Tuesday, May 13, 2025

నోరు మంచిదైతే ఊరంతా మంచిదే

అంశం: సామెతల కవిత - మనిషికి మాటే అలంకారం


శీర్షిక: *నోరు మంచిదైతే ఊరంతా మంచిదే*


*ముఖం మనస్సుకు సూచిక* లాగానే
*మనిషికి మాటే అలంకారం*
*నోరు మంచిదైతే ఊరంతా మంచిదే*
అనే సామెత  ఈ సందర్భంగా పుట్టిందే!

*ఇంటి వాకిలి చూసి ఇల్లాలు గుణం*
*చెప్పవచ్చు* అన్నట్లుగానే
మనిషి మాట తీరు చూసి మనిషి గుణం
చెప్పవచ్చు ననుట నగ్న సత్యం!

మనిషిమాట గయ్యాళిగా ఉంటే *గయ్యాళనీ*
మనిషి మాట కోపంగా ఉంటే *కోపిష్టనీ*
మనిషి మాట ప్రేమగా ఉంటే *దయామయుడనీ*
మనిషి మాట జాలిగా ఉంటే *సహృదయుడనీ*
మనిషి మాట విమర్శగా ఉంటే *విమర్శకుడనీ*
మనిషి మాట ఆలోచింపజేసే విధంగా ఉంటే  *జ్ఞాన వంతుడనీ*
మనిషి మాట స్వార్ధంగా ఉంటే *స్వార్ధపరుడనీ*
మనిషి మాట అతి తీయగా ఉంటే  *మోసకారుడనీ*
మనిషి మాట చెప్పేది ఒకటి చేసేది మరొకటి
అయితే *అవకాశవాది* అని ఇట్టే చెప్పవచ్చు

మాట తీరును బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని
కొంత వరకు అంచనా వేయవచ్చు
మాట భాష నడక మతం చూపు రంగు వేష
ధారనను బట్టి పూర్తిగా  పసిగట్ట వచ్చు!

*పుట్టుకతో వచ్చేబుద్ది పుడకల్లోనే పోతుంది*
అనే నగ్న సత్యాన్ని ఎవరూ మరువరాదు
మనిషి మాటలను బట్టి జాగ్రత్తగ ఉండాలి
మనలోనూ మాట తీరును మార్చుకోవాలి!

No comments: