అంశం: అహింస శక్తి
శీర్శిక : *అహింస శక్తి అనంతం*
అహింస శక్తి అనంతం
అది నిలుస్తుంది దిగంతం
అహింసతో దేశం ప్రశాంతం
ప్రశాంతతతో ప్రజలు జరుపుకునేరు వసంతం!
అహింసో పరమో ధర్మః
భారత దేశానికి ఇది చక్కని తార్కాణం
అహింసతో సాధించే గాంధీ స్వాతంత్ర్యం
బంకించందర్ చటర్జీ రచించే వందేమాతరం!
అహింస ప్రేమ దయ కరుణకు చిహ్నం
ప్రేమతో సాధించవచ్చు ఏదైనా నిరంతరం
ఇది భగవద్గీత చెప్పిన నీతి సూత్రం
ఈ నీతి సూత్రం దిగంతాలకు పరమ మంత్రం!
గౌతమ బుద్ధుడు రామకృష్ణ పరమహంస
స్వామి వివేకానంద మహాత్ముడు మరెందరో
అహింసయే పరమ పవిత్రంగా భావించి
అఖండ ఖ్యాతిని పొందారు
భారత దేశ పరిమళాలు విశ్వాన వెదజల్లిరి!
No comments:
Post a Comment