Wednesday, May 14, 2025

అనురాగ దేవతలు సిస్టర్లు

*అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు:*

అంశం: నర్సులు

శీర్షిక: *అనురాగ దేవతలు సిస్టర్లు*

నర్సులు పేషంట్ల పాలిట దేవతలు
కరుణ దయ ప్రేమ నర్సులకు ఆభరణాలు
ఉదయం పగలు రాత్రి అని తేడా లేకుండా
*మానవ సేవయే మాధవ సేవయంటూ*
షిఫ్ట్ లా మాదిరిగా సేవలందిస్తారు!

నిత్యం పరిశుభ్రంగా తయారై చురుకుగా ఉంటూ
తళతళ మెరిసే ధవళ వస్త్ర ధారణతో
చిరు నవ్వుతో రోగులను పలుకరిస్తూ
సమస్యలను అడిగి తెలుసుకుంటూ
డాక్టర్ల కంటే మిన్నగా సేవలు అందిస్తూ
పేషెంట్లకు దగ్గరగా ఉంటూ
విసిగించిన కోపగించిన ఓర్పుతో వింటూ
వారు అడిగిన సందేహాలకు నేర్పుతో
సమాధానాలిస్తూ ఓదార్చుతూ ధైర్యంచెబుతూ
డాక్టర్లు వ్రాసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం
మందులను ఇస్తూ ఇంజెక్షన్లు చేస్తూ
కంటికి రెప్పలా ఒక సిస్టర్ గా
నిత్యం రోగుల సేవలో తరించి పోయే
అనురాగ దేవతలు సిస్టర్లు
విద్యార్థులకు గురువులా
పేషెంట్లకు *సిస్టర్* లా 
గొప్పగా పిలువబడుతారు!

ఎన్ని షిఫ్ట్ లు మారినా ఎన్ని విధాలుగా
సేవలు చేసినా నర్సులకు సదుపాయాలు
స్టైఫండ్ లు/ వేతనాలు నామమాత్రమే

నర్సులకు  సౌకర్యాలు భద్రత కల్పించాలి
స్టైఫండ్/వేతనాలు పెంచాలి
పని గంటలు తగ్గించాలి!
ప్రతి ఒక్కరూ నర్సులను గౌరవించాలి!

No comments: