అంశం: పక్షులు (బాల సాహిత్యం)
శీర్షిక: రంగు రంగుల పక్షులు
అదిగదిగో పిల్లలు
రంగు రంగుల పక్షులు
ఊర పిచ్చుకలు రామ చిలుకలు
గొర్రెంకలు పావురాలు "అదిగదిగో"
కిలకిలా రావాలతో
గోడల మీద వాలుతూ
చెట్ల మీద ఎగురుతూ
ముచ్చటించుకుంటాయి "అదిగదిగో"
ఉషోదయం వేలలలో
గడియారంలా నిద్రలేపుతాయి
మనసుకు ఉల్లాసాన్నిస్తాయి
ఉత్సాహాన్ని కలిగిస్తాయి "అదిగదిగో "
ఎక్కడెక్కడో తిరుగుతూ
పండ్లను ఫలాలను తింటూ
అక్కడక్కడా రెట్టలు వేస్తూ
మొక్కలను పుట్టిస్తాయి "అదిగదిగో"
గోడల మీద నీటిని పెడుతూ
దాపుననే ఆహారం పెడుతూ
పక్షులను కాపాడు కుందాం
ప్రకృతిని రక్షించు కుందాం "అదిగదిగో"
No comments:
Post a Comment