అంశం: శిశిరాలు
శీర్షిక: నీవు మనిషివైతే ఎంత బాగుండునో
ఆహా!
తళుకు బెళుకు నక్షత్రాలను చూస్తూ
సూర్య చంద్రుల అందాలను ఆస్వాదిస్తూ
పడి లేచే తోకచుక్కలను గమనిస్తూ
బలే బలే మురిసి పోతున్నావే!
ఓయ్!
అటు ఇటు చూడకు చెక్క బొమ్మ లాగా
అంద చందాలు చూడు ఆరబోసాను ఇక్కడ
అడ్డు అదుపు లేక ఎగిసి పడుతున్నాయి
గడిచిన సమయం తిరిగి రాదు సుమా!
హలో!
చెదురు ముదురు వర్షంలో వణికి పోతున్నా
పగలు రేయి అనక ప్రేమిస్తానన్నావే
ఊరు బయట ఎత్తుకుని తిరుగుతా నన్నావే
శిలగా మారిపోయావే ఇప్పుడు!
ఓహో!
పైకి కిందికి నన్ను చూస్తే నీ పరువు పోతుంది కదూ
ఉలుకు పలుకు లేకపోవడానికి మూగవాడివి కదూ
తట్టినా కొట్టినా కదలవు నీవురోబోవు కదూ
నీవు మనిషివైతే ఎంతబాగుండునో!
అయ్యో!
టప టప రాలే వాన చినుకులకు
గజగజ వెతుకుతుంది మేను
డగ్ డగ్ మని కొట్టుకుంటుంది గుండె
కలల రాజా!...అలుము కోవా!
No comments:
Post a Comment