Friday, May 9, 2025

శిశిరాలు

శీర్షిక: *శిశిరాలు*


ఓహో:
అంద చందాల సుగుణాల రాణి
సుందరం సుమధురం నీ వాణి
కలవో మాయవో  పూబోణి
మా ఇంటి మహాలక్ష్మివి  గృహిణి!

ఆహా!
అరవిరిసిన మందారంలా మోము
తలపైన పలుచటి నీ పైట కొంగు
నుదుటి భాగాన  సింధూరం బొట్టు
చేతుల నిండా బంగారు గాజులు!

అకటా!
నెమలి పింఛం కన్నుల వలె పట్టుచీర
పంచవన్నెల చిలుక రంగులో జాకిట్టు
కళ్ళకు కళ్ళ జోడు మెడలో వజ్రాల గొలుసు
కాళ్ళకు ఎత్తు మడిమల చెప్పులు

వావ్!
అదిరింది నీ ఆహార్యం
నడుస్తుంటే చూడాలి నీ అందం
చెదిరి పోతారు రోడ్లపైన జనం
అందుకే కలిసి పోదాం జంటగా మనం!




No comments: