అంశం: సిగ్మాలు
శీర్షిక: *ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి*
ఉగ్రవాదులు *ఎందుకు* యాత్రికుల పట్టుకుని
నీవు హిందువా అని అడిగారు?
ఉన్మాదులు *ఎందుకు* హిందువులనే
కాల్చి చంపారు?
ఉగ్రవాదుల లక్ష్యం *ఏమిటి*?
హిందువులతో సంబంధం *ఏమిటి*?
*ఎలా* ఉగ్రవాదులు పహెల్గాం లో చొరబడ్డారు?
*ఎలా* తప్పించుకుని పారి పోయారు?
*ఎప్పుడు* ఉగ్రవాదులు కాశ్మీర్ వచ్చారు?
*ఎప్పుడు* హిందువులను టార్గెట్ చేశారు?
*ఎక్కడ* ఉగ్రవాదం పుట్టింది?
*ఎక్కడ* ఉగ్రవాదులకు శిక్షణ జరుగుతుంది?
ఎవరి *చేత* ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ?
ఎవరి *చేత* ఉగ్రవాదులకు ప్రోత్సాహం లభిస్తుంది?
*ఎవరు* దీని మూల కారకులు ?
*ఎవరు* దీనికి డబ్బు సమకూరుస్తున్నారు?
చూస్తే సామాన్యుల *వలె* కనబడుతారు .
ఎంతో అమాయకుల *వలె* జనాలలో తిరుగుతారు.
*ఇలా* హిందువులను చంపి ఏమి సాధించాలనుకుంటున్నారు?
*ఇలా* మనుషులను చంపుతే మోక్షం లభిస్తుందని నమ్ముతున్నారా?
*అలా* అయితే ఉగ్రవాదులు చాలా ప్రమాదకరం.
*అలా* అయితే ప్రపంచ దేశాలన్నీ ఏకమై
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి.
No comments:
Post a Comment