అంశం: అందని ద్రాక్షలు
శీర్షిక: *దుఃఖానికి కారణం ఆశలు కోరికలు*
*మనిషికి ఆశలు అనంతం*
*అవకాశాలు అత్యల్పం*
గౌతమ బుద్ధుడు చెప్పినట్లుగా
"దుఃఖానికి కారణం ఆశలు కోరికలు"!
కోరికలు గుర్రాలైనపుడు
ఆశలు కోరికలు తీరనపుడు
అవకాశాలు మృగ్యమైనపుడు
అగ్ని పర్వతం బద్దలైనట్లుగా
మనిషి ఆవేదన చెందుతాడు దుఖిస్తాడు
నీటి చెలెమ వలె కన్నీరు మున్నీరవుతాడు!
లేని వాటి కొరకు అందని వాటి కోసం
స్థాయికి మించి తాహత్తుకు మించి
ఆశలు పెంచుకుంటే ఆవేదనే మిగులుతుంది
కోరికలు కొండ చిలువలైతే కోరలు చాచుతాయి!
కోనేరుకు కొలతలు కోరికలకు అంతు లేదు
సైకిల్ ఉన్నవాడికి స్కూటర్ కావాలనీ
స్కూటర్ ఉన్నోడికి టాటా కారు కావాలనీ
టాటా కారు వచ్చాక బెంజి కారనీ
బెంజ్ కారు వచ్చాక విమానమనీ!
*తోటి వారు తొడ కోసుకుంటే నేను మెడ*
*కోసుకుంట అన్న చందంగా*
వ్యవహరిస్తే చివరికి మిగిలేది అప్పులు
అవి పెరిగి పెరిగి మనిషికి తిప్పలు
చివరికి ఆత్మహత్యలకు దారితీస్తాయి
గ్రామాలలో జరిగే ఆత్మహత్యలన్నీ అవే!
అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్లుగా
అత్యాశ దుఃఖానికి చేటు
స్థిత ప్రజ్ఞతతో ఇంద్రియ నిగ్రహంతో
కోరికలు గుర్రాలైనపుడు
ఆశలు కోరికలు తీరనపుడు
అవకాశాలు మృగ్యమైనపుడు
అగ్ని పర్వతం బద్దలైనట్లుగా
మనిషి ఆవేదన చెందుతాడు దుఖిస్తాడు
నీటి చెలెమ వలె కన్నీరు మున్నీరవుతాడు!
లేని వాటి కొరకు అందని వాటి కోసం
స్థాయికి మించి తాహత్తుకు మించి
ఆశలు పెంచుకుంటే ఆవేదనే మిగులుతుంది
కోరికలు కొండ చిలువలైతే కోరలు చాచుతాయి!
కోనేరుకు కొలతలు కోరికలకు అంతు లేదు
సైకిల్ ఉన్నవాడికి స్కూటర్ కావాలనీ
స్కూటర్ ఉన్నోడికి టాటా కారు కావాలనీ
టాటా కారు వచ్చాక బెంజి కారనీ
బెంజ్ కారు వచ్చాక విమానమనీ!
*తోటి వారు తొడ కోసుకుంటే నేను మెడ*
*కోసుకుంట అన్న చందంగా*
వ్యవహరిస్తే చివరికి మిగిలేది అప్పులు
అవి పెరిగి పెరిగి మనిషికి తిప్పలు
చివరికి ఆత్మహత్యలకు దారితీస్తాయి
గ్రామాలలో జరిగే ఆత్మహత్యలన్నీ అవే!
అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్లుగా
అత్యాశ దుఃఖానికి చేటు
స్థిత ప్రజ్ఞతతో ఇంద్రియ నిగ్రహంతో
హుందాగా జీవితం సాగించాలి
అప్పుడే మనిషి ఆనందంగా సంతోషంగా
తృప్తిగా వర్తమానాన్ని ఆస్వాదిస్తాడు
అనుకున్న తన లక్ష్యాన్ని చేరుకుంటాడు!
అప్పుడే మనిషి ఆనందంగా సంతోషంగా
తృప్తిగా వర్తమానాన్ని ఆస్వాదిస్తాడు
అనుకున్న తన లక్ష్యాన్ని చేరుకుంటాడు!
No comments:
Post a Comment