Friday, May 2, 2025

హృదయ స్పందన

అంశం: ట్యూన్ లిరిక్స్


శీర్షిక: హృదయ స్పందన

పల్లవి:
అతడు:
చల చల్లనీ చలిలోన ...
మంచేమో కురుస్తుందీ
ఒల్లంతా పులకరించెనే...
నిన్ను చూడగానే ఓ.. ప్రీతి..
తన్మయం చెందితినే.......
నా హృదయానా  కేరింతలు ...
ఉత్తుత్త వనుకోకే........              "చల చల్లని"

చరణం:01
ఎంతగానో హాయిఉందే
నీవు ఉన్నా వంటే ప్రాణమొచ్చిందే...
నా వెంట ఉంటే చాలు అదే నాకు పదివేలు..
నా ఆనందాలు ఉప్పొంగి పోతున్నవే
నా కంటిలో కనుపాపవే....
నా గుండెలో కోవెలవే....
నా హృదయాన కేరింతలు ...
ఉత్తుత్త వనుకోకే...                      "చల చల్లని"

చరణం: 02
ఏమైందో ఏమో నాకు తెలియదు...
నీవంటే నాకూ సంతోషమే...
నీ రూపమే నాకు నచ్చిందే....
నీ శ్వాసనే నా శ్వాస నే....
నా కఠంలో శ్వాస ఉన్నంతవరకూ
నిన్ను ప్రాణంగా చూసుకుంటానే...
నా హృదయాన కేరింతలు...
ఉత్తుత్తి వనుకోకే....                   "చల చల్లని"

చరణం:03
చిట పట చినుకులు పడుతున్నవే...
చినుకుల్లో ఇద్దరం ముద్దైయి పోతిమే...
తడిసిన బట్టల్లోన నీ అందాలు...
నన్ను మురిపిస్తున్నాయే....
నాకు మత్తెక్కిస్తున్నాయే....
ఇంతా చక్కని సొగసులు ఇలలోనే చూడలేదే
నేను కలలోనూ చూఠలేదే...
నా హృదయాన కేరింతలు..
ఉత్తుత్త వనుకోకే.......                  "చల చల్లని"

No comments: