అంశం:శ్రామిక గేయాలు
శీర్షిక: "ఎగురవే జెండా....*
పల్లవి:
ఎగురవే జెండా...ఎర్ర ఎర్రని జెండా....
ఎగురవే జెండా... ఆకాశం నిండా....
కార్మికుల కడుపులు నిండేదాకా....
శ్రామికుల శ్రమదోపిడి ఆగేదాకా.... "ఎగరవే"
చరణం:01
పని గంటలు పెరిగాయీ...
వేతనాలు ఆగాయీ...
బెనిఫిట్స్ పోయాయీ....
వత్తిళ్ళు పెరిగాయీ..... "ఎగురవే"
చరణం:02
గ్లోబలైజేషన్ అయ్యింది...
లిబరలైజేషన్ వచ్చిందీ..
ప్రవేటైజేషన్ ముంచిందీ...
ప్రభుత్వం విధానాలు మార్చిందీ.. "ఎగురవే"
చరణం:03
వస్తువుల ధరలు పెరిగాయి..
పిల్లల ఫీజులు పెరిగాయి....
ఉద్యోగ భద్రత పోతుందీ....
బ్రతుకు భారంగా మరిందీ..... "ఎగురవే"
చరణం:
శ్రామికుల శ్రమదోపిడి ఆగేదాకా...
కార్మికుల స్థితి గతులు మారే దాకా...
పెట్టుబడి దారీ వ్యవస్థ పోయేదాకా..
చట్టాలతో భద్రత పెరిగే దాకా... "ఎగురవే"
No comments:
Post a Comment