తేది:01.05.25
అంశం: మేడే
శీర్షిక: *ఎక్కడ వేసిన గొంగళి అక్కడే*
*ప్రభువెక్కిన పల్లకి కాదు....*
*దానిని మోసిన బోయలెవ్వరు..*
*తాజ్ మహల్ అందాలు కాదు...*
*దానికి రాళ్ళెత్తిన కూలీలెవరు..*
*పరమభక్ష పరమాన్నాలు కాదు..*
*దాని వెనుక ఆత్మ హత్యలు చేసుకునే రైతులెవరు..*
చికాగో లో పురుడు పోసుకుని
సూర్య కాంతి వేగంతో
ప్రపంచం నలుమూలలా వాయువులా
అగ్ని కణాలై రగులుతున్న మేడే
ప్రపంచ కార్మికుల కడుప మంట
ఏదో ఒక రోజు అగ్ని పర్వతమై పోయి
భూస్వామ్య వ్యవస్థను
పెట్టుబడి దారీ వ్యవస్థను
స్వార్ధ అవినీతి ప్రభుత్వాలను
బద్దలు కొడుతారు శ్రామికులు
*పిల్లి యే కదా అని దానిని*
*నాలుగు గోడల మధ్య బంధిస్తే*
*అది పులిగా మారి రక్కుతుంది*
*రక్తాన్ని చిమ్ముతుంది*
*కండలను చీల్చుకుంది*
అలానే జరిగిందే అదే *మేడే*
ఎన్నో దశాబ్దాలు గడిచినా
నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందాన
ప్రతి యేటా మేడే లు జరుగుతున్నాయి కానీ
కార్మికుల సమస్యలు
పరిష్కారం కాక పోవడమే కాదు
పై పెచ్చు పెరుగు తున్నాయి
లిబరలైజేషన్ ప్రవేటైజేషన్ గ్లోబలైజేషన్
పుణ్యమా అని మూడు దశాబ్దాల క్రితమే
ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది
పని గంటలు పని దినాలు పెరిగాయి
కార్మిక చట్టాలను తుంగలో తొక్కారు
జీతాలు పెంచడం లేదు
బెనిఫిట్స్ అడుగతే చేతులు ఎత్తేశారు
కొత్త పెన్షన్ విధానం తీశేశారు
పన్నులు పెంచుతూ పోతున్నారు
దిగి పోయే వారికి సొమ్ములు ఆలస్యం చేసారు
కట్టెల మోపులా
కార్మికులు కలిసి కట్టుగా ఉండి
పిడికిలి బిగిస్తే ఏదైనా సాధించ గలరు
అగ్ని పర్వతం బద్దలవగలదు!
No comments:
Post a Comment