మనుగడ /సాగించ
నలుగు/రితొప/నులను కలిసి /జేయు
ఎవరి /వృత్తి/ నెపుడు /నేవగిం/చవలదు
కృష్ణ /మాట /వినుము /తృష్ణ/ దీర!

 

No comments: