Friday, May 2, 2025

2 వెండి కొడలలో రక్తపు టేరులు 25

శీర్షిక: వెండి కొండలలో రక్తపుటేరులు 


వారు కల్మషం లేని పసి మనసులు 
కల్లా కపటం ఎరుగని పసిడి హృదయాలు 
ఎన్నో ఆశలతో ఎన్నెన్నో ఊహలతో
వెండి కొండలను దర్శించాలని
కలిసి వెళ్ళారు యాత్రికులతోవిహారయాత్రకు! 

"ఏ నిమిషానికి ఏమి జరుగునో "అన్నట్లుగానే 
కాశ్మీర్ లో అనంతనాగ్ జిల్లా పహల్గాం
ప్రదేశం ఒక మినీ స్విట్జర్లాండ్ లోయలో
విరుచుకుపడిరి ఉన్మాదులు విహార యాత్రికులపై!

ఒక్కొక్కరి పురుషుల ప్యాంట్లూడదీసి 
హిందూ అని నిర్ధారించుకుని మోకాళ్ళమీద కూర్చోబెట్టి ఇరువదిఏడు మందిని పిట్టలను 
కాల్చినట్లు కాల్చారు ఉగ్ర మూకలు 
వెండి కొండలు వణికే తూటాల శబ్దాలకు 
కుంకుమ పువ్వు తడిసి ముద్దాయే రుధిర ధారలతో!

చంప వద్దని వేడుకున్నా కనుకరించలేదు
మహిళల నుదుటి సింధూరం చెదిరిపోయే
తల్లిదండ్రులు పిల్లలు అనాధలాయే
*నన్నుకూడా చంపండని వేడుకునగా*
*నిన్ను చంపం, మోడీకి చెప్పుకో మనిరి*
ఏమిటీ వీరి ధైర్యం? ఎవరు వీరి వెనుక బలం?
హెచ్చరిస్తున్నారా?  రెచ్చగొడుతున్నారా?

విహారయాత్రకు వెళ్ళడం శాపమా? 
హిందువుగా పుట్టడమే పాపమా ?
ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలి 
ఉన్మాదం పై ఉక్కు పిడికిలి బిగించాలి

No comments: