Saturday, May 17, 2025

విరహ వేదన

 అంశం:విరహ వేదన


శీర్శిక: *దేహమున్నంత కాలం దాహం తప్పదు*

ఏ జంతువును చూసినా ఏ పక్షిని చూసినా
ఏ కీటకాన్ని చూసినా కనబడదు ఎప్పుడూ
మనిషుల్లో ఉన్నంత విరహ వేదన!

కుక్క కైనా నక్క కైనా ఊరపిచుక కైనా
బొద్దింక కైనా బల్లికైననూ
ఒక నియమం ఒక సమయం ఉంటుంది
ఒక కార్తె ఋతువు ఒక కాలం ఉంటుంది!

ఎనుబది నాలుగు లక్షల జన్మల పుణ్యఫలం
మనీషిగా జన్మించడం వలన కాబోలు
మనిషికి ఒక సమయం ఒక నియమం
ఒక ఋతువు కాలం అంటూ ఏమీ లేదు
మేలికతో ఉండి జీవించి నంత కాలం
విరహ వేదనే ఉంటుంది
అనారోగ్య కారణాలను మినహాయిస్తే!

అది మనిషి తప్పు కాదు, సృష్టి రహస్యం
ఇది ఎవరూ కాదనలేని నగ్న సత్యం
*ముక్కన్నంత కాలం పడిశం తప్పదు* అన్నట్లు
*దేహమున్నంత కాలం దాహం తప్పదు* అన్నట్లు
ఎవరు అవునన్నా కాదన్నా
మనిషి బ్రతికున్నంత కాలం
అలవాటయ్యాక విరహం తప్పదు!

అందుకే సమాజంలో అనేక అనాగరిక
సంఘటనలు వింటుంటాం చూస్తుంటాం
చట్టాలు సహితం కేసులు భరించలేక
సహజీవనానికి పచ్చ జెండా ఊపింది!

అయితే, పశుపక్ష్యాదులకు లేని
విచక్షణా జ్ఞానాన్ని
భగవంతుడు మనిషికే ఇచ్చాడు
అందుకే మనిషి క్రమశిక్షణను పాటించాలి
స్వీయ నియంత్రణలో ఉండాలి
దేశ సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలి
లేదంటే శిక్షలు అనుభవించాలి!

No comments: