అంశం: మొక్కలు
శీర్షిక: మామిడి మొక్కలు
ఆహా ఓహో మొక్కలు
అందమైన మొక్కలు
పచ్చ పచ్చని మొక్కలు
పసందైన మొక్కలు! "ఆహా ఓహో"
భూమిని చక్కగ త్రవ్వాలి
మట్టిని చదును చేయాలి
పిక్కలు లోతుగా నాటాలి
నీటిని పలుచగ చల్లాలి! "ఆహా ఓహో"
చక్కగ ఎరువును చల్లాలి
రోజూ నీటిని చల్లాలి
ఎండా గాలి తగలాలి
మొలకెత్తే వరకు చూడాలి! "ఆహాఓహో "
మొక్కలు బాగా పెరిగాక
దూరం దూరం నాటాలి
చెట్లు పెరిగి కాయలు కాశాక
మామిడి పండ్లు కోసుకు తినాలి! "ఆహా ఓహో"
No comments:
Post a Comment